India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఇంటర్నేషనల్ క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన రవిచంద్రన్ అశ్విన్ ఆస్తి విలువ సుమారు రూ.132 కోట్లు ఉంటుందని అంచనా. భారత జట్టుకు ఆడినందుకు మ్యాచ్ ఫీజు కింద బీసీసీఐ నుంచి ఏడాదికి రూ.10 కోట్లు తీసుకుంటారు. IPLలో RR తరఫున ఆడిన ఈ లెజెండరీ స్పిన్నర్ సీజన్‌కు రూ.5 కోట్ల చొప్పున అందుకున్నారు. తాజాగా రూ.9.75 కోట్లకు CSK అతణ్ని దక్కించుకుంది. మింత్రా, ఒప్పో, కోకా-కోలా లాంటి పలు బ్రాండ్లకు ఎండార్స్ చేస్తున్నారు.
TG: హైదరాబాద్ ఉస్మాన్ సాగర్ FTL నిర్ధారణలో అక్రమాలు జరిగినట్లు హైడ్రా గుర్తించింది. ముగ్గురు నీటిపారుదల శాఖ అధికారులు ఆక్రమణదారులకు సహకరించి FTL మ్యాప్‌లో మార్పులు చేసినట్లు తనిఖీల్లో తేలింది. అధికారులు వెంకటేశం, భీమ్ ప్రసాద్, శేఖర్ రెడ్డిలపై చర్యలు తీసుకోవాలని హైడ్రా ప్రభుత్వానికి సిఫారసు చేసింది.
శీతాకాలంలో చాలామంది గీజర్లు వాడతారు. వీటి వాడకంలో కొన్ని జాగ్రత్తలు పాటించకపోతే ప్రాణాలకే ముప్పు ఏర్పడే అవకాశం ఉంది. అత్యుత్తమ బ్రాండ్ గీజర్లనే ఉపయోగించాలి. వేడి నీటిని బకెట్లో నింపుకుని గీజర్ ఆఫ్ చేసిన తర్వాతే స్నానం చేయాలి. దీనిని ఎక్కువసేపు ఆన్‌లో ఉంచకూడదు. లేదంటే పేలిపోయే ప్రమాదం ఉంది. గీజర్లకు తడి తగలకుండా ఎత్తులో బిగించాలి. అప్పుడప్పుడు గీజర్ వాల్వ్‌లో ఏమైనా లోపం ఉందేమో చెక్ చేసుకోవాలి.
బాలయ్య వారసుడు మోక్షజ్ఞ, హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాంబినేషన్‌లో రానున్న సినిమా ఆగిపోయిందని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. దీనిపై తాజాగా నిర్మాణ సంస్థ SLV మూవీస్ క్లారిటీ ఇచ్చింది. ఆ ప్రాజెక్టుపై వచ్చిన ఊహాగానాల్లో నిజం లేదని పేర్కొంది. అసత్య ప్రచారాలను నమ్మవద్దని, అఫీషియల్ ప్రకటనలను తామే ట్వీట్ చేస్తామని తెలిపింది.
ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీ ‘ది న్యూ ఇండియా అస్యూరెన్స్’ 500 అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. APలో 10, TGలో 10 చొప్పున ఖాళీలున్నాయి. నిన్నటి నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. వయసు 1 జనవరి 2024 నాటికి 21-30 ఏళ్ల మధ్య ఉండాలి. డిగ్రీ పాసైన వారు అర్హులు. 25 జనవరి 2025న ప్రిలిమ్స్, 2 మార్చి 2025న మెయిన్స్ పరీక్షలు జరుగుతాయి. పూర్తి వివరాలు, దరఖాస్తు కోసం ఇక్కడ <
ట్విటర్ (X)లో హ్యాష్‌ట్యాగ్‌లు తీసేయాలని భావిస్తున్నట్లు ఆ సంస్థ సీఈఓ ఎలాన్ మస్క్ తెలిపారు. సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్ అవసరం లేదని చెప్పారు. నెటిజన్లు కూడా దీనిని ఉపయోగించడం ఆపేయాలని సూచించారు. ఇది చాలా ఎబ్బెట్టుగా కనిపిస్తోందని అసహనం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా బ్రిటన్‌కు చెందిన ‘రీ ఫామ్’ అనే రాజకీయ పార్టీకి మస్క్ దాదాపు రూ.849 కోట్లు విరాళం ఇస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ స్పేస్ స్టేషన్ నుంచి భూమిపైకి రావడం మరింత ఆలస్యం కానుందని నాసా ప్రకటించింది. వచ్చే ఏడాది మార్చి చివర్లో అంతరిక్షానికి పంపే క్రూ-10లో వారు తిరిగొస్తారని వెల్లడించింది. షెడ్యూల్ ప్రకారం నిక్ హాగ్, గుర్బునోవ్ వెళ్లాల్సిన మిషన్ వచ్చే FEBలోనే ప్రయోగించాల్సి ఉండగా పలు కారణాల వల్ల MARలో నిర్వహిస్తామంది. వారితో పాటే సునీత, విల్మోర్ రిటర్న్ అవుతారని తెలిపింది.
జమిలి ఎన్నికలపై జేపీసీ ఏర్పాటైంది. ఈ కమిటీలో లోక్‌సభ నుంచి 21, రాజ్యసభ నుంచి 10 మంది MPలు ఉన్నారు. పీపీ చౌదరి, సీఎం రమేశ్, హరీశ్ బాలయోగి, బాలశౌరి, బన్సూరి రమేశ్, పురుషోత్తం రూపాలా, అనురాగ్ ఠాకూర్, విష్ణు దయాల్, భర్తృహరి, సంబిత్ పాత్ర, అనిల్ బలూని, విష్ణు శర్మ, ప్రియాంకా గాంధీ, మనీశ్ తివారీ, సుఖ్‌దేవ్ భగత్, ధర్మేంద్ర యాదవ్, కళ్యాణ్ బెనర్జీ, సెల్వగణపతి, సుప్రియా సూలే, శ్రీకాంత్ షిండే, చందన్ చౌహాన్.
పుల్వామా అమరవీరుడు విజయ్ సోరెంగ్ కుమారుడు రాహుల్ సోరెంగ్ హరియాణా అండర్-16 జట్టుకు ఎంపికయ్యారు. ఈ విషయాన్ని భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ తెలిపారు. ‘రిమెంబర్ ద నేమ్.. రాహుల్ సోరెంగ్’ అంటూ ఆయన ట్వీట్ చేశారు. కాగా 2019 నుంచి సెహ్వాగ్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో రాహుల్ ఉచితంగా చదువుకుంటున్నారు. అదే సమయంలో క్రికెట్‌లోనూ శిక్షణ తీసుకుంటున్నారు. త్వరలో ఆయన విజయ్ మర్చంట్ ట్రోఫీలో ఆడనున్నారు.
ఈ నెల 21, 22 తేదీల్లో ప్రధాని నరేంద్ర మోదీ కువైట్‌లో పర్యటిస్తారు. ఆ దేశ ఆహ్వానం మేరకు ఆయన అక్కడ పర్యటించనున్నారు. కువైట్ ఉన్నతాధికారులు, ప్రవాస భారతీయులతో ఆయన భేటీ అవుతారు. కాగా కువైట్‌ను చివరిసారి 1981లో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ సందర్శించారు. మళ్లీ 43 ఏళ్ల తర్వాత మోదీ అక్కడికి వెళ్తున్నారు. కువైట్‌లో దాదాపు 10 లక్షల మంది భారతీయులు నివసిస్తున్నారు.
Sorry, no posts matched your criteria.