News January 15, 2025

ఆకట్టుకుంటోన్న స్పెషల్ బాబాలు

image

మహా కుంభమేళాకు వచ్చిన స్పెషల్ బాబాలు ఆకట్టుకుంటున్నారు. అందులో ఐఐటియన్ బాబా, 14 ఏళ్లుగా ఒక చేయిని పైకి ఎత్తి అలాగే ఉంచేసిన రాధే పురీ బాబా, పురాతన కారులో వచ్చిన అంబాసిడర్ బాబా, తలపై వరి, మిల్లెట్ మొక్కలు పెంచే అనాజ్ వాలే బాబా, చాయ్ వాలే బాబా, 32 ఏళ్లుగా స్నానం ఆచరించని 3.8 ఫీట్ బాబా, తలపై 2 లక్షల రుద్రాక్షలు ధరించిన గీతానంద గిరి బాబా, తలపై పావురం కలిగి ఉన్న మహంత్ రాజ్‌పురీ జీ మహారాజ్ ఉన్నారు.

News January 15, 2025

నామినేషన్ వేసిన కేజ్రీవాల్

image

ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ నామినేషన్ వేశారు. తన భార్య, పార్టీ నేతలు, అభిమానులు వెంట రాగా ఆయన నామినేషన్ ఫైల్ చేశారు. త్వరలో జరగబోయే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్ న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. మూడుసార్లు సీఎంగా చేసిన ఆయన లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ కావడంతో ఇటీవలే పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

News January 15, 2025

తిరుమలలో రూ.300 టికెట్ల స్కామ్.. ఐదుగురు అరెస్ట్

image

AP: తిరుమల శ్రీవారి ప్రత్యేక దర్శన నకిలీ టికెట్లతో మోసాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ₹300 నకిలీ టికెట్లతో పలువురు దర్శనానికి వెళ్తుండగా క్యూకాంప్లెక్స్ వద్ద విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. ప్రత్యేక కౌంటర్ సిబ్బంది లక్ష్మీపతి విధుల్లో ఉన్నప్పుడు ట్యాక్సీ డ్రైవర్ల ద్వారా ఈ టికెట్లను అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఈ ముఠాలోని ఐదుగురిని అరెస్టు చేసి విచారిస్తున్నారు.

News January 15, 2025

క‌ర్ణాట‌క సీఎం: మార్చి త‌రువాత మార్పు?

image

CM సిద్ద రామ‌య్య త్వ‌ర‌లో త‌ప్పుకుంటార‌ని తెలుస్తోంది. మార్చిలో బ‌డ్జెట్ అనంత‌రం DK శివ‌కుమార్ CM ప‌గ్గాలు చేప‌డ‌తార‌ని ప్రచారం జరుగుతోంది. ప‌వ‌ర్ షేరింగ్ ఫార్ములా ప్ర‌కారం బాధ్య‌త‌ల బ‌దిలీ జ‌ర‌గ‌నుంద‌ని తెలిసింది. అందుకే సిద్ద రామ‌య్య ఎంపిక చేసిన మంత్రులు, MLAల‌తో ప్ర‌త్యేకంగా స‌మావేశ‌మ‌వుతున్నార‌ని స‌మాచారం. ఈ విష‌య‌మై పార్టీ నేత‌లు బ‌హిరంగంగా మాట్లాడ‌వ‌ద్ద‌ని అధిష్ఠానం ఇప్ప‌టికే ఆదేశించింది.

News January 15, 2025

ఆతిశీ జింకలా పరిగెడుతున్నారు.. మళ్లీ నోరు జారిన బిధూరీ

image

ఢిల్లీ CM ఆతిశీ తన తండ్రినే మార్చేశారంటూ <<15102620>>వివాదాస్పద వ్యాఖ్యలు<<>> చేసిన రమేశ్ బిధూరీ మరోసారి నోరు జారారు. ఆమె ఓట్ల కోసం ఢిల్లీ రోడ్లపై జింకలా పరిగెడుతున్నారని కామెంట్ చేశారు. నాలుగేళ్లలో ఆమె ఎప్పుడూ నగర సమస్యలను పట్టించుకోలేదన్నారు. తాను ఎమ్మెల్యేగా గెలిస్తే నియోజకవర్గ రోడ్లను ప్రియాంకా గాంధీ బుగ్గల్లా మారుస్తానని రమేశ్ చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపిన విషయం తెలిసిందే.

