News June 4, 2024

తండ్రీకుమారుల వెనుకంజ

image

AP: వైసీపీ కీలక నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన కుమారుడు మోహిత్ రెడ్డి వెనుకంజలో ఉన్నారు. గత ఎన్నికల్లో చంద్రగిరి నుంచి గెలిచిన భాస్కర్ రెడ్డి ఈసారి ఒంగోలు ఎంపీగా బరిలో నిలిచారు. అక్కడ టీడీపీ అభ్యర్థి మాగంటి శ్రీనివాసులు రెడ్డి 13,979 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇటు చంద్రగిరి స్థానంలో ఆయన కుమారుడు మోహిత్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఆయన ప్రత్యర్థి పులివర్తి నాని కంటే 10,579 ఓట్ల వెనుకంజలో ఉన్నారు.

News June 4, 2024

BREAKING: లక్ష ఓట్లను చీల్చిన షర్మిల

image

AP: అన్న వైఎస్ జగన్‌తో విభేదించి కాంగ్రెస్‌లో చేరిన షర్మిల కడపలో భారీగా వైసీపీ ఓట్లను చీల్చారు. ఏకంగా 1,09,620 ఓట్లు సాధించారు. అవినాశ్ రెడ్డి(YCP) 4,53,483 ఓట్లు, టీడీపీ అభ్యర్థి భూపేశ్ రెడ్డి 3,93,215 ఓట్లు సాధించి ఒకటి, రెండు స్థానాల్లో ఉన్నారు. ప్రస్తుతం అవినాశ్ 60,268 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. అలాగే పులివెందులలోనూ సీఎం జగన్ మెజార్టీని భారీగా తగ్గించారు.

News June 4, 2024

కంటోన్మెంట్‌లో కాంగ్రెస్ గెలుపు

image

కంటోన్మెంట్‌ అసెంబ్లీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలిచింది. ఆ పార్టీ అభ్యర్థి శ్రీగణేశ్ విజయం సాధించారు. సమీప బీఆర్ఎస్ అభ్యర్థి నివేదితపై ఆయన గెలుపొందారు. ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న లాస్య నందిత మృతితో ఇక్కడ ఉప ఎన్నిక జరిగింది. ఈ స్థానంలో బీజేపీ నుంచి ఇక్కడ వంశ తిలక్ పోటీ చేశారు.

News June 4, 2024

అప్పట్లో షైనింగ్ ఇప్పుడు 400 పార్ – అచ్చిరాలే!

image

బీజేపీకి కొన్ని నినాదాలు కలిసిరావడం లేదు. 2004లో వాజ్‌పేయీ ‘ఇండియా షైనింగ్’తో బరిలోకి దిగారు. సరిగ్గా 20 ఏళ్లకు నరేంద్రమోదీ ‘అబ్కీ బార్ 400 పార్’తో రంగంలోకి దూకారు. అప్పట్లో కాంగ్రెస్ సౌజన్యంతో యూపీఏ వన్ విజయదుందుభి మోగించింది. 2024లో మాత్రం ఇండియా కూటమి గట్టి పోటీనిచ్చింది. అనూహ్యంగా పుంజుకొని బీజేపీని సొంతంగా మ్యాజిక్ ఫిగర్‌ దాటనివ్వలేదు. ప్రస్తుత ట్రెండ్స్ ప్రకారం NDA హ్యాట్రిక్‌కు ఢోకా లేదు.

News June 4, 2024

ఆధిక్యంలో సత్యకుమార్

image

ధర్మవరంలో ఫలితం తారుమారైంది. కౌంటింగ్ ఆరంభం నుంచి వైసీపీ అభ్యర్థి కేతిరెడ్డి లీడ్ కనబర్చడంతో YCP శ్రేణులు ఆయన గెలుపు పక్కా అనుకున్నారు. కానీ బత్తులపల్లి నుంచి ధర్మవరం టౌన్ వరకు గల బూత్‌ల ఓట్ల లెక్కింపుతో ఇది రివర్స్ అయింది. 19వ రౌండ్ ముగిసేసరికి BJP అభ్యర్థి సత్యకుమార్ 3300 ఓట్లకు పైగా మెజార్టీలో ఉన్నారు.

