News September 30, 2024

హిట్‌మ్యాన్ అరుదైన ఘనత

image

కాన్పూర్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ సిక్సుతో తన ఇన్నింగ్స్ మొదలుపెట్టారు. దీంతో తొలి బంతికే సిక్స్ కొట్టిన నాలుగో భారత ప్లేయర్‌గా నిలిచారు. 2006లో WIపై ధోనీ, 2012లో NZపై జహీర్ ఖాన్, 2013లో AUSపై సచిన్ ఫస్ట్ బాల్‌కే సిక్స్ కొట్టారు. కాగా, హసన్ మిరాజ్ బౌలింగ్‌లో 23 పరుగుల వద్ద రోహిత్ బౌల్డ్ అయ్యారు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 285 పరుగులకు డిక్లేర్ చేసింది.

News September 30, 2024

PM E-DRIVEకు క్యాబినెట్ ఆమోదం

image

దేశంలో EVల వినియోగాన్ని మ‌రింత ప్రోత్స‌హించ‌డానికి ఉద్దేశించిన PM E-DRIVEకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ స్కీం కింద రెండేళ్ల పాటు రూ.10,900 కోట్ల ప్రోత్సాహ‌కాలు ఇవ్వనున్నారు. E-2Ws, E-3Ws, E-అంబులెన్స్‌లు, E-ట్రక్కుల వినియోగాన్ని ప్రోత్సహించడానికి రూ.3,679 కోట్లు, ఛార్జింగ్ వసతులు, E-బస్సుల కోసం మిగిలిన మొత్తాన్ని ఉపయోగిస్తారు. రేప‌టి నుంచి(మంగ‌ళ‌వారం) ఈ స్కీం అమ‌లులోకి రానుంది.

News September 30, 2024

కాంగ్రెస్ వాళ్లు అటు వైపు వెళ్లకండి: KTR

image

TG: ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇళ్లు కట్టిస్తామని చెప్పింది కానీ కూలుస్తామని ఎందుకు చెప్పలేదని మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. ‘ప్రజలు విపరీతమైన కోపంతో ఉన్నారు. సీఎం రేవంత్‌ను, కాంగ్రెస్ నేతలను జీవితంలో ఎన్నడూ విననన్ని బూతులు తిడుతున్నారు. దయచేసి మీరు బాధితుల ఇళ్ల వైపు వెళ్లకండి. ఏం జరుగుతుందో ఊహకు కూడా అందదు. మీకు ఇదే నా సూచన. ప్రజలు తిరగబడితే మంత్రులు ఊళ్లలోకి కూడా వెళ్లలేరు’ అని అన్నారు.

News September 30, 2024

ప్రభుత్వానికి లేఖ రాయనున్న ‘అప్సా’

image

ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం(అప్సా) రద్దు అంశాన్ని పున:పరిశీలించాలని ఆ సంఘం ప్రభుత్వాన్ని కోరనుంది. ఈ మేరకు ప్రభుత్వానికి లేఖ రాయనుంది. ఇటీవల అప్సా గుర్తింపు రద్దుపై సాధారణ పరిపాలన శాఖ షోకాజ్ నోటీసు జారీ చేసింది. సచివాలయ ఉద్యోగులు ఎన్నికల ప్రచారంలో పాల్గొనడంపై వివరణ ఇవ్వాలని నోటీసుల్లో కోరింది. ప్రస్తుతం అప్సా రద్దు ఫైల్ సీఎం వద్దకు చేరగా, రెండు మూడు రోజుల్లో దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశముంది.

