News June 6, 2024

ఎస్పీ కార్యాలయానికి పిన్నెల్లి

image

AP: మాచర్ల మాజీ MLA పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇవాళ నరసరావుపేటలోని SP ఆఫీసుకు వచ్చారు. హైకోర్టు ఆదేశాల మేరకు అక్కడ సంతకం చేసి వెళ్లారు. EVM ధ్వంసంతో పాటు 3 కేసుల్లో అరెస్టు నుంచి పిన్నెల్లికి న్యాయస్థానం మినహాయింపు ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిపై TDP సుప్రీంకోర్టును ఆశ్రయించగా ముందస్తు బెయిల్‌ పొడిగించకుండా నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. ఈ క్రమంలో ఆయనను అరెస్టు చేస్తారనే వార్తలు వస్తున్నాయి.

News June 6, 2024

హిట్ మ్యాన్ అరుదైన రికార్డు

image

టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డు నెలకొల్పారు. టీ20ల్లో భారత జట్టుకు అత్యధిక విజయాలు అందించిన కెప్టెన్‌గా నిలిచారు. సారథిగా వ్యవహరించిన 55 మ్యాచుల్లో హిట్ మ్యాన్ 42 విజయాలు అందుకున్నారు. ఆ తర్వాతి స్థానంలో ధోనీ 41(72 మ్యాచులు)విజయాలతో ఉన్నారు. మరోవైపు వన్డేల్లో అత్యధిక విజయాలు అందించిన కెప్టెన్‌గా ధోనీ, టెస్టుల్లో కోహ్లీ తొలి స్థానాల్లో ఉన్నారు.

News June 6, 2024

మోదీ మ్యాజిక్ పనిచేయలేదు(2/2)

image

ఈ ఎన్నికల్లో ప్రధాని మోదీ తమిళనాడుపై ఫోకస్ చేశారు. 6 నెలల్లోనే 10సార్లు పర్యటించారు. కానీ ఒక్క సీటూ దక్కలేదు. కేరళలోనూ ఇదే పరిస్థితి. ఆయన ప్రచారం చేసిన చోట BJP నేతలకు ఓటమే ఎదురైంది. గెలిచిన త్రిస్సూర్‌లో ఆయన ప్రచారం చేయకపోవడం గమనార్హం. UP, మహారాష్ట్రలోనూ BJP పరిస్థితి దిగజారింది. ఆఖరికి అయోధ్యలోనూ <<13388928>>ఓటమి<<>> తప్పలేదు. మోదీ పోటీ చేసిన వారణాసిలోనూ మెజార్టీ 3 లక్షలకు పైగా తగ్గిపోయింది.

News June 6, 2024

మోదీ మ్యాజిక్ పనిచేయలేదు(1/2)

image

ఈ ఎన్నికల్లో 400 సీట్లలో గెలుపే లక్ష్యంగా బరిలో దిగిన బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. ప్రధాని మోదీ మ్యాజిక్ అంతగా పనిచేయలేదు. ఈసారి ఆయన 184 సెగ్మెంట్లలో 206 ర్యాలీలు, రోడ్ షోలతో ప్రచారం చేయగా, కేవలం 99 సీట్ల(53%)లోనే NDA అభ్యర్థులు గెలిచారు. కంచుకోటలైన దాదాపు 35 సీట్లను NDA కోల్పోయింది. ఈ 184 సీట్లలో 2019లో కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి 28 సీట్లు గెలవగా, ఈసారి 82 స్థానాలను సొంతం చేసుకుంది.

News June 6, 2024

చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

image

AP: ఇకపై బ్యూరోక్రాట్స్ పాలన ఉండదని, రాజకీయ పరిపాలన ఉంటుందని చంద్రబాబు స్పష్టం చేశారు. ‘ఇకపై మీరు మారిన చంద్రబాబును చూస్తారు. నా కోసం ఈ ఐదేళ్లు కార్యకర్తలు ప్రాణాలిచ్చారు. కత్తి మీద పెట్టినా జై టీడీపీ, జై చంద్రబాబు అన్నారు. ఎంపీలందరూ తరచూ వచ్చి నన్ను కలవండి. బిజీగా ఉన్నా మీతో మాట్లాడతా. ప్రతి అంశాన్ని నేనే వింటా. ఢిల్లీలో రాష్ట్ర ప్రయోజనాల కోసం పని చేయాలి’ అని ఎంపీలతో CBN వ్యాఖ్యానించారు.

