India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జమిలి ఎన్నికల బిల్లును కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. 129వ రాజ్యాంగ సవరణ బిల్లును న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ సభలో ఇంట్రడ్యూస్ చేశారు. ప్రస్తుతం దీనిపై చర్చ జరుగుతోంది. బిల్లు కోసం బీజేపీ, కాంగ్రెస్ సహా చాలా పార్టీలు విప్ జారీ చేయడం తెలిసిందే.
కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కీలక ప్రకటన చేశారు. ఇకపై విద్యాసంస్థల్లో ప్రవేశాలకు మాత్రమే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పరీక్షలను నిర్వహిస్తుందని చెప్పారు. 2025 నుంచి ఎలాంటి రిక్రూట్‌మెంట్ పరీక్షలు నిర్వహించబోదని తెలిపారు. విద్యావ్యవస్థను సమర్థవంతంగా పనిచేసేలా తీసుకుంటున్న సంస్కరణల్లో ఇది భాగమని పేర్కొన్నారు. వచ్చే ఏడాది NTAను పునర్నిర్మిస్తామన్నారు.
ఎక్కడ ఖాళీ ప్రాంతముంటే అది తన రాజ్యమన్నట్టు పెరిగే ’పార్థినియం హిస్టెరోఫోరస్‘ మొక్కను మీరూ చూసే ఉంటారు. ఈ మొక్క మొదటగా 1956లో ఇండియాలో కనిపించింది. మెక్సికో నుంచి ఆహారధాన్యాలను పుణేకు దిగుమతి చేస్తుండగా ఇది విత్తనరూపంలో ఇండియాలోకి ప్రవేశించింది. గాలి వేగంతో దేశమంతా పాకి ప్రమాదకరంగా మారిపోయింది. ఈ మొక్క పర్యావరణానికి ముప్పు అని, శ్వాసకోశ సమస్యలు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
AP: నూజివీడులో గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణకు జోగి రమేశ్ దురుద్దేశంతో వచ్చి ఉండొచ్చని మంత్రి పార్థసారథి అన్నారు. ‘నన్ను ఆదరించిన TDP కార్యకర్తల మనోభావాలు దెబ్బతిన్నందుకు సారీ. ఇది పార్టీలకతీతంగా గౌడ సంఘం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమం. ఆ సమయంలో జోగి రమేశ్‌ను చూసి షాక్‌కు గురయ్యాను. ఆయనకు, నాకు వ్యక్తిగత సంబంధాలు లేవు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూసుకుంటా’ అని ప్రెస్‌మీట్‌లో పార్థసారథి చెప్పారు.
పార్లమెంటుకు ‘పాలస్తీనా’ బ్యాగు తీసుకెళ్లిన కాంగ్రెస్ MP ప్రియాంకా గాంధీని పాక్ మాజీ మంత్రి ఫవాద్ హుస్సేన్ ప్రశంసించారు. ‘ఫ్రీడమ్ ఫైటర్ నెహ్రూ ముని మనమరాలి నుంచి ఇంకేం ఆశించగలం? మరుగుజ్జుల మధ్య ఆమె మహోన్నతంగా నిలిచారు. పాక్ పార్లమెంటులో ఇప్పటి వరకు ఎవరూ ఆ ధైర్యం చేయకపోవడం సిగ్గుచేటు’ అని అన్నారు. బంగ్లా హిందువులపై జాలి చూపని ప్రియాంక ముస్లిములను మాత్రం బుజ్జగిస్తున్నారని ఇక్కడ విమర్శలు వచ్చాయి.
అడివి శేష్ హీరోగా షానియెల్ దేవ్ తెరకెక్కిస్తోన్న ‘డెకాయిట్’ సినిమాలో మృణాల్ ఠాకూర్ నటిస్తున్నట్లు తెలియజేస్తూ మేకర్స్ పోస్టర్స్ రిలీజ్ చేశారు. ‘అవును ప్రేమించావు. కానీ మోసం చేసావు. ఇడిచిపెట్టను.. తేల్చాల్సిందే’ అని అడివి శేష్ Xలో పేర్కొన్నారు. దీనికి ‘అవును వదిలేశాను. కానీ మనస్ఫూర్తిగా ప్రేమించాను’ అని మృణాల్ మరో పోస్టర్‌తో బదులిచ్చారు. కాగా, మొదట ఈ మూవీలో హీరోయిన్‌గా శ్రుతిహాసన్‌ను అనుకున్నారు.
ఆస్ట్రేలియాతో BGT సిరీస్‌లో రోహిత్ ప్రదర్శన పేలవంగా సాగుతోంది. తాజాగా మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 10 పరుగులకే ఔటయ్యాక ఆయన అసహనంగా కనిపించారు. గ్లౌవ్స్‌ను డగౌట్ వద్దే విడిచివెళ్లడం తన రిటైర్మెంట్ సంకేతాలను సూచిస్తున్నాయనే చర్చ జరుగుతోంది. ఈ సిరీస్ తర్వాత టెస్టులకూ రిటైర్మెంట్ ప్రకటిస్తారేమో? అంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. గత 14 ఇన్నింగ్సుల్లో హిట్ మ్యాన్ ఒకే అర్ధ సెంచరీ చేయడం గమనార్హం.
TG: తమ ప్రభుత్వం రూ.52 వేల కోట్ల అప్పు తీసుకుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. అదే సమయంలో రూ.66 వేల కోట్ల అప్పులను తిరిగి చెల్లించినట్లు తెలిపారు. ఖర్చు రూపాయితో సహా లెక్కగట్టి చెబుతామని స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన బీఆర్ఎస్ నేతలు నీతులు చెప్తున్నారని దుయ్యబట్టారు. మరోవైపు కాంగ్రెస్ ఏడాది పాలనలోనే రూ.1.27 లక్షల కోట్ల అప్పు చేసిందని హరీశ్ రావు ఆరోపించారు.
మగ తిమింగలం రికార్డు సృష్టించింది. దక్షిణ అమెరికా నుంచి ఆఫ్రికాకు 13,046 కిలోమీటర్లు (8,106 మైళ్లు) పైగా ఈదింది. దీంతో ఇప్పటివరకూ అత్యధిక దూరం ఈదిన తిమింగలంగా రికార్డులకెక్కింది. ఈ విషయాన్ని రాయల్ సొసైటీ ఓపెన్ సైన్స్‌లో ప్రచురించారు. సంతానోత్పత్తి కోసం ఆడ తిమింగలం కోసం వెతుకుతూ ఇంత దూరం ప్రయాణించింది. సహచరుల కోసం పోటీ కారణంగా సాధారణం కంటే డబుల్ డిస్టెన్స్ ప్రయాణించాల్సి వస్తోంది.
స్విగ్గీ, జొమాటో వంటి ఇ-కామర్స్ కంపెనీల ఫుడ్ డెలివరీ ఛార్జీలపై ట్యాక్స్ తగ్గించేందుకు GST కౌన్సిల్ యోచిస్తోందని సమాచారం. ప్రస్తుతమున్న 18 నుంచి 5 శాతానికి తగ్గించొచ్చని CNBC TV18 పేర్కొంది. ఫిట్‌మెంట్ కమిటీ సూచన మేరకు ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ లేకుండా 2022, JAN 1నుంచే వర్తించొచ్చని తెలుస్తోంది. రెస్టారెంట్ల సర్వీస్ ఛార్జీతో తమ డెలివరీ ఛార్జీలను సమం చేయాలని ఈ కంపెనీలు గతంలో కేంద్రాన్ని కోరాయి.
Sorry, no posts matched your criteria.