News December 18, 2024

ఫార్ములా-ఈ రేసులో అవకతవకలు జరగలేదు: KTR

image

TG: CM రేవంత్‌కు KTR బహిరంగ లేఖ రాశారు. ‘ఫార్ములా-ఈ రేస్ అంశంపై అసెంబ్లీలో చర్చ పెట్టాలి. అప్పుడే నిజాలేమిటో తేలుతాయి. HYDకు మంచి జరగాలనే ఉద్దేశంతోనే ఫార్ములా-ఈ రేసు సంస్థతో ఒప్పందం చేసుకున్నాం. కానీ మీరు రాజకీయ కక్ష సాధింపు చర్యలకు బలి చేశారు. అందులో ఎలాంటి అవకతవకలు జరగలేదు. BRSపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారు. రేస్ వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు రూ.700 కోట్ల లబ్ధి చేకూరింది’ అని వెల్లడించారు.

News December 18, 2024

శ్రీతేజ్‌ను పరామర్శించిన అల్లు అరవింద్

image

TG: సంధ్య థియేటర్ తొక్కిసలాటలో గాయపడిన శ్రీతేజ్‌‌ను అల్లు అరవింద్ పరామర్శించారు. ఇవాళ సికింద్రాబాద్ కిమ్స్‌కు వెళ్లిన ఆయన వైద్యులతో మాట్లాడి బాలుడి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. పుష్ప-2 ప్రీమియర్ సందర్భంగా డిసెంబర్ 4న థియేటర్ బయట తొక్కిసలాటలో శ్రీతేజ్ తల్లి రేవతి చనిపోగా, బాలుడు తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. ఇదే కేసులో హీరో అల్లు అర్జున్ జైలుకు వెళ్లొచ్చిన విషయం తెలిసిందే.

News December 18, 2024

ప్రెగ్నెంట్ అని తెలియగానే షాకయ్యా: రాధిక

image

తాను ప్రెగ్నెంట్ అని తెలియగానే షాక్‌కు గురయ్యానని హీరోయిన్ రాధికా ఆప్టే అన్నారు. పిల్లల కోసం తాము ఎలాంటి ప్లాన్ చేసుకోలేదని ఆమె తెలిపారు. ‘ప్రెగ్నెన్సీ సమయంలో చాలా లావుగా తయారయ్యా. నన్ను నేను చూసుకునేందుకు ఇబ్బంది పడ్డా. కానీ ఇప్పుడు అదే సంతోషం కలిగిస్తోంది. ప్రెగ్నెన్సీ అనేది అంత సులువైన విషయం కాదు. మానసిక, శారీరక సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది’ అని ఆమె చెప్పుకొచ్చారు.

News December 18, 2024

₹14,000CR మాల్యా ఆస్తులు బ్యాంకులకు బదిలీ చేశాం: నిర్మల

image

వేర్వేరు స్కాముల్లో నష్టపోయిన బాధితులకు ED ₹22,280CR పరిహారం ఇచ్చిందని FM నిర్మల LSకు తెలిపారు. విజయ్ మాల్యా ఆస్తుల నుంచి ₹14,000CRను బ్యాంకులకు బదిలీ చేసిందన్నారు. నీరవ్ మోదీ ₹1052CR, హీరా గ్రూప్ ₹226CR, మెహుల్ చోక్సీ ₹2565CR, BPSL ₹4025CR, NSEL ₹17CR, SRS గ్రూప్ ₹20CR, రోజ్ వ్యాలీ గ్రూప్ ₹19CR, సూర్యా ఫార్మా నుంచి ₹185CR రికవరీ చేసిందన్నారు. దేశం నుంచి పారిపోయినా తాము వదిలిపెట్టడం లేదన్నారు.

News December 18, 2024

చైనా తరహాలో విద్యుత్ ప్లాంట్లు: మంత్రి నారాయణ

image

AP: రాష్ట్రంలో చైనా తరహా విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తామని మంత్రి నారాయణ తెలిపారు. ఈ ప్లాంట్లు చెత్త ఆధారంగా పనిచేస్తాయని చెప్పారు. రాజమండ్రిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘మూడేళ్లలో రాజధాని అమరావతి పనులు పూర్తి చేస్తాం. గత ప్రభుత్వం నిధులను దారి మళ్లించింది. విపరీతంగా పన్నులు పెంచి ప్రజలను దోపిడీ చేసింది. తిరిగి రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు కృషి చేస్తున్నాం’ అని ఆయన తెలిపారు.

