News January 16, 2025

శుభ ముహూర్తం (16-01-2025)

image

✒ తిథి: బహుళ తదియ తె.4.25 వరకు
✒ నక్షత్రం: ఆశ్లేష మ.12.02 వరకు
✒ శుభ సమయం: ఏమి లేవు
✒ రాహుకాలం: ప.1.30-3.00 వరకు
✒ యమగండం: ఉ.6.00-7.30 వరకు
✒ దుర్ముహూర్తం: 1.ఉ.10.00-10.48 వరకు
2.మ.2.48-3.36 వరకు
✒ వర్జ్యం: రా.12.42-2.23 వరకు
✒ అమృత ఘడియలు: ఉ.10.22-12.01 వరకు

News January 16, 2025

TODAY HEADLINES

image

✒ వార్ షిప్స్, జలాంతర్గామిని ప్రారంభించిన PM
✒ కొత్త ఆఫీస్ లైబ్రరీకి మన్మోహన్ పేరు: INC
✒ హైకోర్టులకు కొత్త జడ్జిలు.. TGకి నలుగురు, APకి ఇద్దరు
✒ స్కిల్ కేసు: CBN బెయిల్ రద్దు పిటిషన్ కొట్టివేత
✒ తిరుమలలో టికెట్ల స్కామ్.. ఐదుగురు అరెస్ట్
✒ కేటీఆర్ క్వాష్ పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు
✒ TG: ఏప్రిల్ 29 నుంచి మే 5 వరకు EAPCET
✒ TG: ఫిబ్రవరి నుంచి KF బీర్లు బంద్

News January 16, 2025

సొంత ఇల్లు, కారు లేవు.. అఫిడవిట్‌లో కేజ్రీవాల్

image

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇవాళ నామినేషన్ వేసిన కేజ్రీవాల్ తనకు రూ.1.73 కోట్ల ఆస్తులున్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఇందులో రూ.2.96లక్షల సేవింగ్స్, రూ.50వేల నగదు ఉన్నట్లు ప్రకటించారు. స్థిరాస్తుల విలువ రూ.1.7 కోట్లని తెలిపారు. తనకు సొంత ఇల్లు, కారు లేవని అందులో పొందుపర్చారు. న్యూఢిల్లీ నుంచి బరిలో నిలిచిన కేజ్రీవాల్ 2020 ఎన్నికల్లో తన ఆస్తుల విలువను రూ.3.4 కోట్లుగా ప్రకటించారు.

News January 16, 2025

నిద్రలో వచ్చే కలల గురించి కొన్ని నిజాలు

image

ప్రతి ఒక్కరికీ నిద్రలో కలలు రావడం సహజం. అవి ఎందుకు వస్తాయో కచ్చితమైన ఆధారాలేవీ లేవు. కలల గురించి కొన్ని నిజాలు..
✒ ప్రతి నిద్రలో 3-6 కలలు వస్తాయి.
✒ ఒక్కో కల 5- 20ని.లు ఉంటుంది.
✒ నిద్రలేచే సరికి 95% కలలు గుర్తుండవు.
✒ మనకు తీరని కోరికలే కలలుగా వస్తాయి.
✒ కలల వల్ల మెదడులో కొన్ని జ్ఞాపకాలు వృద్ధి చెందుతాయి.
✒ ఇంద్రియాల స్పర్శ జ్ఞానం ఎక్కువగా ఉండటం వల్ల అంధులకు కలలు ఎక్కువగా వస్తాయి.

News January 16, 2025

ఎట్టకేలకు ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి తెర

image

ఇజ్రాయెల్-హమాస్ మధ్య ఎట్టకేలకు కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. గాజాలో శాంతి స్థాపనకు ఇరుదేశాలు అంగీకారానికి వచ్చాయి. ఖతర్ మధ్యవర్తిత్వంతో బందీల విడుదలకు సంబంధించి ఇజ్రాయెల్-హమాస్ ఒప్పందానికి వచ్చాయి. యుద్ధం ముగింపునకు అమెరికా, ఈజిప్ట్ కూడా తీవ్రంగా కృషి చేశాయి. కాగా 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ దాడితో యుద్ధం మొదలైంది.

