News December 18, 2024

భోజనం చేయగానే సోంపు తింటే..

image

భోజనం చేసిన వెంటనే సోంపు తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇందులో ఉండే అనెథోల్ జీర్ణాశయ ఎంజైమ్‌ల ఉత్పత్తికి సహకరిస్తుంది. ఎసిడిటీ నుంచి ఉపశమనం కలుగుతుంది. సోంపులో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్-సి, పొటాషియం, మెగ్నీషియం సమృద్ధిగా ఉంటాయి. ఈ పోషకాలన్నీ శరీరానికి అందుతాయి. అలాగే నోటి నుంచి దుర్వాసన రాకుండా సోంపు నివారిస్తుంది. ఇది చర్మం పొడిబారకుండా చేయడంతో పాటు దద్దుర్లు రాకుండా చేస్తుంది.

News December 18, 2024

భారత్-చైనా భాయ్ భాయ్

image

భారత్-చైనా సంబంధాలు మరింత బలోపేతమయ్యే దిశగా సాగుతున్నాయి. బీజింగ్ లో ఆ దేశ విదేశాంగ ప్రతినిధితో అజిత్ దోవల్ భేటీ అయ్యారు. సరిహద్దు సమస్యల పరిష్కారానికి 6 ఒప్పందాలపై సంతకాలు చేశారు. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి సరిహద్దుల్లో శాంతిపూర్వకంగా ఉండాలని నిర్ణయించారు. టిబెట్‌లోని కైలాష్ మానసరోవర్ యాత్రను ప్రమోట్ చేయడంతో పాటు నాథులా బోర్డర్ ట్రేడ్, క్రాస్ బోర్డర్ రివర్ కోపరేషన్‌పై సయోధ్య కుదిరింది.

News December 18, 2024

ALERT: రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

image

AP: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ఉత్తర దిశగా ప్రయాణిస్తోందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో వచ్చే 48 గంటలు భారీ వర్షాలు పడతాయని వెల్లడించింది. రేపు కాకినాడ, విశాఖ, అనకాపల్లి, అల్లూరి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. గంటకు 35-45కి.మీ వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది.

News December 18, 2024

అదానీపై మాట్లాడే నైతిక హక్కు సీఎంకు లేదు: కిషన్ రెడ్డి

image

CM రేవంత్ తెలంగాణను భ్రష్టు పట్టిస్తున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఫైరయ్యారు. అదానీ విషయంలో మాట్లాడే నైతిక హక్కు ఆయనకు లేదని, రూ.వంద కోట్లతో స్కిల్ యూనివర్సిటీ అభివృద్ధికి ఒప్పందం చేసుకున్నప్పుడు గుర్తు లేదా? అని ప్రశ్నించారు. రేవంత్ అయినా, రాహుల్ అయినా అదానీ అవినీతిపై ఒక్క సాక్ష్యమైనా చూపిస్తారా? అని సవాల్ విసిరారు. కాంగ్రెస్ సర్కార్ ఏడాదిలోనే ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుందన్నారు.

News December 18, 2024

VIRAL: మద్యం ప్రియుల కొత్త డిమాండ్ అంటూ అధికారి పోస్ట్

image

జమిలి ఎన్నికలపై దేశవ్యాప్త చర్చ జరుగుతున్న వేళ ఓ IRAS అధికారి చేసిన ట్విటర్ పోస్ట్ వైరలవుతోంది. ‘ఒకే దేశం- ఒకే పన్ను, ఒకే దేశం – ఒకే ఎన్నికలు తర్వాత మద్యం ప్రియుల నుంచి ఈ డిమాండ్ వస్తోంది. దయచేసి ఆలోచించండి’ అని ఆయన ట్వీట్ చేశారు. అందులో గోవాలో రూ.320లు ఉన్న వైన్ బాటిల్ కర్ణాటకలో రూ.920గా ఉంది. దీనిపై కూడా వన్ నేషన్- వన్ రేట్ అని డిమాండ్ చేస్తున్నారు.

News December 18, 2024

నిరాశ్రయుల కోసం మంచి ఆలోచన!

image

చలి విపరీతంగా పెరిగిపోవడంతో రోడ్లపై ఉంటోన్న నిరాశ్రయుల కోసం ఢిల్లీ ప్రజలు ముందుకొచ్చారు. వారిని చలి నుంచి రక్షించేందుకు బట్టలను సేకరిస్తున్నారు. ప్రజలకు దుప్పట్లు, స్వెటర్లు, వెచ్చని బట్టలను సేకరించి అవసరమైన వారికి అందిస్తున్నారు. దీంతో చాలా మంది చలి పులి నుంచి రక్షణ పొందుతున్నారు. ఇలాంటి ఆలోచనే ఇతర నగరాల ప్రజలూ చేయాలని, నిరాశ్రయులకు సాయం చేయాలని నెటిజన్లు సూచిస్తున్నారు.

News December 18, 2024

పరిటాల రవి హత్య కేసు.. నిందితులకు బెయిల్

image

AP: టీడీపీ దివంగత నేత పరిటాల రవీంద్ర హత్యకేసు నిందితులకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. హత్య జరిగిన 18 ఏళ్ల తర్వాత ఐదుగురు నిందితులకు బెయిల్ ఇచ్చింది. A-3 నారాయణరెడ్డి, A-4 రేఖమయ్య, A-5 రంగనాయకులు, A-6 వడ్డే కొండ, A-8 ఓబిరెడ్డికి బెయిల్ మంజూరైంది. కాగా 2005 జనవరి 24న పరిటాల రవి అనంతపురంలోని టీడీపీ కార్యాలయంలో హత్యకు గురైన సంగతి తెలిసిందే.

News December 18, 2024

చలి పులి.. ఆ జిల్లాలో స్కూళ్ల టైమింగ్స్ మార్పు

image

TG: రాష్ట్రంలో చలి తీవ్రత నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లాలో పాఠశాల వేళల్లో ప్రభుత్వం మార్పులు చేసింది. ఉ.9.40 నుంచి సా.4.30 వరకు స్కూళ్లు నడపాలని ఆదేశించింది. ప్రస్తుతం ఉ.9.15 నుంచి సా.4.15 వరకు పాఠశాలలు నడుస్తున్నాయి. కాగా, తాము చలితో ఇబ్బందులు పడుతున్నామని, టైమింగ్స్ మార్చాలని పలు జిల్లాల విద్యార్థులు కోరుతున్నారు.

News December 18, 2024

OTT చరిత్రలోనే రికార్డు

image

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ‘సలార్’ సినిమా ఓటీటీలో రికార్డు సృష్టించింది. హాట్‌స్టార్‌లో 300 రోజులుగా ట్రెండ్ అవుతోందని సినీవర్గాలు పేర్కొన్నాయి. ఓటీటీ చరిత్రలోనే ఇదో రికార్డని తెలిపాయి. ఈ చిత్రం గతేడాది డిసెంబర్ 22న విడుదలవగా ఈ ఏడాది జనవరి 20 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. కాగా, ఈ చిత్ర సీక్వెల్ కోసం ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

News December 18, 2024

పట్నం నరేందర్ రెడ్డికి బెయిల్

image

TG: లగచర్లలో అధికారులపై దాడి కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి బెయిల్ లభించింది. ఆయనతో పాటు ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న BRS కార్యకర్త సురేశ్‌ సహా మొత్తం 24 మందికి బెయిల్ వచ్చింది.