News June 4, 2024

ఎగ్జిట్ పోల్స్ అంచనాలను పటాపంచలు చేసిన TMC

image

పశ్చిమ బెంగాల్‌లో అధికార టీఎంసీ దుమ్మురేపుతోంది. అక్కడ 42 ఎంపీ స్థానాలుండగా 31 చోట్ల ఆ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతోంది. టీఎంసీ తక్కువ స్థానాలే గెలుచుకుంటుందని ఎగ్జిట్ పోల్స్ ఇచ్చిన అంచనాలను పటాపంచలు చేసింది. దీంతో పార్టీ శ్రేణులు సీఎం మమతా బెనర్జీ ఇంటి వద్ద సంబరాలు మొదలుపెట్టాయి. ఇక బీజేపీ 10 చోట్ల లీడింగ్‌లో ఉండగా కాంగ్రెస్ ఒక స్థానానికి పరిమితమైంది.

News June 4, 2024

ఖమ్మంలో కాంగ్రెస్ భారీ విజయం

image

ఖమ్మం పార్లమెంట్ స్థానాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. రామసహాయం రఘురామ్ రెడ్డి 3,70,921 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఆయన కౌంటింగ్ మొదటి రౌండ్ నుంచి ఆధిపత్యం చాటుతూ వచ్చారు. ఇక్కడ బీఆర్ఎస్ నుంచి నామా నాగేశ్వరరావు, బీజేపీ నుంచి తాండ్ర వినోద్ రావు పోటీ చేశారు.

News June 4, 2024

BIG BREAKING: కాసేపట్లో సీఎం జగన్ రాజీనామా

image

AP: అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి దిశగా వైసీపీ సాగుతోంది. దీంతో సీఎం జగన్ కాసేపట్లో తన పదవికి రాజీనామా చేయనున్నారు. గవర్నర్ జస్టిస్ నజీర్‌కు తన రాజీనామా లేఖను పంపనున్నారు.

News June 4, 2024

గెలుపు ఆకలితో సోమిరెడ్డి.. ఇరవై ఏళ్ల నిరీక్షణ ఫలిస్తుందా?

image

నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో TDP అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి లీడింగ్‌లో ఉన్నారు. మంత్రి కాకాణి గోవర్ధన్‌పై 4,313 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కాగా ఇక్కడ గత 20 ఏళ్లుగా టీడీపీ గెలవడం లేదు. ఆ పార్టీ నుంచి గత నాలుగు ఎన్నికల్లో వరుసగా పోటీ చేసిన సోమిరెడ్డి ఓడిపోతూ వస్తున్నారు. కూటమి హవా రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న వేళ ఈసారి సర్వేపల్లిలోనూ TDP జెండా ఎగురుతుందేమో చూడాలి.

News June 4, 2024

ఒడిశాలో నవీన్ పట్నాయక్‌కు షాక్!

image

ఒడిశాలో నవీన్ పట్నాయక్‌కు బీజేపీ షాక్ ఇచ్చేలా కనిపిస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న కౌంటింగ్‌లో కాషాయ పార్టీ 74 స్థానాల్లో లీడింగ్‌లో కొనసాగుతోంది. మరోవైపు బీజేడీ 57, కాంగ్రెస్ 13, స్వతంత్రులు 2, సీపీఐ ఒక చోట ముందంజలో ఉన్నాయి. దీంతో కొద్ది తేడాలో అధికారం మారే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

News June 4, 2024

Bihar: నితీశ్‌ను లాగేయడం కలిసొచ్చింది!

image

రాజకీయ రణరంగంలో ఎత్తుకు పైఎత్తులు వేయడం ఎంత ముఖ్యమో మళ్లీ నిరూపణ అయింది. బిహార్‌లో నితీశ్‌ను తమవైపు తిప్పుకోవడం బీజేపీకి చాలా కలిసొచ్చింది. లేదంటే యూపీ తరహాలో ఇక్కడా దెబ్బపడేది. ఈ రాష్ట్రంలో కులాలకు చాలా ప్రాధాన్యం ఉంది. ఈసీ వెబ్‌సైట్ ప్రకారం మొత్తం 40 సీట్లలో ఎన్డీయే పార్టీలైన జేడీయూ 15, బీజేపీ 13, ఎల్‌జేపీ 5 చోట్ల ఆధిక్యంలో ఉన్నాయి. ఇండియా కూటమి 6 స్థానాల్లో పోటీలో ఉంది.

