India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఢిల్లీకి చెందిన ఓ కుటుంబంలో ఇప్పటివరకు 140 మంది డాక్టర్లుగా పనిచేశారు. 1920లో సభర్వాల్ ఫ్యామిలీలో తొలిసారిగా బోధిరాజ్ వైద్య వృత్తి స్వీకరించారు. ఆ తర్వాత ఆ కుటుంబంలో పుట్టిన ప్రతి ఒక్కరూ వైద్య విద్య అభ్యసించారు. మెడిసిన్ చదివిన అమ్మాయినే ఆ కుటుంబంలోని వారు పెళ్లి చేసుకుంటున్నారు. ఒక కోడలు బయోకెమిస్ట్ చదవగా అమెతో మళ్లీ మెడిసిన్ చదివించారు. ప్రస్తుతం వీరికి ఢిల్లీలో 5 ఆస్పత్రులు ఉన్నాయి.
ప్రపంచవ్యాప్తంగా తమ హోటల్స్‌ను రెట్టింపు చేసేందుకు రూ.5వేల కోట్లు వెచ్చించనున్నట్లు టాటా గ్రూప్‌కు చెందిన IHCL ఎండీ పునీత్ వెల్లడించారు. ప్రస్తుతం 350+ ఉన్న హోటళ్ల(రూమ్స్ 30వేలు) సంఖ్యను 2030 నాటికి 700(రూమ్స్ 70వేలు) చేస్తామని తెలిపారు. దక్షిణాసియాలోనే అత్యధిక లాభదాయక, ఐకానిక్ సంస్థగా IHCL మారబోతోందన్నారు. రాబోయే ఐదేళ్లలో కొత్త బ్రాండ్లను పరిచయం చేస్తామని పేర్కొన్నారు.
AP: పోలవరం ప్రాజెక్టును 2027లోపు పూర్తి చేస్తామని CM చంద్రబాబు అసెంబ్లీలో ప్రకటించారు. ‘నదుల అనుసంధానం పూర్తి చేయాలనేది నా జీవిత ఆశయం. గోదావరి నుంచి 4215 టీఎంసీలు, కృష్ణా నది నుంచి 815 టీఎంసీలు సముద్రంలోకి వెళ్లాయి. గత ప్రభుత్వ హయాంలో పోలవరం గురించి అడిగితే పర్సెంటా.. అర పర్సెంటా అని అవహేళన చేశారు. పోలవరం ప్రాజెక్ట్ ఎత్తు కచ్చితంగా 45.72మీటర్లు ఉంటుంది’ అని చంద్రబాబు స్పష్టం చేశారు.
పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో 24న ఆల్ పార్టీ మీటింగ్ జరగనుంది. ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. మరోవైపు భారత రాజ్యాంగాన్ని ఆమోదించి 75 వసంతాలు పూర్తైన సందర్భంగా నవంబర్ 26న ఉభయ సభలు పార్లమెంటు సెంట్రల్ హాలులో ప్రత్యేకంగా సమావేశం కానున్నాయి. డిసెంబర్ 20 వరకు శీతాకాల సమావేశాలు జరుగుతాయి.
AP: శాసనమండలి ఇవాళ పలు బిల్లులను ఆమోదించింది. ఏపీ పంచాయతీ రాజ్ సవరణ బిల్లు-2024, ఏపీ మున్సిపల్ సవరణ బిల్లు-2024, ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ సవరణ బిల్లు-2024, హోమియోపతి మెడికల్ ప్రాక్టీషనర్ల సవరణ బిల్లు, ఏపీ మెడికల్ ప్రాక్టీషనర్ల రిజిస్ట్రేషన్ చట్ట సవరణ బిల్లులకు మండలి ఆమోదం లభించింది. వీటితో పాటు బోర్డు సభ్యుల నియామకాల్లో వివక్ష చూపకుండా నిరోధిస్తూ 3 చట్టాల సవరణకు ఏపీ శాసనమండలి నిర్ణయం తీసుకుంది.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ త్వరలో భారత పర్యటనకు రానున్నారు. ఈ విషయాన్ని క్రెమ్లిన్ ప్రెస్ సెక్రటరీ డిమిత్రి పెస్కోవ్ మంగళవారం వెల్లడించారు. అయితే కచ్చితమైన తేదీలపై స్పష్టత రావాల్సి ఉంది. ఇరు దేశాల మధ్య దీర్ఘకాలిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి పుతిన్ పర్యటన దోహదపడనుంది. ఇటీవల బ్రిక్స్ సదస్సు కోసం మోదీ రష్యాలో పర్యటించిన విషయం తెలిసిందే.
TG: కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని BJP MP ఈటల రాజేందర్ విమర్శించారు. వరంగల్‌లో ప్రభుత్వం జరుపుకుంటున్న ఏడాది సంబరాలపై ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. రియల్ ఎస్టేట్ పేరుతో రైతుల భూములు లాక్కోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. హామీల అమలుపై చర్చకు రేవంత్ సవాల్ స్వీకరిస్తున్నట్లు చెప్పారు. ఈ చర్చకు ప్రధాని అవసరం లేదని, ఎక్కడికి రావాలో చెబితే తాను వస్తానని చెప్పారు.
AP: వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల పోలవరం ప్రాజెక్టు డయాఫ్రం వాల్ దెబ్బతిందని సీఎం చంద్రబాబు ఆరోపించారు. ఇప్పుడు దానిని మళ్లీ నిర్మించాలంటే రూ.990 కోట్లు అవసరమని చెప్పారు. ‘గతంలో మేం అధికారంలో ఉన్నప్పుడు 72 శాతం పనులు చేశాం. కానీ వైసీపీ ఐదేళ్లలో 3.8 శాతం పనులే చేసింది. పోలవరమే కాకుండా ఉత్తరాంధ్ర ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం’ అని ఆయన వ్యాఖ్యానించారు.
TG: కాంట్రాక్ట్ ఉద్యోగులకు భారీ షాక్ తగిలింది. వారిని రెగ్యులరైజ్ చేస్తూ గత ప్రభుత్వం జారీ చేసిన జీవో నం.16ను హైకోర్టు కొట్టేసింది. వారి రెగ్యులరైజేషన్ రాజ్యాంగ విరుద్ధమని తెలిపింది. దీంతో ఇకపై వారంతా తిరిగి కాంట్రాక్ట్ ఉద్యోగులుగానే కొనసాగే అవకాశం ఉంది. విద్య, వైద్య శాఖల్లో వేలాది మంది ఉద్యోగులు రెగ్యులరైజ్ కాగా, హైకోర్టు తీర్పుతో వారిలో ఆందోళన నెలకొంది.
TG: వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్, అధికారులపై దాడి ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో కీలక నిందితుడు, A2గా ఉన్న సురేశ్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. అతడిని కొడంగల్ కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసులో ఇప్పటికే A1గా ఉన్న మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఘటనను సీరియస్‌గా తీసుకున్న ఉన్నతాధికారులు పరిగి DSPపై బదిలీ వేటుతో పాటు పంచాయతీ సెక్రటరీని సస్పెండ్ చేశారు.
Sorry, no posts matched your criteria.