News January 16, 2025

నిరాధార ప్రచారం నమ్మొద్దు: బుమ్రా

image

తనకు గాయమైందని జరుగుతున్న ప్రచారంపై స్టార్ బౌలర్ బుమ్రా క్లారిటీ ఇచ్చారు. తన ఆరోగ్యంపై తప్పుడు ప్రచారం జరుగుతుందని, అదంతా నిరాధార ప్రచారమని ట్వీట్ చేశారు. ఇలాంటివి నవ్వు తెప్పిస్తాయన్నారు. BGTలో సిడ్నీ టెస్ట్ రెండో ఇన్నింగ్స్ సందర్భంగా అతడు అర్ధంతరంగా మైదానాన్ని వీడారు. తాజాగా ఇంగ్లండ్‌తో సిరీస్‌కు ఆయనకు విశ్రాంతినిచ్చారు. ఈ క్రమంలో బుమ్రా గాయం నుంచి కోలుకోలేదని CTకి దూరమవుతారని ప్రచారం జరిగింది.

News January 16, 2025

సూర్యాపేట లేదా ఖమ్మంలో రాహుల్ సభ: మహేశ్ కుమార్

image

TG: ఫిబ్రవరి రెండో వారంలోపు సూర్యాపేట లేదా ఖమ్మంలో రాహుల్ గాంధీ సభ ఉంటుందని TPCC చీఫ్ మహేశ్ కుమార్ తెలిపారు. రాహుల్ తెలంగాణ టూర్‌, క్యాబినెట్ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీపై ఇవాళ ఆయన ఢిల్లీలో కేసీ వేణుగోపాల్‌తో చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ నెలాఖరు వరకు నామినేటెడ్ పదవులను భర్తీ చేస్తామన్నారు. క్యాబినెట్ విస్తరణపై పార్టీ అధిష్ఠానమే తుది నిర్ణయం తీసుకుంటుందని మహేశ్ వెల్లడించారు.

News January 16, 2025

పుష్ప-3 అప్డేట్ చెప్పిన DSP

image

పుష్ప-3 కోసం సుకుమార్ నిరంతరం పనిచేస్తున్నారని DSP వెల్లడించారు. స్టోరీపై రీవర్క్ కూడా జరుగుతోందని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘పుష్ప-2లో అల్లు అర్జున్ అద్భుతంగా నటించారు. ప్రతి టెక్నీషియన్ బాగా కష్టపడ్డారు. వర్క్ విషయంలో నేనెప్పుడూ టెన్షన్ పడను. ఒత్తిడికి గురైతే క్రియేటివిటీ ఉండదు. సుకుమార్ విజన్, ఆయన స్టోరీలు మాకు స్ఫూర్తి. రెండు పార్టుల కోసం కష్టపడినట్లుగానే పుష్ప-3 కోసం పనిచేస్తాం’ అని తెలిపారు.

News January 16, 2025

4 కొత్త పథకాలు.. సీఎస్ కీలక ఆదేశాలు

image

TG: రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకాల లబ్ధిదారుల ఎంపికపై కలెక్టర్లతో సీఎస్ శాంతికుమారి సమావేశమయ్యారు. ఇప్పటికే విడుదల చేసిన మార్గదర్శకాల మేరకు అర్హులను గుర్తించి జాబితాలను ఈ నెల 21 నుంచి గ్రామసభల్లో ప్రదర్శించాలని ఆదేశించారు. GHMCలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ నెల 26 నుంచి పథకాలను అమలు చేస్తామని ప్రభుత్వం వెల్లడించిన విషయం తెలిసిందే.

News January 15, 2025

చదువుతో పనిలేదు.. మీ వర్క్ పంపండి: ఎలాన్ మస్క్

image

సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ బంపరాఫర్ ఇచ్చారు. చదువుతో సంబంధం లేకుండా వారు తయారుచేసిన బెస్ట్ వర్క్‌ను పంపి తమతో చేతులు కలపాలని పిలుపునిచ్చారు. ‘మీరు అసలు స్కూల్‌కు వెళ్లకపోయినా, చదవకపోయినా, పెద్ద కంపెనీలో పనిచేయకపోయినా మేం పట్టించుకోం. మీరు everything app(మస్క్ డ్రీమ్ యాప్) రూపొందించాలనుకుంటే మీ బెస్ట్ వర్క్‌ను code@x.comకి పంపండి’ అని ట్వీట్ చేశారు.