News January 15, 2025

Stock Market: ఈ రోజు కూడా గ్రీన్‌లోనే

image

అధిక వెయిటేజీ షేర్ల‌కు కొనుగోళ్ల మ‌ద్ద‌తు ల‌భించ‌డంతో దేశీ స్టాక్ మార్కెట్లు బుధ‌వారం కూడా గ్రీన్‌లోనే ముగిశాయి. Sensex 224 పాయింట్ల లాభంతో 76,724 వ‌ద్ద Nifty 37 PTS ఎగ‌సి 23,213 వ‌ద్ద స్థిర‌ప‌డ్డాయి. IT, రియ‌ల్టీ షేర్లు రాణించాయి. NTPC, TRENT, Power Grid, Kotak Bank, Maruti టాప్ గెయిన‌ర్స్‌. M&M, Axis Bank, Bajaj Finserv టాప్ లూజ‌ర్స్‌. Sensex 76,700 పరిధిలో, Nifty 23,300 వద్ద రెసిస్టెన్స్ ఉంది.

News January 15, 2025

సిద్ద రామ‌య్య‌కు షాక్‌.. ముడా స్కాంలో విచార‌ణ కొన‌సాగింపు

image

ముడా స్కాం కేసులో CM సిద్ద రామ‌య్య‌పై మైసూరు లోకాయుక్త పోలీసులు విచార‌ణ కొన‌సాగించ‌వ‌చ్చ‌ని క‌ర్ణాట‌క హైకోర్టు ఆదేశాలిచ్చింది. గ‌తంలో ఈ కేసు విచార‌ణ‌పై ఇచ్చిన మ‌ధ్యంత‌ర స్టేను తాజాగా ఎత్తేసింది. Jan 27లోపు విచార‌ణ నివేదిక‌ను స‌మ‌ర్పించాల‌ని జ‌స్టిస్ ఎం.నాగ‌ప్ర‌సన్న ఆదేశించారు. అంత‌కంటే ముందు ఈ కేసుకు సంబంధించి గత ఏడాది Dec 19 నుంచి సేకరించిన అన్ని ఫైల్స్‌ను గురువారంలోపు అంద‌జేయాల‌ని ఆదేశించారు.

News January 15, 2025

మందుబాబులకు GOOD NEWS

image

AP: సంక్రాంతి వేళ మందుబాబులకు లిక్కర్ కంపెనీలు శుభవార్త చెప్పాయి. ఇప్పటికే 10 బ్రాండ్ల ధరలు తగ్గించగా, మరిన్ని బ్రాండ్ల రేట్లను తగ్గించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. మాన్షన్ హౌస్ క్వార్టర్‌పై రూ.30, అరిస్టోక్రాట్ ప్రీమియం సుపీరియర్ విస్కీ రూ.50, కింగ్‌ఫిషర్ బీర్ రూ.10, బ్యాగ్‌పైపర్ గోల్డ్ రిజర్వ్ విస్కీపై రూ.80 తగ్గించాయి. కొత్త ధరలతోనే షాపులకు మద్యం సరఫరా చేస్తున్నాయి.

News January 15, 2025

430 విజయాలు.. చరిత్ర సృష్టించిన జకోవిచ్

image

ఆస్ట్రేలియా ఓపెన్ మూడో రౌండ్‌కు చేరుకున్న సెర్బియా ఆటగాడు నొవాక్ జకోవిచ్ చరిత్ర సృష్టించారు. ప్రొఫెషనల్ టెన్నిస్‌లో అత్యధిక మ్యాచ్‌లు(430) గెలిచిన ప్లేయర్‌గా ఘనత సాధించారు. గతంలో ఫెదరర్(429) పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేశారు. జకోవిచ్ ఇప్పటికే అత్యధిక గ్రాండ్‌స్లామ్(24)లను గెలిచిన ప్లేయర్‌గానూ కొనసాగుతున్నారు. ఇందులో 10 ఆస్ట్రేలియా ఓపెన్, 7 వింబుల్డన్, 4 యూఎస్ ఓపెన్, 3 ఫ్రెంచ్ ఓపెన్‌లు ఉన్నాయి.

News January 15, 2025

పూజా ఖేడ్కర్‌కు సుప్రీంకోర్టులో ఊరట

image

తప్పుడు పత్రాలతో ఐఏఎస్‌కు ఎంపికయ్యారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న పూజా ఖేడ్కర్‌కు సుప్రీంకోర్టు ఊరట కలిగించింది. వచ్చే నెల 14 వరకు ఆమెను అరెస్ట్ చేయొద్దని పోలీసులను ఆదేశించింది. ఢిల్లీ ప్రభుత్వం, యూపీఎస్సీకి నోటీసులు జారీ చేసింది. తనను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ ఆమె దాఖలు చేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు <<14959397>>కొట్టేయడంతో<<>> సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.