News December 19, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News December 19, 2024

డిసెంబర్ 19: చరిత్రలో ఈరోజు

image

1952: ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటుపై అప్పటి ప్రధాని జవహార్‌లాల్ నెహ్రూ ప్రకటన
1961: పోర్చుగీసు పాలన నుంచి గోవాకు విముక్తి కల్పించిన భారత సైన్యం
1974: ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ రికీ పాంటింగ్ జననం
2015: సినీ నటుడు, కవి రంగనాథ్ మరణం (ఫొటోలో)
* గోవా విముక్తి దినోత్సవం

News December 19, 2024

ఈ రోజు నమాజ్ వేళలు

image

తేది: డిసెంబర్ 19, గురువారం
ఫజర్: తెల్లవారుజామున 5.23 గంటలకు
సూర్యోదయం: ఉదయం 6.40 గంటలకు
దుహర్: మధ్యాహ్నం 12.13 గంటలకు
అసర్: సాయంత్రం 4.10 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 5.46 గంటలకు
ఇష: రాత్రి 7.04 గంటలకు
NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News December 19, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News December 19, 2024

శుభ ముహూర్తం (19-12-2024)

image

✒ తిథి: బహుళ చవితి మ.12:04 వరకు
✒ నక్షత్రం: ఆశ్లేష తె.4.23 వరకు
✒ శుభ సమయం: ఉ.11 నుంచి మ.12 గంటల వరకు
✒ రాహుకాలం: మ.1.30 నుంచి మ.3.00 వరకు
✒ యమగండం: ఉ.6.00 నుంచి ఉ.7.30 వరకు
✒ దుర్ముహూర్తం: ఉ.10.00 నుంచి ఉ.10.48 వరకు
తిరిగి మ.2.48 నుంచి మ.3.36 వరకు
✒ వర్జ్యం: సా.4.46 నుంచి సా.6.25 గంటల వరకు
✒ అమృత ఘడియలు: తె.4.12 నుంచి ఉ.5.51 వరకు

News December 19, 2024

ఈనాటి ముఖ్యాంశాలు

image

* రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ అశ్విన్
* జమిలి కోసం జేపీసీ ఏర్పాటు
* రూ.76వేల కోట్లు ఇవ్వాలని కేంద్రాన్ని అడిగాం: పవన్
* రేపు ఏపీలో భారీ వర్షాలు
* పరిటాల రవి హత్య కేసు నిందితులకు బెయిల్
* TG: జనవరి 2 నుంచి 20 వరకు టెట్ పరీక్షలు
* రాజ్‌భవన్ ఎదుట రోడ్డుపై బైఠాయించి సీఎం రేవంత్ నిరసన
* ఫార్ములా-ఈ రేసులో అవకతవకలు జరగలేదు: KTR
* ముంబై పడవ ప్రమాదంలో 13 మంది దుర్మరణం

News December 19, 2024

తెలుగు టైటాన్స్ ఓటమి.. ప్లే ఆఫ్స్‌కు వెళ్లేనా?

image

ప్రో కబడ్డీ లీగ్ సీజన్-11లో భాగంగా పట్నా పైరేట్స్‌తో జరిగిన మ్యాచులో తెలుగు టైటాన్స్ ఓడింది. 41-37 తేడాతో గెలిచిన పట్నా ప్లే ఆఫ్స్ బెర్తును ఖరారు చేసుకుంది. ఆ జట్టులో రైడర్ దేవాంక్ 14 పాయింట్లతో రాణించారు. ఈ మ్యాచులో ఓడటంతో టైటాన్స్ పాయింట్స్ టేబుల్‌లో 7వ స్థానానికి పడిపోయింది. దీంతో ప్లే ఆఫ్స్‌కు వెళ్లాలంటే ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

News December 19, 2024

దోమలు ఎక్కువగా టార్గెట్ చేసేది వీరినే..!

image

చుట్టుపక్కల ఎంత మంది ఉన్నా కొందరినే దోమలు ఎక్కువగా కుడతాయి. ఇందుకు కొన్ని కారణాలు ఉన్నట్లు పలు అధ్యయనాలు చెబుతున్నాయి. శరీర ఉష్ణోగ్రత ఎక్కువ ఉన్నా, చెమట ఎక్కువగా పట్టినా దోమలు వారికి ఎట్రాక్ట్ అవుతాయి. మద్యపానం చేసేవారికి, కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా విడుదల చేసేవారిని టార్గెట్ చేసి కుడతాయి. నలుపు, ఆకుపచ్చ, ఊదా రంగు దుస్తులు ధరించినా వారిని వదలవు. ఇక O, AB బ్లడ్ గ్రూప్ వారు దొరికితే దోమలకు పండగే.

News December 19, 2024

టీమ్ ఇండియా WTC షెడ్యూల్ ఇదేనా?

image

WTC 2025-27లో భారత టీం షెడ్యూల్ ఫిక్స్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. టీమ్ ఇండియా ఆరు టెస్ట్ సిరీస్‌లు ఆడనుంది. సౌతాఫ్రికా, వెస్టిండీస్, ఆస్ట్రేలియా సిరీస్‌లు స్వదేశంలో, ఇంగ్లండ్, న్యూజిలాండ్, శ్రీలంక సిరీస్‌లు విదేశాల్లో ఆడనుంది. జూన్‌లో ఇంగ్లండ్‌తో టెస్ట్‌ సిరీస్ ఆడనుంది. BGT తర్వాత మరో 4 నెలలపాటు భారత్‌కు టెస్టు సిరీస్ లేదు. వచ్చే ఏడాది అక్టోబర్‌లో సౌతాఫ్రికాతో సిరీస్ ప్రారంభం కానుంది.

News December 19, 2024

ఢిల్లీ టు కేరళ రూ.22,000, ఢిల్లీ టు దుబాయ్ రూ.21,000!

image

ఢిల్లీ నుంచి కన్నూర్ (కేరళ)కు డిసెంబర్ 22న ఇండిగో ఫ్లైట్ టికెట్ ధర రూ.22,000 చూపించడంతో సోషల్ మీడియాలో టికెట్ ఫేర్లపై చర్చ జరుగుతోంది. దీని కంటే ఢిల్లీ నుంచి దుబాయ్ టికెట్ ధర రూ.21000 చూపిస్తోందని పోస్టులు చేస్తున్నారు. అయితే తక్కువ సమయంలో బుక్ చేసుకోవడం, క్రిస్మస్ సందర్భంగా ధరలు పెరిగి ఉంటాయని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరి మీకూ ఇలాంటి అనుభవం ఎదురైందా?