India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోందని, మరో 24 గంటల్లో ఉత్తర దిశగా కదులుతూ ఏపీ తీరం వెంబడి పయనించనుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఇవాళ విశాఖ, శ్రీకాకుళం, కాకినాడ, విజయనగరం, అనకాపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మిగిలిన ప్రాంతాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడొచ్చని అంచనా వేసింది. తీరం వెంబడి గంటకు 60కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది.
‘ఇండియన్-3’ సినిమా నేరుగా ఓటీటీలో రిలీజ్ అవుతుందన్న వార్తలను డైరెక్టర్ శంకర్ కొట్టిపారేశారు. ఈ మూవీని థియేటర్లలోనే రిలీజ్ చేస్తామని, ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఇండియన్-2కి నెగటివ్ రివ్యూస్ వస్తాయని ఊహించలేదన్నారు. గేమ్ ఛేంజర్, ఇండియన్-3 సినిమాలతో బెటర్ రిజల్ట్స్ వస్తాయని చెప్పారు. రామ్ చరణ్ హీరోగా నటించిన ‘గేమ్ ఛేంజర్’ జనవరి 10న విడుదలవుతోన్న సంగతి తెలిసిందే.
BGT సిరీస్ 2-2తో డ్రా అయితే భారత్ WTC ఫైనల్‌కు వెళ్లేందుకు ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. అప్పుడు AUSతో రెండు మ్యాచుల సిరీస్‌ను SL 1-0 తేడాతో గెలవాలి. అలాగే SAను PAK 2-0తో ఓడించాలి. ప్రస్తుతం పాయింట్స్ టేబుల్‌లో SA, AUS తొలి రెండు స్థానాల్లో ఉండగా, IND మూడో స్థానంలో ఉంది. ఒకవేళ BGT చివరి రెండు టెస్టులను IND గెలిస్తే ఇతర సిరీస్‌లతో సంబంధం లేకుండా నేరుగా ఫైనల్‌కు వెళ్తుంది.
హైదరాబాద్ మెట్రో ట్రైన్ల కోచ్‌లను 6కు పెంచే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు శాసన మండలిలో వెల్లడించారు. మెట్రోను 3 కోచ్‌లతో నడపడానికి తయారు చేశామని, దానిని 6 కోచ్‌లుగా మార్పు చేయవచ్చని తెలిపారు. కానీ 8 కోచ్‌లు నడపడానికి ఈ మెట్రో డిజైన్ అనుమతించదని పేర్కొన్నారు. ఇతర మెట్రోల్లాగా కాకుండా HYD మెట్రో ప్రాజెక్టు పీపీపీ (పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యం) పద్ధతిలో నిర్మించినదని గుర్తుచేశారు.
ChatGPT సేవలను వాట్సాప్‌లో అందుబాటులోకి తెచ్చినట్లు ఓపెన్ ఏఐ ప్రకటించింది. US, కెనడాలో 1-800-CHATGPT (1-800-242-8478) నంబర్ ద్వారా ChatGPTతో కాల్స్/చాట్ చేయవచ్చని తెలిపింది. నెలకు 15 నిమిషాల పాటు ఫ్రీగా కాల్స్ మాట్లాడవచ్చని పేర్కొంది. ఇండియాలో ఉన్న వారు <
పారా అథ్లెటిక్స్ వరల్డ్ ఛాంపియన్‌షిప్స్-2025 ఢిల్లీలోని నెహ్రూ స్టేడియంలో జరగనున్నాయి. ఈ ఈవెంట్‌ను భారత్ నిర్వహించడం ఇదే తొలిసారి. SEP 26 నుంచి OCT 5 వరకు జరిగే ఈ ఈవెంట్‌లో 100 దేశాల నుంచి 1000 మంది అథ్లెట్లు పాల్గొంటారు. 2036 ఒలింపిక్స్ నిర్వహణ ప్రతిపాదనను ఇది బలపరుస్తుందని NPC ఇండియా అభిప్రాయపడింది. మార్చి 11-13 వరకు వరల్డ్ పారా అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రిక్స్‌కు కూడా ఢిల్లీ ఆతిథ్యమివ్వనుంది.
తెలంగాణలో గత పదేళ్ల కాలంలో 2,722 కి.మీ మేర జాతీయ రహదారుల నిర్మాణాలను పూర్తి చేసినట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. మెదక్ ఎంపీ రఘునందన్ రావు ప్రశ్నకు లోక్ సభలో ఆయన సమాధానమిచ్చారు. రాష్ట్రంలో ప్రస్తుతం 30 NHలు 4,926 కి.మీ పొడవు విస్తరించి ఉన్నాయని తెలిపారు. NHలకు లింక్ చేసేలా HYDలో టన్నెల్ రోడ్ల నిర్మాణం కోసం నిధులు ఇచ్చే ప్రతిపాదన ఏదీ లేదని స్పష్టం చేశారు.
AP: రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాలకు డోలి మోతల కష్టం ఉండకుండా ప్రభుత్వం రోడ్లు నిర్మించనుంది. మన్యం, అల్లూరి జిల్లాల్లో మారుమూల గిరిజన గ్రామాల నుంచి ప్రధాన రహదారుల్ని కలిపేలా రోడ్లు వేయనుంది. 9 గిరిజన ప్రాంతాల్లో 48 కి.మీ మేర రోడ్ల నిర్మాణం కోసం తాజాగా రూ.49.73కోట్లు మంజూరు చేసింది. నేడు ఈ రెండు జిల్లాల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించి రోడ్లకు శంకుస్థాపన చేయనున్నారు.
విజయ్ హజారే ట్రోఫీలో తమ తొలి మ్యాచుకు పేసర్ షమీని బెంగాల్ టీమ్ పక్కన పెట్టింది. మోకాలి వాపు నుంచి కోలుకుంటున్న అతనికి రెస్ట్ ఇచ్చినట్లు తెలిపింది. మరోవైపు షమీ 200% ఫిట్ అయ్యాకే జాతీయ జట్టులోకి తీసుకుంటామని కెప్టెన్ రోహిత్ శర్మ తాజాగా ప్రెస్ కాన్ఫరెన్స్‌లో స్పష్టం చేశారు. దీంతో ఆయన నేషనల్ టీమ్‌లోకి ఇప్పట్లో రావడం కష్టమేనని, ఛాంపియన్స్ ట్రోఫీలోనూ ఆడటంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
మాజీ CDS బిపిన్ రావత్ 2021 DECలో జరిగిన హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదానికి మానవ తప్పిదమే కారణమని IAF ధృవీకరించింది. ఇందుకు సంబంధించిన రిపోర్టును తాజాగా లోక్ సభకు అందించింది. 2017-2022 మధ్య జరిగిన 34 ఎయిర్‌క్రాఫ్ట్ ప్రమాదాల్లో 16 హ్యుమన్ ఎర్రర్ వల్లే జరిగాయని పేర్కొంది. TNలోని కన్నూరులో జరిగిన ప్రమాదంలో బిపిన్‌తో పాటు ఆయన భార్య మధులిక, మరో 11 మంది చనిపోయారు.
Sorry, no posts matched your criteria.