News June 6, 2024

సీనియర్ మోస్ట్ ఎంపీలు వీరే

image

18వ లోక్‌సభలో అడుగుపెట్టనున్న సీనియర్ మోస్ట్ MPల జాబితాలో కేంద్ర మంత్రి వీరేంద్రకుమార్, INC నేత సురేశ్ కొడికున్నిల్ తొలిస్థానంలో నిలిచారు. వారు టికమ్‌గఢ్(మధ్యప్రదేశ్), మావెళిక్కర(కేరళ) నుంచి ఎనిమిదోసారి గెలిచారు. BJP నేతలు పంకజ్(మహారాజ్‌గంజ్), రమేశ్ చందప్ప(బీజాపూర్), ఫాగన్ సింగ్(మాల్దా), రాధామోహన్(పుర్వి చంపారన్), మన్‌సుఖ్‌భాయ్(భరూచ్), DMK నేత టీఆర్ బాలు(శ్రీపెరంబదూర్) ఏడోసారి ఎన్నికయ్యారు.

News June 6, 2024

దేవుడా.. ఇలా ఉన్నారేంట్రా బాబు!

image

ఖమ్మం-నల్గొండ-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌లో భారీగా చెల్లని ఓట్లు నమోదవుతున్నాయి. బ్యాలెట్ పత్రాలపై డబ్బులు పంపాలంటూ ఫోన్ పే నంబర్లు, లవ్ సింబల్స్, జై కాంగ్రెస్, జై కేసీఆర్ నినాదాలు కనిపించాయి. బ్యాలెట్ పేపర్‌లో కేవలం 1,2,3 నంబర్లతో వారి ప్రాధాన్యత ఓట్లు వేసేందుకే అనుమతి ఉంది. డిగ్రీలు చదివిన ఓటర్లు సైతం ఇలా తప్పుగా ఓటేయడం ఏంటని నెట్టింట విమర్శలొస్తున్నాయి.

News June 6, 2024

ఆమెకు జోడీగా నటించలేను: విజయ్ సేతుపతి

image

హీరోయిన్ కృతి శెట్టికి జోడీగా నటించడం తన వల్ల కాదని విజయ్ సేతుపతి అన్నారు. DSP సినిమాలో ఆమెను హీరోయిన్‌గా తీసుకుంటే తాను నటించనని దర్శకనిర్మాతలకు చెప్పానని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘ఉప్పెన’లో కృతికి తండ్రిగా నటించడమే దీనికి కారణమని పేర్కొన్నారు. అలాంటి అమ్మాయితో రొమాంటిక్ సీన్లు చేయలేనన్నారు. గతంలోనూ విజయ సేతుపతి ఈ కామెంట్ చేసిన విషయం తెలిసిందే.

News June 6, 2024

రాత్రికి ఢిల్లీ వెళ్లనున్న చంద్రబాబు

image

AP: టీడీపీ చీఫ్ చంద్రబాబు మరికాసేపట్లో ఢిల్లీ బయల్దేరి వెళ్లనున్నారు. ఆయన వెంట టీడీపీ ఎంపీలు కూడా హస్తినకు వెళ్తున్నారు. రేపు జరగబోయే ఎన్డీయే భేటీకి ఎంపీలతో కలిసి చంద్రబాబు హాజరు కానున్నారు.

News June 6, 2024

అమెజాన్ ఫారెస్ట్‌లో ఇంటర్నెట్.. పోర్న్‌కి అడిక్ట్ అయిన గిరిజనులు

image

అత్యవసర పరిస్థితుల్లో గిరిజనులు సహాయం పొందుతారనే ఉద్దేశంతో ఎలాన్ మస్క్ బ్రెజిల్‌లోని అమెజాన్ రెయిన్‌ఫారెస్ట్‌లో హైస్పీడ్ ఇంటర్నెట్ అందుబాటులోకి తీసుకొచ్చారు. అయితే, ఫలితాలు దీనికి విరుద్ధంగా వచ్చాయి. ప్రజలు ఇంటర్నెట్‌ను తప్పుడు సమాచారం కోసం వినియోగిస్తున్నట్లు తేలింది. ముఖ్యంగా తెగలోని యువకులు సోషల్ మీడియాకి అతుక్కుపోయి, పోర్న్ వీడియోలకు అడిక్ట్ అయ్యారు. దీంతో తెగలో మనస్పర్ధలు మొదలయ్యాయి.