News June 4, 2024

‘ప్లాన్ బీ’ అమ‌లు చేస్తున్న కాంగ్రెస్‌

image

ప్ర‌భుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్ పార్టీ త‌న ప్లాన్ బీ అమ‌ల్లో పెట్టేసింది. మ్యాజిక్ ఫిగ‌ర్‌కు అతి స‌మీపంలో ఉన్న ఇండియా కూట‌మి వైపు మ‌రిన్ని ప్రాంతీయ పార్టీల‌ను ఆహ్వానించాల‌న్న ల‌క్ష్యంగా పావులు క‌దుపుతోంది. ఇందులో భాగంగా బిహార్‌లో సీఎం నితీశ్ కుమార్‌ను కాంగ్రెస్ నేత‌లు క‌లుస్తుండ‌డం ప్రాధాన్య‌ం సంత‌రించుకుంది. అలాగే టీడీపీ అధినేత చంద్ర‌బాబుతో కూడా కాంగ్రెస్ మంత‌నాలు ప్రారంభించింది!

News June 4, 2024

BIG BREAKING: ఏపీలో బీజేపీ తొలి విజయం

image

ఏపీలో బీజేపీ బోణీ కొట్టింది. అనపర్తిలో బీజేపీ MLA అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి విజయం సాధించారు. టీడీపీ నేతగా ఉన్న నల్లమిల్లికి ఆ పార్టీ టికెట్ ఇవ్వలేదు. దీంతో ఆయన కాషాయ పార్టీ నుంచి పోటీ చేసి గెలిచారు. ఏపీలో ప్రస్తుతం బీజేపీ 6 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.

News June 4, 2024

సిట్టింగ్ ఎంపీలు.. ఓడుతున్నారా? గెలుస్తున్నారా?

image

తెలంగాణలో పలువురు సిట్టింగ్ ఎంపీలు ఈ ఎన్నికల్లోనూ బరిలో ఉన్నారు. మహబూబాబాద్ నుంచి BRS అభ్యర్థి మాలోత్ కవిత, చేవెళ్లలో కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డి(గతంలో BRS), మహబూబ్‌నగర్‌లో మన్నె శ్రీనివాస్‌రెడ్డి(BRS) వెనుకంజలో ఉన్నారు. బీజేపీ సిట్టింగ్ ఎంపీలు సికింద్రాబాద్‌లో కిషన్‌రెడ్డి, నిజామాబాద్‌లో అర్వింద్, కరీంనగర్‌లో బండి సంజయ్ ఆధిక్యంలో దూసుకెళుతున్నారు.

News June 4, 2024

చంద్ర‌బాబుతో భేటీ కానున్న కేసీ వేణుగోపాల్‌?

image

టీడీపీ అధినేత చంద్ర‌బాబుతో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ భేటీ కానున్నట్టు సమాచారం. ఎన్డీయేను 300 సీట్లు దాట‌నివ్వ‌కుండా శాయ‌శ‌క్తులా కృషి చేస్తున్న ఇండియా కూట‌మి త‌దుప‌రి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవ‌స‌ర‌మైన బ‌లాన్ని సంపాదించే ప‌నిలో ప‌డింది. అందులో భాగంగానే చంద్ర‌బాబును వేణుగోపాల్ క‌ల‌వ‌నున్న‌ట్టు తెలిసింది. ఇప్పుడు ఈ భేటీకి దేశ‌వ్యాప్తంగా రాజ‌కీయ ప్రాధాన్య‌త ఏర్ప‌డింది.