News June 4, 2024

ఎన్డీఏ కన్వీనర్‌గా చంద్రబాబు?

image

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు బీజేపీ కీలక బాధ్యతలు అప్పగించనున్నట్లు సమాచారం. ఆయన్ను ఎన్డీఏ కన్వీనర్‌గా నియమించనున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కేంద్రంలో ఆ పార్టీకి సీట్లు తగ్గడంతో చంద్రబాబు మద్దతు కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో బీజేపీ పెద్దలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇదే విషయాన్ని ప్రధాని మోదీ, అమిత్ షా చంద్రబాబుకు ఫోన్లో చెప్పినట్లు తెలుస్తోంది.

News June 4, 2024

సీఎం జగన్ మామపై టీడీపీ అభ్యర్థి గెలుపు

image

AP: YSR జిల్లా కమలాపురంలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. సీఎం జగన్ మేనమామ, వైసీపీ అభ్యర్థి రవీంద్రనాథ్ రెడ్డిపై టీడీపీ అభ్యర్థి పుట్టా చైతన్య రెడ్డి విజయం సాధించారు. అటు మైదుకూరులోనూ వైసీపీ అభ్యర్థి రఘురాం రెడ్డిపై టీడీపీ అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ 20,937 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.

News June 4, 2024

ఓటమి దిశగా ప్రజ్వల్

image

లైంగిక వేధింపుల కేసు నిందితుడు జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ ఓటమి దిశగా సాగుతున్నారు. కర్ణాటకలోని హసన్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయనపై ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి శ్రేయస్ పటేల్ 43వేల ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కౌంటింగ్ ప్రారంభమైన తర్వాత ఆయన లీడింగ్‌లో కొనసాగగా ఇప్పుడు రెండోస్థానానికి పడిపోయారు.

News June 4, 2024

ప్రజలకు గుర్తుంది.. పార్టీలకు గుర్తే మిగిలింది!

image

మహారాష్ట్రలో శివసేనను చీల్చి అసలైన శివసేన గుర్తు పొందిన CM ఏకనాథ్ శిండే వర్గానికి 5 సీట్లొచ్చాయి. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వ శివసేన 11 చోట్ల గెలుపు వైపు పయనిస్తోంది. ఇక NCPని విభజించి ఆ లోగో పొందిన అజిత్ పవార్ గ్రూపుకు ఒక్క సీటే దక్కగా శరద్ పవార్ NCP 6 చోట్ల ఆధిక్యంలో ఉంది. దీంతో చీల్చిన వర్గాలకు గుర్తులు తప్ప ఓట్లు మిగులలేదు. ఓటర్లంతా గుర్తుంచుకుంటారు అనేందుకు ఇదే ఉదాహరణ అని విశ్లేషకులు చెబుతున్నారు.

News June 4, 2024

ఉమ్మడి చిత్తూరులో పెద్దిరెడ్డి ఫ్యామిలీ సేఫ్

image

AP: రాయలసీమలోని అన్ని జిల్లాల్లో వైసీపీకి ఎదురుగాలి వీయగా.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మంత్రి పెద్దిరెడ్డి ఫ్యామిలీ మాత్రం సేఫ్ జోన్‌లో ఉంది. పుంగనూరు అసెంబ్లీలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముందంజలో ఉండగా.. ఆయన సోదరుడు ద్వారకానాథ్ రెడ్డి తంబళ్లపల్లెలో లీడింగ్‌లో ఉన్నారు. ఇటు రాజంపేట లోక్‌సభ బరిలో నిలిచిన పెద్దిరెడ్డి కుమారుడు మిథున్ రెడ్డి 47,792 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.