News October 31, 2025

వృద్ధాప్యంలో ఒంటరితనం వేధిస్తోందా?

image

వృద్ధాప్యంలో ఒంటరితనం అతి పెద్ద సమస్య. పిల్లలు ఎక్కడో దూరంగా ఉండడం, ఏమైనా అయితే పిల్లలు రాగలరో లేరో అనీ కలవరపడతారని నిపుణులు చెబుతున్నారు. ఒంటరితనంతో గతం గురించి ఆలోచిస్తూ కుంగుబాటుకూ లోనవుతారు. రోజూ కాసేపు ధ్యానం చేయడం, స్నేహితులు, బంధువులతో సమయం గడపడం వంటివి మేలు చేస్తాయంటున్నారు. మనసును ఉల్లాసంగా ఉంచుకుంటే ఒంటరిననే భావన తగ్గుతుందని చెబుతున్నారు.

News October 31, 2025

యాచకురాలి దగ్గర నోట్ల కట్టలు!

image

కర్ణాటకలోని మంగళూరులో మానసిక అనారోగ్యంతో ఉన్న ఓ యాచకురాలు 13 ఏళ్లుగా చెత్త కుప్పల దగ్గర నివసిస్తోంది. ఆమెను సురక్షిత ప్రాంతానికి తరలించేందుకు స్థానికులు ప్రయత్నించగా చెత్తలో ఉన్న సంచులను గట్టిగా పట్టుకుంది. అనుమానంతో వాటిని తెరిచి చూస్తే భారీగా నోట్లు, నాణేలు కనిపించాయి. వాటిని లెక్కిస్తే ₹లక్ష కంటే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో యాచకురాలిని అనాథ శరణాలయానికి తరలించారు.

News October 31, 2025

ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల

image

TG: ఇంటర్ బోర్డు పరీక్షల <>షెడ్యూల్ <<>>విడుదల చేసింది. రోజుకు 2 సెషన్స్(9AM-12PM, 2PM-5PM)చొప్పున FEB 2-21 వరకు ప్రాక్టికల్స్ ఉంటాయి. 21న ఫస్టియర్, 22న సెకండియర్‌కు ENG ప్రాక్టికల్స్ ఉంటాయి. FEB 25-MAR 18 వరకు రాత పరీక్షలు కొనసాగనున్నాయి. ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులకు రోజు మార్చి రోజు పరీక్షలుంటాయి. FEB 25న ఫస్టియర్, 26న సెకండియర్‌ ఎగ్జామ్స్ ప్రారంభం కానున్నాయి.

News October 31, 2025

పంచ భూతాలే మానవ శరీరం

image

మానవ దేహం పంచభూతాలతో ఏర్పడింది. చర్మం, వెంట్రుకలు, కండరాలు భూతత్వానికి సంబంధించినవి. ఆకలి, నిద్ర, దాహం అగ్నితత్వానికి చెందినవి. నడవడం, పరుగెత్తడం వంటి కదలికలన్నీ వాయుతత్వం. మూత్రం, రక్తం, వీర్యం వంటి ద్రవాలు జలతత్వం కిందకి వస్తాయి. గరుడ పురాణం ప్రకారం.. ఆలోచన (చింత), శబ్దం, దుఃఖం (శోకం) అనేవి ఆకాశతత్వం లక్షణాలు. నూనెతో తలకు, ఒంటికి చేసే అభ్యంగనం ద్వారా ఈ సర్వేంద్రియాలకు శాంతి, శక్తి లభిస్తాయి.

News October 31, 2025

5,346 టీచర్ పోస్టులు.. దరఖాస్తు చేసుకున్నారా?

image

ఢిల్లీలో 5,346 TGT పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. డిగ్రీ, పీజీ, బీఈడీతో పాటు సీటెట్ ఉత్తీర్ణులైనవారు నవంబర్ 7 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 30ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. దరఖాస్తు ఫీజు రూ.100, మహిళలు, SC, ST, దివ్యాంగులకు ఫీజు లేదు. రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. నెలకు జీతం రూ.44,900 – రూ.1,42,400 అందుతుంది. వెబ్‌సైట్: https://dsssb.delhi.gov.in/

News October 31, 2025

ఇండియా విన్.. TDPపై YCP MLA సెటైర్లు

image

AP: ఉమెన్స్ వరల్డ్ కప్‌లో AUSను టీమ్ ఇండియా ఓడించి ఫైనల్ చేరిన విషయం తెలిసిందే. యర్రగొండపాలెం YCP MLA చంద్రశేఖర్ మహిళల జట్టుకు శుభాకాంక్షలు చెబుతూనే TDPపై సెటైర్లు వేశారు. “ఎల్లో జట్టును మట్టికరిపించిన ఉమెన్ ఇన్ బ్లూకు శుభాకాంక్షలు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలోని ‘డర్టీ ఎల్లో జట్టును’ కూడా రాజకీయ సమాధి చేయడానికి ‘మెన్ ఇన్ బ్లూ’ సిద్ధం” అని ట్వీట్ చేశారు. MLA తీరుపై TDP ఫాలోవర్స్ మండిపడుతున్నారు.

