News June 4, 2024

దశాబ్దాల నిరీక్షణ.. మంగళగిరిలో టీడీపీ జెండా రెపరెపలు!

image

AP: గుంటూరు(D) మంగళగిరిలో TDP అభ్యర్థి నారా లోకేశ్ రికార్డు సృష్టించనున్నారు. ఎన్నికల కౌంటింగ్‌లో 15 వేలకు పైగా మెజార్టీలో కొనసాగుతూ గెలుపు దిశగా దూసుకెళ్తున్నారు. దశాబ్దాలుగా ఇక్కడ టీడీపీ జెండా ఎగురలేదు. 15 సార్లు ఎన్నికలు జరిగితే ఇక్కడ టీడీపీ గెలిచింది రెండు సార్లే. చివరిసారిగా 1985లో ఇక్కడ గెలిచింది. నారా లోకేశ్ గెలుపుతో టీడీపీకి కొరకరాని కొయ్యగా ఉన్న ఈ నియోజకవర్గం ఆ పార్టీ ఖాతాలో చేరనుంది.

News June 4, 2024

పెనమలూరులో వైసీపీ అభ్యర్థి జోగి రమేశ్ ముందంజ

image

AP: పెనమలూరులో మంత్రి జోగి రమేశ్ లీడింగ్‌లో ఉన్నారు. తన ప్రత్యర్థి బోడె ప్రసాద్‌పై 275 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇటు గుంటూరు జిల్లా ప్రత్తిపాడు(SC)లో టీడీపీ అభ్యర్థి బూర్ల రామంజనేయులు 2,758 ఓట్ల లీడింగ్‌లో ఉన్నారు.

News June 4, 2024

ధర్మాన సోదరుల వెనుకంజ

image

AP: SKLM జిల్లాలో ధర్మాన సోదరులకు షాక్ తగిలింది. SKLM అసెంబ్లీ అభ్యర్థిగా YCP తరఫున బరిలో దిగిన మంత్రి ధర్మాన ప్రసాదరావుపై.. TDP అభ్యర్థి గొండు శంకర్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. నరసన్నపేట నుంచి బరిలో దిగిన YCP అభ్యర్థి ధర్మాన కృష్ణదాస్‌పై TDP అభ్యర్థి బగ్గు రమణమూర్తి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. జిల్లాలో కూటమి అభ్యర్థుల జోరు కొనసాగుతోంది. మెజార్టీ స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

News June 4, 2024

53వేల ఓట్ల ఆధిక్యంలో నల్గొండ కాంగ్రెస్ అభ్యర్థి

image

నల్గొండలో కాంగ్రెస్ దూసుకెళ్తోంది. ఆ పార్టీ అభ్యర్థి రఘువీర్ రెడ్డి 53వేల ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక్కడ కాంగ్రెస్ వరుసగా మూడు సార్లు గెలుపొందింది.

News June 4, 2024

తాడిపత్రిలో టీడీపీ 99 ఓట్ల లీడింగ్

image

AP: అనంతపురం జిల్లా తాడిపత్రిలో టీడీపీ అభ్యర్థి జేసీ అస్మిత్ రెడ్డి 99 ఓట్ల లీడింగులో కొనసాగుతున్నారు. వైసీపీ అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి వెనుకంజలో ఉన్నారు. కళ్యాణదుర్గంలో టీడీపీ నేత అమిలినేని సురేంద్రబాబు 3,030 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. అక్కడ ఎంపీ తలారి రంగయ్య వెనుకబడ్డారు. జమ్మలమడుగులో 312 ఓట్ల లీడింగులో వైసీపీ నేత సుధీర్ రెడ్డి ఉన్నారు.

News June 4, 2024

జమ్మూకశ్మీర్‌లో నువ్వా-నేనా!

image

మొత్తం 5 స్థానాలున్న జమ్మూకశ్మీర్‌లో టఫ్ ఫైట్ నడుస్తోంది. బీజేపీ, ఇండియా కూటమి చెరో 2 స్థానాల్లో లీడింగ్‌లో ఉన్నాయి. ఇతరులు ఒక్క ప్లేస్‌లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. లఢక్‌లోని ఏకైక స్థానంలో ఇతరులు ముందంజలో ఉన్నారు.

News June 4, 2024

30 వేల ఓట్ల ఆధిక్యంలో రాహుల్ గాంధీ

image

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేరళలోని వయనాడ్, యూపీలోని రాయ్‌బరేలీ స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. వయనాడ్‌లో ప్రస్తుతం 30వేల ఓట్ల లీడింగ్‌లో ఉన్నారు. 2019లో ఆయన ఇక్కడ 5లక్షలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందిన సంగతి తెలిసిందే.

News June 4, 2024

యర్రగొండపాలెంలో టీడీపీ ముందంజ

image

AP: యర్రగొండపాలెం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గూడూరి ఎరిక్షన్ బాబు ముందంజలో ఉన్నారు. వైసీపీ అభ్యర్థి తాటిపర్తి చంద్రశేఖర్ వెనుకంజలో ఉన్నారు. పర్చూరులో ఏలూరి సాంబశివరావు లీడింగ్‌లో కొనసాగుతున్నారు. వైసీపీ అభ్యర్థి యడం బాలాజీ వెనుకంజలో ఉన్నారు.

News June 4, 2024

ఆధిక్యంలోకి వచ్చిన మోదీ

image

యూపీ వారణాసిలో బీజేపీ అభ్యర్థి నరేంద్ర మోదీ ఆధిక్యంలోకి వచ్చారు. తొలుత 6వేలకు పైగా ఓట్లతో వెనుకబడ్డ మోదీ.. ఇప్పుడు ఆధిక్యంలోకి వచ్చారు. అక్కడ కాంగ్రెస్ నుంచి అజయ్ పోటీ చేస్తున్నారు.

News June 4, 2024

కడప అసెంబ్లీ: టీడీపీకి 10వేల ఓట్ల లీడింగ్

image

కడప అసెంబ్లీలో 10వేల ఓట్ల మెజార్టీలో టీడీపీ అభ్యర్థి మాధవీరెడ్డి కొనసాగుతున్నారు. డిప్యూటీ సీఎం అంజాద్ బాషా ఓటమి దిశగా సాగుతున్నారు. ప్రొద్దుటూరు, రాయచోటిలో టీడీపీ అభ్యర్థులు వరదరాజులరెడ్డి, రాంప్రసాద్ రెడ్డి లీడింగులోకి వచ్చారు.