News January 14, 2025

జలాంతర్గామి, యుద్ధ నౌకల ప్రారంభం రేపే

image

భార‌త నావికాద‌ళం అమ్ముల‌పొదిలో మ‌రో 2 కీల‌క యుద్ధ నౌక‌లు, జలాంతర్గామి చేర‌నున్నాయి. INS సూరత్‌, INS నీలగిరి, INS వాఘ్‌షీర్‌‌ను ప్ర‌ధాని మోదీ బుధ‌వారం ముంబైలోని నేవ‌ల్ డాక్‌యార్డ్‌లో ప్రారంభించ‌నున్నారు. రక్షణ రంగ‌ తయారీ, సముద్ర భద్రతలో అగ్ర‌గామిగా నిల‌వాలనుకుంటున్న భార‌త ఆశ‌య సాధనలో వీటి ప్రారంభం కీల‌క ముందడుగు. ఇందులో INS సూరత్ ప్ర‌పంచంలోనే అతిపెద్ద‌, అత్యాధునిక యుద్ధ‌ నౌక‌ల‌లో ఒక‌టి.

News January 14, 2025

‘డాకు మహారాజ్’ 2 రోజుల కలెక్షన్లు ఇవే..

image

నందమూరి బాలకృష్ణ నటించిన ‘డాకు మహారాజ్’ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబడుతోంది. రెండు రోజుల్లో రూ.74 కోట్లకు పైగా గ్రాస్ వచ్చినట్లు చిత్ర నిర్మాణ సంస్థ వెల్లడించింది. ఈ సంక్రాంతి బ్లాక్‌బస్టర్ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను అలరిస్తోందని పేర్కొంది. కాగా ఈ మూవీ తొలి రోజైన ఆదివారం రూ.56 కోట్లు వసూలు చేసింది.

News January 14, 2025

శివకార్తికేయన్ ఫ్యామిలీని చూశారా?

image

తమిళ హీరో శివకార్తికేయన్ ఇటీవల వచ్చిన అమరన్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. తాజాగా ఆయన సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. కుటుంబంతో కలిసి దిగిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆయన ఫ్యామిలీ క్యూట్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ హీరోకు భార్య ఆర్తి, ఒక పాప, ఇద్దరు బాబులు ఉన్నారు. శివకార్తికేయన్, ఆర్తి 2010లో పెళ్లి చేసుకున్నారు.

News January 14, 2025

పండగ వేళ తగ్గిన బంగారం ధరలు

image

సంక్రాంతి పండగ వేళ ప్రీషియస్ మెటల్స్ ధరలు స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.110 తగ్గి రూ.79,960 వద్ద కొనసాగుతోంది. 22 క్యారెట్ల గోల్డ్ రూ.100 తగ్గి రూ.73,300 వద్ద ఉంది. వెండి కిలో రూ.2000 పడిపోయి రూ.1,00,000 వద్ద ట్రేడవుతోంది. ఇక ప్లాటినం 10 గ్రాముల ధర రూ.60 తగ్గి రూ.26,540 వద్ద ఉంది. ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసేంత వరకు ధరల్లో అనిశ్చితి తప్పకపోవచ్చని విశ్లేషకులు అంటున్నారు.

News January 14, 2025

ఫ్యామిలీతో చెర్రీ సెలబ్రేషన్స్

image

గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ తన ఫ్యామిలీతో సంక్రాంతి సెలబ్రేట్ చేసుకున్నారు. ఆయన సతీమణి ఉపాసన.. చెర్రీ, క్లీంకారతో ఉన్న ఫొటోను షేర్ చేస్తూ అభిమానులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ‘ఇంతకాలంగా మాపై చూపిస్తున్న ప్రేమ, ఆదరణకు కృతజ్ఞతలు’ అని ఉపాసన పేర్కొన్నారు.

