News April 21, 2025

తర్వాతి పోప్ అయ్యే ఛాన్స్ వీరికే!

image

పోప్ ఫ్రాన్సిస్ గతించడంతో ఆయన స్థానంలో తర్వాతి పోప్ ఎవరా అన్న ఆసక్తి ప్రపంచవ్యాప్తంగా నెలకొంది. ఐదుగురి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. వారు..
* లూయిస్ టగ్లే(ఫిలిప్పీన్స్)
* పియెట్రో పారోలిన్(ఇటలీ)
* జీన్-మార్క్ అవెలీన్(ఫ్రాన్స్)
* విలెమ్ ఐజ్క్(నెదర్లాండ్స్)
* మాల్కమ్ రంజిత్(శ్రీలంక)

News April 21, 2025

BREAKING: గ్రూప్-1 మెయిన్స్ షెడ్యూల్ విడుదల

image

AP: గ్రూప్‌-1 మెయిన్స్ రాత పరీక్షకు ఏపీపీఎస్సీ షెడ్యూల్ విడుదల చేసింది. మే 3 నుంచి 9 వరకు 4 జిల్లా కేంద్రాల్లో పరీక్షను నిర్వహించనున్నట్లు తెలిపింది. అన్ని పేపర్లకు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకూ పరీక్షలు జరగనున్నాయి. ఈరోజు నుంచే హాల్ టికెట్లను https://psc.ap.gov.in వెబ్‌సైట్లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

News April 21, 2025

ఈ నెల 25న ఓటీటీలోకి ‘మ్యాడ్ స్క్వేర్’

image

సంగీత్ శోభన్, నార్నె నితిన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘మ్యాడ్ స్క్వేర్’ ఈ నెల 25 నుంచి NETFLIXలో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో అందుబాటులో ఉండనుందని నెట్‌ఫ్లిక్స్ ఇండియా సౌత్ ట్వీట్ చేసింది. కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మార్చి 28న థియేటర్లలో విడుదలై సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది.

News April 21, 2025

‘డ్రగ్స్ తీసుకున్నా’.. పోలీసు విచారణలో టామ్ చాకో!

image

మలయాళ నటుడు షైన్ టామ్ చాకో డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసుల విచారణలో అంగీకరించాడని తెలుస్తోంది. ఇండస్ట్రీలో మేజర్ యాక్టర్లు కూడా మాదకద్రవ్యాలు వాడతారని చెప్పినట్లు సమాచారం. పోలీసుల సోదాలతో షూటింగ్ సమయంలో డ్రగ్స్ తీసుకోవడం కష్టంగా మారినట్లు చెప్పారని పలు జాతీయ మీడియా కథనాలు తెలిపాయి. డ్రగ్స్ కొనేందుకు ఆన్‌లైన్‌లో డబ్బులు బదిలీ చేసేవాడినని, అయితే వారెవరనే విషయం తనకు తెలియదని చెప్పినట్లు పేర్కొన్నాయి.

News April 21, 2025

మా పిల్లలు ఆలయాన్ని ఎంతో ఇష్టపడ్డారు: జేడీ వాన్స్

image

అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఈ రోజు కుటుంబంతో కలిసి ఢిల్లీలోని అక్షర్‌ధామ్ మందిరాన్ని సందర్శించారు. ‘ఈ అద్భుత ప్రదేశానికి ఆహ్వానించినందుకు ధన్యవాదాలు. ఈ ఆలయాన్ని ఇంత గొప్పగా నిర్మించిన ఘనత భారత్‌కు దక్కుతుంది. మా పిల్లలు దీన్ని ఎంతగానో ఇష్టపడ్డారు’ అని టెంపుల్ విజిటర్ బుక్‌లో వాన్స్ రాశారు. కాగా US ఉపాధ్యక్షుడు కుటుంబసమేతంగా 4 రోజులు భారత్‌లో పర్యటించనున్నారు.