News September 30, 2024

మూసీ ప్రాజెక్టుతో హైడ్రాకు సంబంధం లేదు: రంగనాథ్

image

TG: మూసీ నదికి ఇరువైపులా సర్వేలతో హైడ్రాకు సంబంధం లేదని కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పష్టం చేశారు. ‘అక్కడి నివాసితులను హైడ్రా తరలించట్లేదు. కూల్చివేతలు చేపట్టడం లేదు. మూసీ సుందరీకరణ ప్రాజెక్టును మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చేపడుతోంది. హైడ్రా పరిధి ఔటర్ రింగ్ రోడ్డు వరకే. TGలో ఇతర ప్రాంతాల్లో కూల్చివేతలను హైడ్రాకు ఆపాదించి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు’ అని రంగనాథ్ ఆక్షేపించారు.

News September 30, 2024

సుప్రీం సూచన చెంపపెట్టు: షర్మిల

image

AP: తిరుమల లడ్డూ వ్యవహారంలో సుప్రీంకోర్టు సూచన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెంప పెట్టులాంటిదని APCC చీఫ్ షర్మిల అన్నారు. మత రాజకీయాలు కాకుండా హిందువుల మనోభావాలే ముఖ్యమనుకుంటే కూటమి ప్రభుత్వం SC సూచనను పరిగణనలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేసును CBIకి అప్పగిస్తేనే ఆందోళనలో ఉన్న కోట్లాది మంది భక్తులకు నిజానిజాలు వెల్లడవుతాయని చెప్పారు. కల్తీ ఎలా జరిగింది? నిందితులెవరనేది తేల్చాలన్నారు.

News September 30, 2024

‘విశ్వంభర’ టీజర్‌ వచ్చేది అప్పుడేనా..?

image

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సోషియో ఫాంటసీ మూవీ ‘విశ్వంభర’ కోసం మెగాఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా టీజర్‌ను దసరాకు రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రెడీ అయిందని, తుది మెరుగులు దిద్దుతున్నారని టాలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. ఇక సినిమాను వచ్చే ఏడాది జనవరి 10న విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని సమాచారం.

News September 30, 2024

నేడు హస్తినకు సీఎం రేవంత్

image

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఇవాళ రాత్రి 8.30 గంటలకు ఆయన హస్తినకు బయల్దేరి వెళ్తారు. అక్కడ ఆయన కాంగ్రెస్ పెద్దలతో భేటీ కానున్నట్లు తెలుస్తోంది. మంత్రివర్గ విస్తరణపై చర్చించనున్నట్లు సమాచారం.

News September 30, 2024

చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ

image

టీమ్ ఇండియా స్టార్ విరాట్ కోహ్లీ చరిత్ర లిఖించారు. బంగ్లాతో జరుగుతున్న రెండో టెస్టులో 27వేల పరుగుల మైలురాయిని చేరుకున్నారు. అన్ని ఫార్మాట్లు కలిపి సచిన్ 623 ఇన్నింగ్స్‌‌లలో ఈ ఘనత సాధించగా విరాట్ 594 ఇన్నింగ్స్‌లలోనే ఆ మార్కును చేరుకున్నారు. క్రికెట్ చరిత్రలో ఇంత వేగంగా ఈ ఘనత సాధించింది విరాట్ ఒక్కరే. సచిన్, కోహ్లీతో పాటు రికీ పాంటింగ్, సంగక్కర కూడా 27వేల పరుగుల మైలురాయి దాటారు.

News September 30, 2024

కేటీఆర్ డబ్బులిచ్చి దారుణంగా ట్రోలింగ్ చేయిస్తున్నారు: సురేఖ

image

TG: తనపై మాజీ మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో దారుణంగా పోస్టులు పెట్టిస్తున్నారని మంత్రి కొండా సురేఖ ఆరోపించారు. కవిత పట్ల ఎవరైనా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే కేటీఆర్ సమర్థిస్తారా? అని ప్రశ్నించారు. ఆయన మొదట్నుంచీ మహిళలను అవమానిస్తున్నారని, డబ్బులు ఇచ్చి దారుణంగా ట్రోలింగ్ చేయిస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా ఇవన్నీ మానుకోవాలని, లేదంటే తెలంగాణ మహిళలంతా తిరగబడతారని మంత్రి హెచ్చరించారు.