News January 14, 2025

సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకు BIG షాక్!

image

సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకు కష్టకాలం మొదలైనట్టే! 2025లో మిడ్ లెవల్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లను AIతో రిప్లేస్ చేస్తామని మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ అన్నారు. ఇతర కంపెనీలూ ఇదే బాటలో నడుస్తాయని స్పష్టం చేశారు. ప్రస్తుతం మనుషులు చేస్తున్న కాంప్లెక్స్ కోడింగ్ టాస్కులను హ్యాండిల్ చేయగలిగే AI సిస్టమ్స్‌ను మెటా సహా టెక్ కంపెనీలు డెవలప్ చేస్తున్నాయని తెలిపారు. కోడ్ రాయగలిగే AIను మోహరిస్తున్నామని వెల్లడించారు.

News January 14, 2025

దేశంలో అత్యంత రద్దీ నగరంగా కోల్‌కతా

image

భారత్‌లో ట్రాఫిక్ ఎక్కువగా ఉండే నగరాల జాబితాలో కోల్‌కతా టాప్‌లో నిలిచింది. ఈ విషయంలో బెంగళూరును అధిగమించింది. 2024 టామ్‌టామ్ ట్రాఫిక్ ఇండెక్స్ ప్రకారం 10kms ప్రయాణానికి కోల్‌కతాలో 34min 33s, బెంగళూరులో 34min 10s టైమ్ పడుతుంది. ఈ రెండింటి తర్వాతి స్థానాల్లో పుణే (33m 22s), హైదరాబాద్ (31m 30s), చెన్నై(30m 20s), ముంబై(29m 26s), అహ్మదాబాద్ (29m 3s) ఉన్నాయి.

News January 14, 2025

మహా కుంభమేళా: స్టీవ్ జాబ్స్ భార్యకు అలర్జీ

image

మహా కుంభమేళాలో పవిత్ర స్నానం ఆచరించిన ఆపిల్ కంపెనీ మాజీ సీఈవో స్టీవ్ జాబ్స్ భార్య పావెల్ (61) అనారోగ్యానికి గురైనట్లు జాతీయ మీడియా పేర్కొంది. భారీ జన సందోహం మధ్య నదిలో స్నానం చేయడంతో అలర్జీలు వచ్చినట్లు తెలిపింది. కాగా నిరంజని అఖారా సూచనతో పావెల్ ఇండియాకు వచ్చి, మహా కుంభమేళాలో పాల్గొన్నారు. ఆమెకు ఆ స్వామీజి ‘కమల’ అని నామకరణం చేశారు. పావెల్ భారత సంప్రదాయాలను ఎంతో గౌరవిస్తున్నారని ఆయన చెప్పారు.

News January 14, 2025

ఆస్కార్స్ 2025: నామినేషన్స్ ప్రకటన వాయిదా

image

లాస్ ఏంజెలిస్‌లో కార్చిచ్చు వల్ల ఏర్పడిన పరిస్థితుల కారణంగా ఆస్కార్స్-2025 నామినేషన్స్ ప్రకటన వాయిదా పడింది. ఓటింగ్ పీరియడ్‌ను పొడిగించారు. ఈనెల 17న నామినేషన్స్‌ను వెల్లడించాల్సి ఉండగా, 23వ తేదీకి వాయిదా వేశారు. ఆరోజున వర్చువల్‌గా నామినీల లిస్టును ప్రకటించనున్నారు. మార్చి 2న అవార్డులను ప్రకటిస్తారు.

News January 14, 2025

రూపాయి పతనం కొంత కాలమే: SBI రిపోర్ట్

image

భారత రూపాయి పతనంపై ట్రంప్ ప్రభావం కొంత కాలమే ఉంటుందని SBI రిపోర్ట్ పేర్కొంది. ఆయన ప్రెసిడెన్సీ ఆరంభంలో మన కరెన్సీకి ఒడుదొడుకులు ఎదురైనా త్వరలోనే స్థిరత్వం సాధిస్తుందని అంచనా వేసింది. చరిత్రను పరిశీలిస్తే డెమోక్రాట్ల కన్నా రిపబ్లికన్ల హయాంలోనే INR మెరుగ్గా రాణించిందని 2013 నాటి ‘టేపర్ తంత్రం’ను గుర్తుచేసింది. NOV నుంచి రూపాయి 3% బలహీనపడినా ఇతర దేశాల కరెన్సీలతో పోలిస్తే ఇది అతి కనిష్ఠమని తెలిపింది.