News December 18, 2024

జేపీసీ మెంబర్‌గా ప్రియాంక గాంధీ?

image

జమిలి బిల్లును కేంద్రం జాయింట్ పార్లమెంటరీ కమిటీ(JPC)కి పంపనున్న విషయం తెలిసిందే. కమిటీకి అధికార, విపక్షాల నుంచి సభ్యులను ఎంపిక చేస్తారు. INC తరఫున ప్రియాంక గాంధీ, మనీశ్ తివారీకి చోటు దక్కనున్నట్లు తెలుస్తోంది. TDP నుంచి హరీశ్ బాలయోగి, DMK-విల్సన్, సెల్వ గణపతి, JDU-సంజయ్ ఝా, SP-ధర్మేంద్ర యాదవ్, శివసేన(శిండే)-శ్రీకాంత్ శిండే, TMC నుంచి కళ్యాణ్ బెనర్జీ, సాకేత్ గోఖలేకు అవకాశం దక్కుతుందని సమాచారం.

News December 18, 2024

ట్రైనింగ్ సమయంలో పేలుడు.. ఇద్దరు జవాన్లు మృతి

image

రాజస్థాన్‌లోని బికనీర్‌లో జరిగిన ప్రమాదంలో ఇద్దరు జవాన్లు మరణించారు. ట్రైనింగ్‌లో భాగంగా ఓ ట్రక్కులో మందుగుండు సామగ్రి లోడ్ చేస్తుండగా పేలుడు సంభవించినట్లు అధికారులు వెల్లడించారు. ఇద్దరు జవాన్లు మృతి చెందగా, మరొకరికి గాయాలు అయ్యాయని తెలిపారు. మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్‌లో ఈ ప్రమాదం జరిగింది.

News December 18, 2024

సౌత్ఇండియా వారికి అర్హత లేదంటూ ఉద్యోగ నోటిఫికేషన్!

image

ఉద్యోగ వేటలో ఉన్న తెలుగు రాష్ట్రాల యువకులు దేశంలో ఎక్కడైనా ఉద్యోగం చేసేందుకు సిద్ధమవుతున్నారు. కానీ, కొన్ని కంపెనీలు దక్షిణ భారతదేశానికి చెందిన వారిని అణచివేస్తున్నాయి. నైపుణ్యాన్ని బట్టి ఉద్యోగాల్లోకి తీసుకోకుండా ప్రాంతీయతను పరిగణనలోకి తీసుకుంటున్నాయి. తాజాగా యూపీలోని నోయిడాకు చెందిన ఓ కన్సల్టింగ్ కంపెనీ ఇచ్చిన నోటిఫికేషన్‌లో సౌత్ఇండియన్స్ అర్హులు కాదని పేర్కొంది. దీనిపై విమర్శలొస్తున్నాయి.

News December 18, 2024

ఒకింత ఆశ్చర్యపోయా: హర్భజన్ సింగ్

image

రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించడం తనను ఒకింత ఆశ్చర్యానికి గురి చేసిందని టీమ్‌ఇండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ అన్నారు. అతనో గొప్ప బౌలర్, లెజెండ్ అని కొనియాడారు. ఇండియా కోసం చాలా వికెట్లు తీశారని చెప్పారు. తన గొప్ప ప్రదర్శనతో ఎన్నో‌సార్లు ఇండియా విజయాల్లో కీలక పాత్ర పోషించారని వివరించారు. తను ప్రారంభించబోయే కొత్త జీవితంలో అంతా మంచే జరగాలని కోరుకుంటున్నట్లు హర్భజన్ తెలిపారు.

News December 18, 2024

కాళ్లకు తిమ్మిర్లు.. నడుంనొప్పి.. వెన్నుచూపని అశ్విన్!

image

జట్టు కష్టాల్లో ఉంటే అశ్విన్ ఎంత రిస్క్ అయినా తీసుకొనేవారు. అలసిన తన దేహాన్ని అస్సలు పట్టించుకొనేవారు కాదు. వరుసగా 5 సెషన్లు బౌలింగ్ చేసి నైట్‌వాచ్‌మన్‌గా వచ్చిన సందర్భాలెన్నో. 2021 BGT సిడ్నీ టెస్టులో అతడి పట్టుదలను ఎంత పొగిడినా తక్కువే. 49 ఓవర్లు వేసి అతడి కాళ్లు తిమ్మిరెక్కాయి. నడుం నొప్పితో దేహం సహకరించకున్నా ఆఖరి రోజు విహారితో కలిసి క్రీజులో నిలబడ్డారు. ఓడిపోయే మ్యాచును డ్రాగా మలిచారు.