News April 21, 2025

అభిషేక్ నాయర్‌కు థాంక్స్ చెప్పిన రోహిత్

image

నిన్న CSKతో మ్యాచులో అర్ధసెంచరీతో ముంబైకి విజయాన్ని అందించిన రోహిత్ శర్మ ఇన్‌స్టాలో ఆసక్తికర పోస్ట్ చేశారు. తన ఫొటోను షేర్ చేస్తూ భారత మాజీ అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్‌కు థాంక్స్ చెప్పారు. దీనిని అభిషేక్ షేర్ చేస్తూ ‘నథింగ్ బట్ లవ్’ అంటూ రీపోస్ట్ చేశారు. కాగా ఈ IPL సీజన్‌లో తొలుత విఫలమైన రోహిత్ తిరిగి గాడిన పడటంలో అభిషేక్ పాత్ర ఉందని క్రీడా వర్గాలు పేర్కొన్నాయి.

News April 21, 2025

IPL: టాస్ గెలిచిన కేకేఆర్

image

ఈడెన్ గార్డెన్స్‌లో KKRvsGT మ్యాచ్‌లో కేకేఆర్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. పాయింట్స్ టేబుల్‌లో గుజరాత్(5 విజయాలు) అగ్రస్థానంలో ఉండగా కోల్‌కతా(3 విజయాలు) ఏడో స్థానంలో ఉంది.
జట్లు:
GT: గిల్, సుదర్శన్, బట్లర్, రూధర్‌ఫోర్డ్, షారుఖ్, తెవాటియా, రషీద్, సుందర్, కిశోర్, సిరాజ్, ప్రసిద్ధ్

KKR: గుర్బాజ్, నరైన్, రహానే, వెంకటేశ్, రింకూ, రస్సెల్, రమణ్‌దీప్, అలీ, వైభవ్, హర్షిత్, వరుణ్

News April 21, 2025

‘హైదరాబాద్‌కు రండి’.. జపాన్ కంపెనీలకు సీఎం ఆహ్వానం

image

TG: భారత మార్కెట్‌తో పాటు ప్రపంచ దేశాలు తెలంగాణను గమ్యస్థానంగా ఎంచుకోవాలని వ్యాపార, పారిశ్రామికవేత్తలను సీఎం రేవంత్ ఆహ్వానించారు. జపాన్‌లోని ఒసాకాలో జరిగిన వరల్డ్ ఎక్స్‌పో 2025లో ఆయన పాల్గొన్నారు. ఈ సదస్సులో భారత్ నుంచి పాల్గొన్న మొదటి రాష్ట్రం తెలంగాణ అని, ఇది గర్వకారణమని తెలిపారు. అంతర్జాతీయ ఎగుమతుల కోసం సమీప ఓడరేవుతో అనుసంధానించే డ్రై పోర్టును తెలంగాణలో ఏర్పాటు చేస్తామన్నారు.

News April 21, 2025

సిట్ పోలీసుల అదుపులో రాజ్ కసిరెడ్డి

image

AP: మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కసిరెడ్డిని ఏపీ సిట్ పోలీసులు శంషాబాద్ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. ఆయన గోవా నుంచి హైదరాబాద్ వచ్చినట్లు సమాచారం. కాసేపట్లో విజయవాడకు తరలించనున్నారు. కాగా ఇవాళ సిట్ విచారణకు హాజరు కావాలని నిర్ణయం తీసుకున్నట్లు రాజ్ కసిరెడ్డి ఈ ఉదయం ఆడియో రిలీజ్ చేశారు.

News April 21, 2025

BE READY: రేపు మ.12 గంటలకు..

image

TG: ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలు రేపు మ.12 గం.కు విడుదల కాబోతున్నాయి. మార్చి 5 నుంచి 25వ తేదీ వరకు పరీక్షలు జరిగాయి. దాదాపు 9.5లక్షల మంది విద్యార్థులు ఎగ్జామ్స్ రాశారు. Way2News యాప్ ద్వారా ఎలాంటి యాడ్స్ లేకుండా వేగంగా ఫలితాలు తెలుసుకోవచ్చు. కేవలం హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేస్తే చాలు. మార్క్స్ లిస్టును ఈజీగా మీ సన్నిహితులకు షేర్ చేయొచ్చు.
*విద్యార్థులకు Way2News తరఫున BEST OF LUCK