India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వచ్చే ఏడాది సిలబస్‌ను 15% తగ్గిస్తారని, ఓపెన్ బుక్ ఎగ్జామ్స్ నిర్వహిస్తారంటూ వస్తున్న వార్తల్ని CBSE ఖండించింది. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దని, అప్రమత్తంగా ఉండాలని విద్యార్థులు, టీచర్లకు సూచించింది. పరీక్ష విధానంలో ఎలాంటి మార్పులు చేయలేదని, అప్డేట్ ఉంటే అధికారిక <
GOLD LOANS ప్రక్రియలో భారీ మార్పు జరగబోతోంది. బ్యాంకులు, NBFCలు నెలవారీ రుణ విమోచన స్కీమ్స్ తెస్తున్నాయి. ఇకపై రుణం మంజూరైన తర్వాత నెల నుంచే కస్టమర్లకు EMI సౌకర్యం కల్పించనున్నాయి. దీంతోపాటు టర్మ్ లోన్ ప్రత్యామ్నాయాలనూ పరిగణనలోకి తీసుకుంటున్నాయి. ప్రస్తుతం గోల్డ్ లోన్ తీర్చాలంటే కాలపరిమితి పూర్తయ్యాక అసలు, వడ్డీ కలిపి చెల్లించడం ఒక పద్ధతి. కస్టమర్లకు డబ్బు రాగానే పాక్షికంగా చెల్లించడం రెండోది.
రామ్ పోతినేని 22వ సినిమా ‘రాపో22’ పూజ కార్యక్రమం ఎల్లుండి జరగనుంది. నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ విషయాన్ని ప్రకటించింది. పచ్చిగోళ్ల మహేశ్ బాబు ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. మూవీకి సంబంధించిన పోస్టర్ ఆసక్తిని రేపుతోంది. విలేజ్ రూరల్ రస్టిక్ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా ఉంటుందని మూవీ వర్గాలు చెబుతున్నాయి. మిగిలిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో వెల్లడిస్తామని పేర్కొన్నాయి.
గతంలో తన సినిమాలు సరిగా ఆడని సమయంలో బ్రాతూంకు వెళ్లి ఎంతగానో ఏడ్చేవాడినని బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ తెలిపారు. సినిమాలు సరిగా తీయక ప్రేక్షకులకు కనెక్ట్ కాలేకపోయినట్లు ఆ తర్వాత గుర్తించానన్నారు. మనం ఫెయిల్ అయినప్పుడు ఎక్కడ తప్పు జరిగిందో తెలుసుకొని ముందుకు సాగాలని చెప్పారు. జీవితం తన పని అది చేసుకుంటూ పోతుందని, ప్రపంచం మనకు వ్యతిరేకం కాదనే విషయాన్ని గుర్తించుకోవాలని ఆయన ఓ సమ్మిట్లో చెప్పారు.
మణిపుర్‌లో పరిస్థితుల్ని చక్కదిద్దేందుకు వెంటనే జోక్యం చేసుకోవాల్సిందిగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే లేఖ రాశారు. గత 18 నెలలుగా హింసాత్మక ఘటనలతో అట్టుడుకుతున్న మణిపుర్‌లో ఇప్పటికే 300 మంది ప్రాణాలు కోల్పోయారని వివరించారు. మణిపుర్ సమస్యకు పరిష్కారం చూపాలని, ప్రజల హక్కులు, ఆస్తుల పరిరక్షణకు వెంటనే జోక్యం చేసుకోవాలని లేఖలో కోరారు.
భక్తుల రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే శబరిమలకు 26 స్పెషల్ రైళ్లను నడపనుంది. తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల మధ్య ఇవి ప్రయాణించనున్నాయి. నవంబర్ 18, 20, 22, 24, 25, 27, 29 తేదీల్లో.. డిసెంబర్ 1, 2, 4, 6, 8, 9, 11, 13, 15, 16, 18, 20, 22, 23, 25, 27, 29, 30.. జనవరి 01 తేదీల్లో అందుబాటులో ఉండనున్నాయి. భక్తులు స్పెషల్ రైళ్లను సద్వినియోగం చేసుకోవాలని రైల్వే అధికారులు కోరారు.
TG: వికారాబాద్ జిల్లా లగచర్ల దాడి ప్రధాన నిందితుడు సురేశ్‌కు కొడంగల్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఇతనితో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. ముగ్గురు నిందితులను కొడంగల్ నుంచి సంగారెడ్డి జైలుకు తరలించనున్నారు. లగచర్ల దాడి కేసులో A2గా ఉన్న సురేశ్ ఇవాళ పోలీసుల ఎదుట లొంగిపోయిన విషయం తెలిసిందే. A1 పట్నం నరేందర్ రెడ్డిని ఇప్పటికే అరెస్ట్ చేశారు.
AP: హైవేల తరహాలో రాష్ట్ర రహదారులపైనా టోల్ ఫీజు విధింపునకు యోచిస్తున్నట్లు CM చంద్రబాబు అసెంబ్లీలో తెలిపారు. ప్రయోగాత్మకంగా గోదావరి జిల్లాల్లో అమలు చేద్దామని ప్రతిపాదించారు. దీనిపై MLAల అభిప్రాయం కోరగా ఆలోచన బాగుందని అందరూ మద్దతు పలికారు. టోల్ వద్దంటే గుంతల రోడ్లపైనే తిరగాల్సి వస్తుందని CM అన్నారు. గ్రామాల నుంచి మండలాల వరకు బైక్‌లు, ఆటోలు, ట్రాక్టర్లకు టోల్ నుంచి మినహాయింపు ఉంటుందని పేర్కొన్నారు.
AP: నవంబర్ 21న దక్షిణ అండమాన్ సముద్రం, దాని పరిసర ప్రాంతాల్లో ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని రాష్ట్ర నిర్వహణ శాఖ తెలిపింది. నవంబర్ 23 నాటికి ఇది అల్పపీడనంగా మారుతుందని, ఆ తర్వాత వాయుగుండంగా బలపడుతుందని పేర్కొంది. దీని ప్రభావంతో ఈ నెల 27, 28 తేదీల్లో కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. రైతులు ఇప్పటి నుంచే వ్యవసాయ పనుల్లో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
లగచర్ల ఘటనలో వాస్తవాలను తొక్కిపెట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం యత్నిస్తోందని BRS కార్యనిర్వాహక అధ్యక్షుడు KTR ట్విటర్‌లో ఆరోపించారు. ‘లగచర్లకు పట్టపగలు వెళ్లిన మహిళా సంఘాల నేతలపైనా దౌర్జన్యమా? కొడంగల్ ఏమైనా పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉందా? ఇప్పటికే లగచర్లలో కాంగ్రెస్ కిరాతకం ఢిల్లీకి చేరింది. మీ అరాచకపర్వంపై తీవ్ర చర్చ జరుగుతోంది. లగచర్లలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలి’ అని డిమాండ్ చేశారు.
Sorry, no posts matched your criteria.