News June 5, 2024

చంద్రబాబు మావయ్యకి శుభాకాంక్షలు: NKR

image

ఏపీ ఎన్నికల ఫలితాలపై హీరో కళ్యాణ్ రామ్ స్పందించారు. ‘చరిత్రలో నిలిచిపోయే ఘన విజయాన్ని సాధించిన చంద్రబాబు మావయ్యకి, టీడీపీ నాయకులు, కార్యకర్తలకు నా అభినందనలు. మీ కృషి, పట్టుదల ఏపీ రాష్ట్ర భవిష్యత్తుని కచ్చితంగా మెరుగుపరుస్తుందని ఆశిస్తున్నా. అఖండ విజయం అందుకున్న బాలకృష్ణ బాబాయ్‌కి, నారా లోకేశ్, శ్రీభరత్‌, పురందీశ్వరి అత్తకి, జనసేనాని పవన్‌కి నా శుభాకాంక్షలు’ అని Xలో పోస్ట్ చేశారు.

News June 5, 2024

63 సీట్లను దూరం చేసిన 0.7% ఓట్లు

image

2019 సార్వత్రిక ఎన్నికల్లో 303 స్థానాల్లో గెలిచిన BJP ఇప్పుడు 240 స్థానాలకు పడిపోయింది. దీనికి కేవలం 0.7 శాతం ఓట్లే కారణం. 2019లో 37.30 శాతం ఓట్లు సాధించిన BJP.. తాజా ఎన్నికల్లో 36.60 శాతం ఓట్లు సాధించింది. ఈ చిన్న మార్జిన్ ఏకంగా 63 సీట్లను దూరం చేసి.. NDAను 350 మార్క్ దాటకుండా చేసింది. కాంగ్రెస్ 2019లో 19.5% ఓట్లతో 52 స్థానాలు సాధించగా.. ఇప్పుడు 21.2% ఓట్లతో 99 స్థానాలు దక్కించుకుంది.

News June 5, 2024

లోకేశ్‌ను సీఎం చేసి, చంద్రబాబు డిప్యూటీ పీఎం అవ్వాలి: అల్ఫోన్స్

image

భారత రాజకీయాలను మార్చగల శక్తి చంద్రబాబు చేతిలో ఉందన్నారు తమిళనాడు మైనార్టీ కమిషన్ ఛైర్మన్ పీటర్ ఆల్ఫోన్స్. ‘ఆయన మోదీకే సపోర్ట్ చేస్తారంటూ వార్తలొస్తున్నాయి. అదే నిజమైతే నాదొక సూచన. కుమారుడు లోకేశ్‌ని AP CMగా చేసి ఆయన డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్, కేంద్ర హోంమంత్రి బాధ్యతలు తీసుకోవాలి. PM నార్త్ ఇండియా అయినప్పుడు, డిప్యూటీ PM సౌత్‌ఇండియా వారు ఉండాలి. అప్పుడే ఇక్కడే హక్కులు కాపాడబడతాయి’ అన్నారు.

News June 5, 2024

కొత్త ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టాలి: షర్మిల

image

AP:రాష్ట్ర ప్రజల తీర్పును గౌరవిస్తున్నానని ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల అన్నారు. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోన్న చంద్రబాబు, పవన్‌లకు ఆమె శుభాకాంక్షలు తెలిపారు. ‘ప్రజల ఆకాంక్షల మేరకు ఏర్పడిన కొత్త ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టాలి. మనకు ప్రత్యేక హోదా రావాలి. పోలవరంతో సహా అన్ని ప్రాజెక్టులు పూర్తి కావాలి. రాజధాని నిర్మాణం జరగాలి. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలి’ అని Xలో పేర్కొన్నారు.

News June 5, 2024

అధికారంలో భాగస్వామ్యం కచ్చితంగా తీసుకుంటాం: పవన్

image

AP: అసెంబ్లీ ఎన్నికల్లో 21 MLA సీట్లు సాధించిన తమ పార్టీ.. అధికారంలో భాగస్వామ్యం కచ్చితంగా తీసుకుంటుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. దేశంలోనే ఏపీ ఎన్నికలు కీలకంగా మారాయన్నారు. జనసేన గోరంత దీపం.. కొండంత వెలుగునిచ్చిందని చెప్పారు. ప్రజలు చరిత్రాత్మక తీర్పునిచ్చారని.. ఇది రాజకీయాల్లో కొత్త మార్పునకు నాందికావాలని ఆకాంక్షించారు.

