India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పెయిడ్ యూజర్లకే అందుబాటులో ఉన్న ChatGPT సెర్చ్ ఇంజిన్ సేవలు ఇకపై అందరికీ ఫ్రీగా అందనున్నాయి. సెర్చ్ ఇంజిన్ విషయంలో గూగుల్‌కు పోటీగా దీని మాతృసంస్థ OpenAI అడ్వాన్స్‌డ్ వాయిస్ సెర్చ్ మోడ్ తదితర ఫీచర్లను జత చేసింది. ChatGPT లాగిన్ అయిన యూజర్లు సెర్చ్ ఇంజిన్ App, సైట్ సేవలను వినియోగించుకోవచ్చు. ఇన్నాళ్లు డేటా బేస్‌లోని సమాచారమిచ్చిన ChatGPT ఇకపై సెర్చ్ ఇంజిన్ సాయంతో వెబ్‌లోని సమాచారాన్ని అందించనుంది.
మంచు మనోజ్‌పై ఆయన తల్లి నిర్మల సంచలన కామెంట్లు చేశారు. రెండు రోజుల క్రితం <<14889405>>జనరేటర్‌లో చక్కెర<<>> పోశారని మనోజ్ చేసిన ఫిర్యాదులో నిజం లేదని కొట్టిపారేశారు. ఈ విషయాన్ని పహాడీ షరీఫ్ పోలీసులకు లేఖలో తెలియజేశారు. విష్ణు ఎవరితోనూ గొడవ పెట్టుకోలేదని ఆమె స్పష్టం చేశారు. ‘నా పుట్టిన రోజు కావడంతో కేక్ కట్ చేయించి సెలబ్రేట్ చేసి విష్ణు వెళ్లిపోయారు’ అని పేర్కొన్నారు. అంతకు మించి ఏమీ జరగలేదన్నారు.
TG: ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు ప్రభుత్వం వెంటనే చెల్లించాలని అసెంబ్లీలో MIM నేత అక్బరుద్దీన్ డిమాండ్ చేశారు. బకాయిలతో విద్యార్థులు, విద్యాసంస్థల యాజమన్యాలు ఇబ్బందులు పడుతున్నాయని చెప్పారు. ప్రభుత్వం ఇప్పటికైనా బకాయిలు చెల్లించి విద్యార్థులకు భరోసా ఇవ్వాలని కోరారు. లేకపోతే నిరసనకు దిగుతామని హెచ్చరించారు. ఈ విషయంలో ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందని మంత్రి జూపల్లి కృష్ణారావు బదులిచ్చారు.
జమిలి ఎన్నికలను టీఎంసీ, డీఎంకే వ్యతిరేకించాయి. ప్రస్తుతం కావాల్సింది జమిలి కాదని, ఎన్నికల సంస్కరణలని టీఎంసీ అభిప్రాయపడింది. జమిలి వల్ల రాష్ట్రాల హక్కులు హరించాలని కేంద్రం చూస్తోందని మండిపడింది. మరోవైపు 2/3 మెజార్టీ లేకుండా బిల్లును ఎలా ప్రవేశపెడతారని డీఎంకే ప్రశ్నించింది. బిల్లును జేపీసీకి పంపాలని డిమాండ్ చేసింది.
జమిలి బిల్లుకు TDP మద్దతు తెలిపింది. లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వం బిల్లు ప్రవేశపెట్టగా.. TDP బేషరతుగా మద్దతిస్తున్నట్లు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రకటించారు. అంతకముందు టీడీపీ MP లావు శ్రీకృష్ణదేవరాయలు పార్లమెంట్ ఆవరణలో మాట్లాడుతూ.. జమిలీ ఎన్నికలకు TDP సంపూర్ణ మద్దతిస్తున్నట్లు ప్రకటించారు. ఈ బిల్లు ద్వారా దేశవ్యాప్తంగా సుపరిపాలన అందుతుందన్నారు.
జమిలి ఎన్నికల బిల్లును తాము వ్యతిరేకిస్తున్నామని సమాజ్‌వాదీ పార్టీ తెలిపింది. తమ నేత అఖిలేశ్ యాదవ్ బదులు ఎంపీ ధర్మేంద్ర యాదవ్ లోక్‌సభలో బిల్లుపై మాట్లాడారు. బీజేపీ నియంతృత్వాన్ని అమలు చేస్తోందని ఆరోపించారు. ఈ బిల్లు దేశ వైవిధ్యం, ఫెడరల్ విధానానికి ముగింపు పలుకుతుందని హెచ్చరించారు. TMC ఎంపీ కళ్యాణ్ బెనర్జీ సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇది రాజ్యాంగ మౌలిక నిర్మాణానికి వ్యతిరేకం అన్నారు.
జమిలి ఎన్నికల బిల్లును వ్యతిరేకిస్తున్నామని కాంగ్రెస్ ఎంపీ మనీశ్ తివారీ లోక్‌సభలో అన్నారు. ఇది రాజ్యాంగ మౌలిక నిర్మాణానికి వ్యతిరేకమని పేర్కొన్నారు. లోక్‌సభ కాలవ్యవధికి, రాష్ట్రాల అసెంబ్లీల వ్యవధికి సంబంధం లేదన్నారు.
ప్రఖ్యాత పర్యావరణవేత్త, పద్మశ్రీ అవార్డు గ్రహీత తులసి గౌడ(86) కన్నుమూశారు. వృద్ధాప్య సంబంధిత వ్యాధులతో ఆమె చనిపోయారు. కర్నాటకలోని హొన్నాలికి చెందిన ఈమె ‘మదర్ ఆఫ్ ట్రీ’గా పేరు తెచ్చుకున్నారు. 60 ఏళ్లుగా తన జీవితాన్ని పర్యావరణ పరిరక్షణకు అంకితం చేస్తూ లక్షలాది మొక్కలను నాటారు. మొక్కల గురించి అసమానమైన పరిజ్ఞానం ఉండటంతో ఆమెను ‘ఎన్‌సైక్లోపీడియా ఆఫ్ ప్లాంట్స్’ అని పిలుస్తుంటారు.
నితిన్, శ్రీలీల కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ‘రాబిన్‌హుడ్’ మూవీ విడుదలను వాయిదా వేస్తున్నట్లు నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటన విడుదల చేసింది. త్వరలోనే కొత్త తేదీని ప్రకటిస్తామని పేర్కొంది. వాస్తవానికి ఈ నెల 25న రిలీజ్ కావాల్సి ఉంది. కాగా సంక్రాంతికి విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
TG: స్థానికత విషయంలో మెడికల్ పీజీ వైద్య విద్యార్థులకు హైకోర్టులో ఊరట లభించింది. తెలంగాణలో స్థానికత ఉండి ఇతర రాష్ట్రాల్లో ఎంబీబీఎస్, బీడీఎస్ చదివిన వారినీ స్థానికులుగా పరిగణించాలని ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. ఈ మేరకు జీవో 140ని నిలిపివేసింది. ఈ జీవో ప్రకారం 6-12వ తరగతితో పాటు ఎంబీబీఎస్ తెలంగాణలో పూర్తి చేసినవారినే స్థానికులుగా పరిగణిస్తారు.
Sorry, no posts matched your criteria.