News September 30, 2024

భారత్ WTC ఫైనల్‌కు వెళ్లాలంటే..

image

టీమ్ ఇండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్‌కు వెళ్లేందుకు అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. ప్రస్తుతం బంగ్లాతో జరుగుతోన్న రెండో టెస్టు డ్రా అయితే మిగతా 8 మ్యాచుల్లో ఐదింట్లో గెలవాల్సి ఉంటుంది. భారత్ న్యూజిలాండ్‌తో 3, ఆస్ట్రేలియాతో 5 టెస్టులు ఆడాల్సి ఉంది. ఇందులో 5 గెలిచి, ఒక మ్యాచ్ డ్రా అయితే మిగతా టీంలపై ఆధారపడకుండా టీమ్ ఇండియా నేరుగా FINALకు వెళ్తుంది.

News September 30, 2024

Momentum Stocks: ఆ స్టాక్స్‌కి రెక్క‌లొచ్చాయ్‌

image

బాస్మ‌తీయేత‌ర బియ్యం ఎగుమ‌తుల‌పై ఉన్న‌ నిషేధం ఎత్తివేత‌తో ఆ రంగ షేర్లు భారీగా లాభ‌ప‌డ్డాయి. KRBL, LT Foods, Chaman Lal Setia, Kohinoor Foods, GRM Overseas షేర్ల కోసం ఇన్వెస్ట‌ర్లు ఎగ‌బ‌డ్డారు. విదేశాల్లో బియ్యం డిమాండ్ వ‌ల్ల దేశీయంగా ఇబ్బందులు లేకుండా గతంలో ఎగుమ‌తుల‌పై కేంద్రం నిషేధం విధించింది. తాజాగా అనుమతించడం స‌హా Parboiled riceపై సుంకాన్ని 10% త‌గ్గించ‌డంతో ఈ స్టాక్స్‌లో మొమెంట‌మ్ ఏర్ప‌డింది.

News September 30, 2024

నటుడి ఫొటోతో రూ.500 ఫేక్ కరెన్సీ నోట్లు

image

బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ఫొటోతో కేటుగాళ్లు నకిలీ రూ.500 నోట్లను ప్రింట్ చేశారు. దానిపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బదులు ‘రిసోల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ అని ముద్రించారు. నిందితులు ఈ ఫేక్ నోట్లతో 2,100 గ్రా. బంగారాన్ని కొనుగోలు చేసేందుకు ప్రయత్నించగా విషయం బయటకు వచ్చింది. నలుగురిని అరెస్టు చేసి, రూ.1.60 కోట్ల విలువైన నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నట్లు అహ్మదాబాద్ పోలీసులు వెల్లడించారు.

News September 30, 2024

వారసత్వ రాజకీయాలు.. BJP vs DMK

image

వారసత్వ రాజకీయాలపై BJP, తమిళనాడులోని DMK మధ్య సోషల్ మీడియాలో వార్ జరుగుతోంది. కరుణానిధి, ఆయన కుమారుడు స్టాలిన్ సీఎంలుగా పని చేయగా, తాజాగా స్టాలిన్ కుమారుడు ఉదయనిధి డిప్యూటీ సీఎం అయ్యారు. ఉదయనిధి తర్వాత ఆయన వారసుడు ఇన్బనితి సీఎం అవుతారని బీజేపీ శ్రేణులు విమర్శిస్తున్నాయి. అయితే కేంద్రమంత్రి అమిత్ షా కుమారుడు జైషా ఏ అర్హతతో బీసీసీఐ సెక్రటరీ అయ్యారని డీఎంకే శ్రేణులు కౌంటరిస్తున్నాయి.

News September 30, 2024

కాంగ్రెస్ ఎంపీ అనిల్‌కు లీగల్ నోటీసు పంపుతున్నా: హరీశ్‌రావు

image

TG: హిమాయత్ సాగర్ FTL భూముల్లో అక్రమంగా నిర్మించిన ఆనంద కన్వెన్షన్‌లో వాటా ఉందని తనపై ఆరోపణలు చేసిన కాంగ్రెస్ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్‌పై హరీశ్ రావు మండిపడ్డారు. ‘ప్రజా సమస్యలపై పోరాడుతున్న నాపై బురద చల్లే వికృత రాజకీయాలకు కాంగ్రెస్ ప్రభుత్వం తెరలేపింది. అబద్ధపు ప్రచారం చేస్తున్న అనిల్‌కు లీగల్ నోటీసు పంపుతున్నా. క్షమాపణ చెప్పకపోతే పరువు నష్టం దావా ఎదుర్కోవాలని హెచ్చరిస్తున్నా’ అని ట్వీట్ చేశారు.

