India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
బ్రిస్బేన్‌లో భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడో టెస్టుకు వర్షం మరోసారి అంతరాయం కలిగించింది. ఐదవ రోజు ఆట ఆరంభమైన కాసేపటికే భారత్ <<14910004>>ఆలౌటైంది<<>>. ఆసీస్ రెండో ఇన్నింగ్స్ ప్రారంభమయ్యే సమయానికి ఆకాశం మేఘావృతమై ఉరుములు రావడంతో అంపైర్లు మ్యాచును నిలిపివేశారు. ప్రస్తుతం అక్కడ వర్షం కురుస్తోందని, ఇవాళ వాతావరణం మ్యాచుకు అనుకూలించేలా లేదని క్రీడా వర్గాలు పేర్కొంటున్నాయి.
బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో ఏపీ, తమిళనాడు, యానాంలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. 2 రోజుల్లో TNలో ఇది తీరం దాటనుంది. ఇవాళ VSP, అనకాపల్లి, కాకినాడ, NLR, TPTY జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, VZM, కృష్ణా, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయంది. దక్షిణ కోస్తా తీరంలో గంటకు 55కి.మీ వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. శనివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లవద్దంది.
విజయ్ హజారే ట్రోఫీలో ఆడే కేరళ జట్టుకు సంజూ శాంసన్ ఎంపిక కాలేదు. ట్రైనింగ్ క్యాంపులకు ఆయన హాజరు కాలేదని, ప్రాక్టీస్ మ్యాచుల్లో ఆడిన వారినే సెలక్ట్ చేస్తామని ఆ రాష్ట్ర క్రికెట్ బోర్డు సెక్రటరీ వినోద్ కుమార్ స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన SMATలో సంజూ కేరళ టీమ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించారు. ఇప్పుడు అతని స్థానంలో సల్మాన్ నిజార్‌ను కెప్టెన్‌గా నియమించారు. ఈ 50 ఓవర్ల టోర్నీ ఈనెల 21 నుంచి ప్రారంభం కానుంది.
AP: టెన్త్ పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు తమ పేర్ల వివరాల్లో తప్పుల సవరణకు ఈ నెల 19 నుంచి 23 వరకు అవకాశం ఉండనుంది. విద్యార్థి, తల్లిదండ్రుల పేర్లు, పుట్టిన తేదీ, మీడియం వంటివి ఇప్పటికే సమర్పించిన నామినల్ రోల్స్‌లో సవరించుకోవచ్చు. HMలు తమ ఆన్‌లైన్ లాగిన్ ద్వారా ఈ సవరణలు చేయవచ్చు. ఇందుకోసం అపార్ వివరాలతో విద్యార్థుల డీటైల్స్‌ను మరోసారి పరిశీలిస్తారు.
ఆస్ట్రేలియాతో మూడో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 260 పరుగులకు ఆలౌటైంది. దీంతో AUS తొలి ఇన్నింగ్స్‌లో 185 రన్స్ ఆధిక్యం సంపాదించింది. IND బ్యాటర్లలో రాహుల్ 84, జడేజా 77, ఆకాశ్ దీప్ 31 రన్స్‌తో రాణించారు. AUS బౌలర్లలో కమిన్స్ 4, స్టార్క్ 3 వికెట్లు పడగొట్టగా, హెజిల్‌వుడ్, హెడ్, లియోన్ తలో వికెట్ తీశారు. ఇవాళ చివరి రోజు కావడంతో AUS గెలుస్తుందా? లేదా మ్యాచ్ డ్రా అవుతుందా అనేది ఆసక్తికరంగా మారింది.
హైదరాబాద్ శివారులోని రాజేంద్ర నగర్‌లో 100 ఎకరాల్లో కొత్త హైకోర్టు నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇందుకోసం రూ.2583 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మొత్తంలో సివిల్ పనుల కోసం రూ.1980 కోట్లు, ఇతర పనుల కోసం రూ.603 కోట్లు ఖర్చు చేయనుంది. హైకోర్టు భవన నిర్మాణానికి ఈ నెలాఖరున లేదా వచ్చే నెల తొలి వారంలో ఆర్‌అండ్‌బీ టెండర్లు పిలవనున్నట్లు సమాచారం.
TG: అమెరికాలో గౌతమ్ అదానీపై కేసు, మణిపుర్ అల్లర్లపై ప్రధాని మోదీ వైఖరిని నిరసిస్తూ TPCC ఇవాళ ఛలో రాజ్ భవన్ కార్యక్రమం నిర్వహించనుంది. ఈ కార్యక్రమంలో CM రేవంత్, Dy.CM భట్టితో సహా కాంగ్రెస్ MPలు, MLAలు పాల్గొంటారు. ఉ.11 గంటలకు నెక్లెస్ రోడ్డులోని ఇందిరా గాంధీ విగ్రహం నుంచి ర్యాలీగా వెళ్లనున్నారు. మణిపుర్‌లో అల్లర్లు జరిగినప్పటి నుంచి ప్రధాని అక్కడ పర్యటించలేదని కాంగ్రెస్ విమర్శిస్తోంది.
AP: భూ సమస్యల పరిష్కారానికై ఈనెల 6 నుంచి ప్రభుత్వం నిర్వహిస్తోన్న రెవెన్యూ సదస్సులకు అద్భుత స్పందన వస్తోందని టీడీపీ తెలిపింది. 10 రోజుల్లో రెండున్నర లక్షల మంది హాజరయ్యారని వెల్లడించింది. రాష్ట్రంలో 17403 రెవెన్యూ గ్రామాలు ఉండగా ఇప్పటివరకు 4427 గ్రామాల్లో సదస్సుల నిర్వహణ పూర్తయిందని ట్వీట్ చేసింది. వచ్చే ఏడాది జనవరి 8 వరకు ఈ సదస్సులు కొనసాగుతాయని పేర్కొంది.
TG: ఉమ్మడి ప్రవేశ పరీక్షలకు కన్వీనర్లను నియమిస్తూ ఉన్నత విద్యా మండలి ఉత్తర్వులిచ్చింది. ఏయే పరీక్షలను ఏ వర్సిటీ నిర్వహించనుందో వెల్లడించింది.
EAPCET-ప్రొ. డీన్ కుమార్ (JNTUH)
PGCET-ప్రొ. అరుణకుమారి (JNTUH)
ICET-ప్రొ. అలువల రవి (MGU)
ECET-ప్రొ. చంద్రశేఖర్ (OU), PECET-ప్రొ. దిలీప్(PU)
LAWCET, PGLCET-ప్రొ. విజయలక్ష్మి(OU)
EDCET-ప్రొ. వెంకట్రామ్ రెడ్డి(KU)
భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈనెల 21 నుంచి రెండు రోజులపాటు కువైట్‌లో పర్యటించనున్నారు. కువైట్ దేశాధినేతలతో, ఉన్నతాధికారులతో సమావేశమై దౌత్య, వ్యాపార సంబంధాలపై చర్చిస్తారు. అక్కడ నివసించే భారతీయులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఆ దేశంలో భారత ప్రధాని పర్యటించడం గత 43 ఏళ్లలో ఇదే తొలిసారి. చివరగా 1981లో అప్పటి పీఎం ఇందిరా గాంధీ కువైట్‌లో పర్యటించారు. ఆ దేశంలో 10 లక్షల మంది భారతీయులు ఉంటున్నట్లు సమాచారం.
Sorry, no posts matched your criteria.