News October 31, 2025

అనర్హత పిటిషన్లపై విచారణకు గడువు కోరిన స్పీకర్

image

MLAల అనర్హత పిటిషన్లపై విచారణకు మరో 2 నెలలు గడువు కావాలని TG స్పీకర్ G ప్రసాద్ కుమార్ సుప్రీంకోర్టుకు విన్నవించారు.10 మంది MLAలకు నోటీసులివ్వగా 8 మంది స్పందించారు. వీరిలో 4గురి విచారణ ముగిసింది. SC విధించిన గడువు నేటితో ముగియడంతో మిగతా వారి విచారణకు సమయం కావాలని స్పీకర్ తరఫు న్యాయవాదులు కోరారు. నోటీసులకు స్పందించని ఇద్దరిపైనా స్పీకర్ నిర్ణయం తీసుకోవలసి ఉంది. కాగా కోర్టు ఆదేశాలపై ఉత్కంఠ నెలకొంది.

News October 31, 2025

జెమీమా రోడ్రిగ్స్ గురించి ఈ విషయాలు తెలుసా?

image

తాజాగా ఆస్ట్రేలియాపై జరిగిన ప్రపంచకప్ సెమీ-ఫైనల్‌లో అద్భుత బ్యాటింగ్ జెమీమా రోడ్రిగ్స్ అందరి దృష్టినీ ఆకర్షించారు. ముంబైలో 2000లో జన్మించిన జెమీమా చిన్నవయసులోనే బ్యాట్ చేతబట్టింది. మహారాష్ట్ర అండర్-17, అండర్-19 హాకీ జట్లకు కూడా ఆమె ప్రాతినిధ్యం వహించింది. కానీ చివరికి క్రికెట్‌నే ఎంచుకొంది. 2017లో అండర్-19 వన్డే మ్యాచ్‌లో సౌరాష్ట్రపై 202 పరుగులతో డబుల్ సెంచరీ సాధించిన రెండో భారత మహిళగా నిలిచింది.

News October 31, 2025

బిహార్ అసెంబ్లీ ఎన్నికలు.. ఎన్డీఏ మ్యానిఫెస్టో

image

➤ ప్రస్తుతం రైతులకు ఇస్తున్న రూ.6వేల పెట్టుబడి సాయం (కర్పూరి ఠాకూర్ కిసాన్ సమ్మాన్ నిధి) ఏటా రూ.9వేలకు పెంపు
➤ యువతకు కోటి ఉద్యోగాల కల్పన
➤ ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్ యోజన: కోటి మంది మహిళలను లక్షాధికారులు చేయడం
➤ ఈబీసీల అభివృద్ధి కోసం కులవృత్తుల వారికి రూ.10లక్షల చొప్పున ఆర్థిక సాయం
➤ రాష్ట్రంలో జాతీయ రహదారులు, రైల్వే లైన్లు, మెట్రో విస్తరణ
➤ బిహార్ నుంచి విదేశాలకు డైరెక్ట్ విమాన సర్వీసులు

News October 31, 2025

పటేల్ దూరదృష్టిని కాంగ్రెస్ మరచింది: మోదీ

image

కాంగ్రెస్ బలహీన విధానాల వల్ల కశ్మీర్ ఆక్రమణకు గురైందని PM మోదీ అన్నారు. గుజరాత్ ఏక్తా దివస్‌లో మాట్లాడారు. ‘పాక్ ఆక్రమణ వల్ల కశ్మీర్, దేశంలో అశాంతి నెలకొంది. కశ్మీర్ మొత్తాన్ని భారత్‌లో కలపాలని పటేల్ ఆకాంక్షించారు. ఆయన ఆకాంక్షలను నెహ్రూ గౌరవించకుండా కశ్మీర్‌కు ప్రత్యేక రాజ్యాంగం, జెండాను ఇచ్చారు. పటేల్ దూరదృష్టిని కాంగ్రెస్ మరచింది. వందేమాతరం గేయాన్ని బ్యాన్ చేయాలని చూసింది’ అని ఆరోపించారు.