News September 30, 2024

మిథున్ చక్రవర్తికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు

image

బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తిని దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వరించింది. OCT 8న జరిగే నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ కార్యక్రమంలో ఆయన ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు. కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ ఈ విషయాన్ని Xలో వెల్లడించారు. 1950లో కోల్‌కతాలో జన్మించిన మిథున్.. 1976లో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 1989లో ఏకంగా 19 సినిమాలు రిలీజ్ చేసి రికార్డు సృష్టించారు.

News September 30, 2024

Stock Market: నష్టాల్లో నడుస్తున్నాయ్

image

అధిక వెయిటేజీ రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్, TCS, ICICI గ్యాప్ డౌన్‌తో ఓపెన్ అవ్వ‌డంతో సెన్సెక్స్, నిఫ్టీ న‌ష్టాల్లో న‌డుస్తున్నాయి. సెన్సెక్స్ ప్ర‌స్తుతం 500 పాయింట్ల న‌ష్ట‌ంతో 85,060 వ‌ద్ద‌, నిఫ్టీ 150 పాయింట్ల న‌ష్టంతో 26,030 వ‌ద్ద ట్రేడ్ అవుతున్నాయి. ఇటీవ‌ల చైనా Central Bank వ‌డ్డీ రేట్ల కోత‌తో FIIల మనీ ఫ్లో ఆ దేశ మార్కెట్లలో అధికంగా ఉండడం కూడా మన మార్కెట్ల నష్టాలకు కారణంగా తెలుస్తోంది.

News September 30, 2024

రోడ్లు వేయడానికి నిధులు లేవా రేవంత్: KTR

image

TG: రోడ్లు వేయడానికి కూడా ప్రభుత్వం దగ్గర నిధులు లేవా? అని కేటీఆర్ ప్రశ్నించారు. ‘మాజీ సర్పంచుల సంగతి సరే. చివరకు పంచాయతీ కార్యదర్శులు కూడా అప్పులపాలు అవుతున్నారు. దేశానికి పట్టుకొమ్మలైన గ్రామాలను అభివృద్ధి చేయాలని కేసీఆర్ తెచ్చిన పల్లె ప్రగతి కార్యక్రమాన్ని అటకెక్కించారు. ఆసరా పెన్షన్‌తో దాతలుగా సహాయం చేస్తే తప్ప రోడ్లు వేయలేని పరిస్థితి. కొంచెం కూడా సిగ్గు అనిపించట్లేదా’ అని ట్వీట్ చేశారు.

News September 30, 2024

బుక్‌మై షో సీఈవోకు మళ్లీ సమన్లు

image

టికెట్ల బ్లాక్ మార్కెటింగ్ ఆరోపణల నేపథ్యంలో బుక్‌మై షో సీఈవో ఆశిష్ హేమ్‌రజనీకి ముంబై పోలీసులు మరోసారి సమన్లు ఇచ్చారు. రాక్ బ్యాండ్ కోల్డ్‌ప్లే టికెట్ల విక్రయాల్లో అక్రమాలపై ఇవాళ తమ ముందు విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. ఈ నెల 27న నోటీసులు ఇవ్వగా ఆయన స్పందించలేదు. సంస్థ టెక్నికల్ హెడ్‌కూ నిన్న నోటీసులు ఇచ్చారు. కాగా టికెట్లు విక్రయించినవారితో తమకు సంబంధం లేదని కంపెనీ ఇటీవల ప్రకటించింది.

News September 30, 2024

GOOD NEWS: వారికి రేపు ఒకేసారి రెండు నెలల పెన్షన్

image

AP: ఈ నెల మొదటి వారంలో భారీ వర్షాలు, వరదల కారణంగా గుంటూరు, కృష్ణా, NTR జిల్లాల్లో 2,658 మందికి పెన్షన్లు అందలేదు. వారికి రేపు 2 నెలల పెన్షన్ ఒకేసారి పంపిణీ చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. మరోవైపు CM చంద్రబాబు రేపు కర్నూలు(D) పత్తికొండలో పర్యటించనున్నారు. పుచ్చకాయలమడలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. స్వయంగా పలువురికి పింఛన్లు అందించి లబ్ధిదారులతో మాట్లాడనున్నారు.