News June 5, 2024

టీడీపీ ఘన విజయం.. Jr.NTR ట్వీట్

image

APలో టీడీపీ విజయంపై యంగ్ టైగర్ NTR స్పందించారు. ‘ప్రియమైన చంద్రబాబు మావయ్యకి ఈ చరిత్రాత్మక విజయాన్ని సాధించినందుకు శుభాకాంక్షలు. ఏపీని అభివృద్ధి పథం వైపు నడిపిస్తారని ఆశిస్తున్నా. అద్భుత మెజార్టీతో గెలిచిన లోకేశ్‌, మూడోసారి ఘన విజయం సాధించిన బాలకృష్ణ బాబాయ్‌కి, ఎంపీలుగా గెలిచిన భరత్‌కి, పురందీశ్వరి అత్తకు, ఘనవిజయం సాధించిన పవన్ కళ్యాణ్‌కు నా శుభాకాంక్షలు’ అని NTR ట్వీట్ చేశారు.

News June 5, 2024

సచివాలయంలో మంత్రుల నేమ్ బోర్డుల తొలగింపు

image

ఏపీ సచివాలయంలో మంత్రుల నేమ్ బోర్డులను అధికారులు తొలగించారు. మంత్రుల ఛాంబర్లను స్వాధీనం చేసుకుంటున్నారు. వాటిలోని సామగ్రి తరలిపోకుండా చర్యలు తీసుకుంటున్నారు. కాగా కీలక ఫైళ్లు మిస్ అవుతున్నాయనే ఆరోపణలతో పలు శాఖల అధికారులు ఇప్పటికే సోదాలు చేపట్టారు. ల్యాప్‌టాప్‌లు, డేటాను పరిశీలిస్తున్నారు.

News June 5, 2024

అందుకు సీఎం రేవంత్ రాజీనామా చేయాలి: డీకే అరుణ

image

TG: మహబూబ్‌నగర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి ఓటమికి బాధ్యత వహిస్తూ సీఎం రేవంత్ రాజీనామా చేయాలని ఎంపీ డీకే అరుణ అన్నారు. బీజేపీ కోసం బీఆర్ఎస్ ఆత్మబలిదానం చేసుకుందని సీఎం తప్పుడు ప్రచారం చేశారని మీడియా సమావేశంలో విమర్శించారు. TGలో బీజేపీకి 10 సీట్లు వస్తాయని అంచనా వేసినా 8కే పరిమితమయ్యామని పేర్కొన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే కేంద్రంతో ఇక్కడి ప్రభుత్వం స్నేహపూర్వకంగా వ్యవహరించాలని సూచించారు.

News June 5, 2024

చంద్రబాబుకు అభినందనలు తెలిపిన రామ్ చరణ్

image

అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించడంపై టీడీపీ అధినేత చంద్రబాబుకు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా కంగ్రాట్స్ చెబుతున్నారు. తాజాగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చంద్రబాబుకు అభినందనలు చెప్పారు. ‘ఏపీ ఎన్నికల్లో సంచలన విజయం సాధించిన విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడుకి కంగ్రాట్స్’ అంటూ ఆయన ట్వీట్ చేశారు.

News June 5, 2024

లోక్‌సభ ఫలితాల్లో అత్యల్ప మెజార్టీ వీరికే

image

☛ రవీంద్ర దత్తారామ్ వైకర్ – శివసేన- ముంబై నార్త్ వెస్ట్- 48 ఓట్ల మెజార్టీ
☛ అదూర్ ప్రకాశ్- కాంగ్రెస్- అత్తింగళ్(కేరళ)- 684 ఓట్ల మెజార్టీ
☛ నారాయణ్ బెహరా- BJP-జయపురం(ఒడిశా) -1587 ఓట్ల మెజార్టీ
☛ అనిల్ చోప్రా-కాంగ్రెస్-జైపూర్-1615 ఓట్ల మెజార్టీ
☛ భోజ్‌రాజ్ నాగ్-BJP-కాంకేర్(ఛత్తీస్‌గఢ్)-1884 ఓట్ల మెజార్టీ