News June 4, 2024

జనసేన జెండా ఎగిరింది

image

ఏపీలో జనసేన బోణీ కొట్టింది. రెండు చోట్ల ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. తూర్పు గోదావరి జిల్లా రాజానగరం అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ 34,048 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. అటు భీమవరంలోనూ జనసేన జెండా ఎగిరింది.

News June 4, 2024

ఓటమి దిశగా తమిళిసై, అన్నామలై!

image

తమిళనాడులో చెన్నై సౌత్ బీజేపీ అభ్యర్థి తమిళిసై ఓటమి దిశగా సాగుతున్నారు. ఆమెపై డీఎంకే అభ్యర్థి 32,887 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. మరోవైపు కోయంబత్తూరులో ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్ అన్నామలై 20,479 ఓట్ల వెనుకంజలో ఉన్నారు. అక్కడ డీఎంకే అభ్యర్థి గణపతి రాజ్ కుమార్ లీడింగ్‌లో కొనసాగుతున్నారు.

News June 4, 2024

చరిత్ర సృష్టించిన నారా లోకేశ్

image

AP: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. టీడీపీ దశాబ్దాలుగా గెలవని మంగళగిరి సీటులో ఆ పార్టీ జెండాను ఎగరేసి చరిత్ర సృష్టించారు. ఇప్పటి వరకూ ఈ నియోజకవర్గంలో 15 సార్లు ఎన్నికలు జరిగితే టీడీపీ గెలిచింది రెండు సార్లే. 1985లో చివరిగా గెలిచింది. 2019లో ఓడినా నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని ఉండటం, సేవా కార్యక్రమాలు చేపట్టడం ఆయనపై ప్రజల్లో సానుకూలతను విపరీతంగా పెంచాయి.

News June 4, 2024

చంద్రబాబుకు మోదీ ఫోన్

image

టీడీపీ అధినేత చంద్రబాబుకు ప్రధాని మోదీ ఫోన్ చేశారు. ఏపీలో కూటమి విజయం పట్ల అభినందనలు తెలిపారు. మరోవైపు ఈ రాత్రికి అమరావతిలో చంద్రబాబు, పవన్ భేటీ కానున్నారు. కాగా జాతీయ స్థాయిలో ఎన్డీయే కూటమికి చంద్రబాబు సపోర్ట్ కీలకం కానుంది.

News June 4, 2024

గెలిచేటప్పుడు కాంగ్రెస్‌కు EVMలపై నోడౌట్స్!

image

ఓడినప్పుడే కాంగ్రెస్‌కు ఈవీఎంలపై అభ్యంతరాలు వస్తాయని బీజేపీ రాజస్థాన్ ప్రెసిడెంట్ సీపీ జోషీ విమర్శించారు. ‘కాంగ్రెస్ గెలుస్తున్నప్పుడు ఈవీఎంలపై అనుమానాలు రావు. అప్పుడు సైలెంట్‌గా ఉంటుంది. లోక్‌సభలో మాకు స్పష్టమైన మెజార్టీ వస్తుంది. మిత్ర పక్షాలతో కలిసి ఎన్డీయే కూటమి అధికారం చేపడుతుంది’ అని ఆయన అన్నారు. కాగా రాజస్థాన్‌లో 25 స్థానాల్లో పది చోట్ల కాంగ్రెస్ ఆధిక్యంలో కొనసాగుతోంది.

News June 4, 2024

తెలంగాణలో ఈస్ట్‌లో కాంగ్రెస్.. వెస్ట్‌లో BJP!

image

తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు ఈస్ట్ వర్సెస్ వెస్ట్ అన్నట్లుగా సాగుతున్నాయి. ఈస్ట్‌ తెలంగాణలోని మహబూబాబాబ్, వరంగల్, భువనగిరి, పెద్దపల్లి, నాగర్ కర్నూల్, నల్గొండతో పాటు వెస్ట్‌లో జహీరాబాద్‌లోనూ కాంగ్రెస్ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. ఖమ్మంలో ఇప్పటికే గెలిచింది. మరోవైపు మహబూబ్‌నగర్, చేవెళ్ల, మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ స్థానాల్లో BJP ముందంజలో ఉంది. HYD స్థానంలో MIM ఆధిక్యంలో ఉంది.

News June 4, 2024

ఉత్తరాంధ్రలో కూటమి MP అభ్యర్థులకు భారీ మెజార్టీ

image

ఉత్తరాంధ్ర ఎంపీ స్థానాలకు వెలువడుతున్న ఫలితాల్లో కూటమి అభ్యర్థులు సత్తా చాటుతున్నారు. శ్రీకాకుళం TDP MP అభ్యర్థి రామ్మోహన్‌నాయుడు (1,67,034), విజయనగరం TDP అభ్యర్థి అప్పలనాయుడు 77,947, విశాఖపట్నం TDP అభ్యర్థి భరత్ 1,49,553.. అనకాపల్లి BJP MP అభ్యర్థి C.M.రమేష్ 96,323 ఓట్ల మెజార్టీలో కొనసాగుతున్నారు. అరకులో మాత్రం YCP అభ్యర్థి తనూజా రాణి 28,922 ఓట్ల మెజార్టీలో ఉన్నారు.

News June 4, 2024

రోజా.. జబర్దస్త్ పిలుస్తోంది: బండ్ల

image

AP: మంత్రి రోజా నగరి నియోజకవర్గంలో ఓటమి దిశగా పయనిస్తుండటంతో నిర్మాత బండ్ల గణేశ్ సెటైరికల్ ట్వీట్ చేశారు. ‘జబర్దస్త్ పిలుస్తుంది రా కదలిరా’ అంటూ రోజా ఫొటోను పోస్ట్ చేశారు. రాజకీయంలో బద్ద శత్రువులుగా ఉన్న వీరు గతంలో పలు టీవీ చర్చల్లోనూ తీవ్ర వాగ్వాదానికి దిగిన విషయం తెలిసిందే.

News June 4, 2024

లక్షన్నర ఓట్ల ఆధిక్యంలో టీడీపీ ఫైర్‌బ్రాండ్ పెమ్మసాని

image

AP: ఈ ఎన్నికల్లో రాజకీయ అరంగేట్రం చేసిన టీడీపీ గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ రికార్డు మెజార్టీ దిశగా వెళ్తున్నారు. ఇప్పటివరకు ఆయనకు 3,44,736 ఓట్లు పోలవగా.. 1,58,185 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. తన పదునైన మాటలతో వైసీపీపై విరుచుకుపడ్డ ఈ ఎన్నారై.. ఎన్నికల ప్రచారంలో టీడీపీ ఫైర్ బ్రాండ్‌గా నిలిచారు. వైసీపీ అభ్యర్థి కిలారి రోశయ్యకు ఇప్పటివరకు 1,86,551 ఓట్లు పోలయ్యాయి.

News June 4, 2024

పురందీశ్వరికి 2 లక్షలు దాటిన మెజార్టీ

image

AP: ఎన్నికల్లో కూటమి రాజమండ్రి బీజేపీ అభ్యర్థి పురందీశ్వరికి ఇప్పటికే 2 లక్షల మెజార్టీ దాటింది. ప్రస్తుతం ఆమె 2,05,531 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక శ్రీకాకుళం, విశాఖ, అమలాపురం, విజయవాడ, గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థులు లక్ష పైన మెజార్టీలతో కొనసాగుతున్నారు.