India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తక్కువ వ్యవధిలోనే 18 ఉమెన్ మిస్సింగ్ కేసులను ఛేదించినట్లు విజయవాడ పోలీసులు ట్వీట్ చేయగా DyCM పవన్ స్పందించారు. ‘YCP పాలనలో 30,000+ మహిళలు & బాలికలు తప్పిపోయారు. వారు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. కానీ ఇప్పుడు మార్పు వచ్చింది. APలో పటిష్టమైన లా అండ్ ఆర్డర్ ఉండటంతో ఈరోజు విజయవాడ పోలీసులు ఈ కేసులను ఛేదించినందుకు నేను గర్వపడుతున్నా. సీఎం చంద్రబాబు, హోంమంత్రి అనిత, పోలీసులకు ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు.
ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న AP, TGలోని ఉద్యోగుల అంతర్రాష్ట్ర బదిలీలపై మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. AP నుంచి 1,942, TG నుంచి 1,447 మంది బదిలీకి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. దీనిపై TG ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పారు. సమస్యల పరిష్కారానికి ఏర్పాటుచేసిన కమిటీలో AP నుంచి మంత్రులు అనగాని, దుర్గేశ్, జనార్దన్, TG నుంచి భట్టి, శ్రీధర్, పొన్నం ఉన్నారన్నారు.
G20 సమ్మిట్ సందర్భంగా ఇటలీ ప్రధాని జార్జియా మెలోనితో ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. వీరి సమావేశంపై నెటిజన్లు క్రియేటివ్‌గా స్పందిస్తున్నారు. ఇద్దరు PMల పేర్లు కలిపి ‘మెలోడీ మీటింగ్’ అంటూ కామెంట్ చేస్తున్నారు. డిఫెన్స్, వాణిజ్యం, సాంకేతిక రంగాల్లో ఇరు దేశాల బంధాన్ని బలోపేతం చేసుకోవడంపై చర్చించినట్టు మోదీ తెలిపారు. ఇరు దేశాల మైత్రి ప్రపంచ సుస్థిరతకు మేలు చేస్తుందన్నారు.
పండగల వేళ రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు ఎలా కిటకిటలాడతాయో ఓసారి గుర్తు చేసుకోండి! NOV 17న దేశవ్యాప్తంగా విమానాశ్రయాల పరిస్థితి ఇదేనంటే ఆశ్చర్యమేమీ లేదు. ఆరోజు ఏకంగా 5.05లక్షల మంది ప్రయాణించారు. దీంతో ఎయిర్‌పోర్టు లాంజుల్లో చోటు సరిపోక చాలామంది కిందే కూర్చున్నారు. ఇక టికెట్ కౌంటర్లు, ₹400 ఖరీదైన దోసెల క్యూలైన్ ఆగిందే లేదని కొందరు సెటైర్లు వేస్తున్నారు. ఫెస్టివ్, వెడ్డింగ్ సీజన్ కావడమే దీనికి కారణం.
TG: వికారాబాద్ జిల్లా లగచర్ల వ్యవహారం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము వద్దకు చేరింది. ఆమె అపాయింట్‌మెంట్ కోసం లగచర్ల ఫార్మా బాధిత కుటుంబాలు ఢిల్లీలో వెయిట్ చేస్తున్నాయి. ఇప్పటికే ఇక్కడి భూసేకరణకు సంబంధించిన అంశాలను బీఆర్ఎస్ నేతలు రాష్ట్రపతి కార్యాలయం దృష్టికి తీసుకెళ్లారు. అక్రమ అరెస్టులపై ఎస్సీ, ఎస్టీ, మహిళా, జాతీయ మానవహక్కుల కమిషన్‌లను కలిసి బాధితులు ఫిర్యాదు చేశారు.
మలయాళ థ్రిల్లర్ మూవీ ‘కిష్కింధ కాండం’ ఓటీటీలోకి వచ్చేసింది. అర్ధరాత్రి నుంచి డిస్నీ+హాట్‌స్టార్‌లో తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీలో అసిఫ్ అలీ, అపర్ణ బాలమురళి, విజయ రాఘవన్ ప్రధాన పాత్రల్లో నటించారు. కేవలం రూ.7 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా దాదాపు రూ.70 కోట్లు వసూలు చేసింది. ఈ ఏడాది మలయాళంలో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్-10 చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.
వరంగల్ బయల్దేరిన CM రేవంత్ ‘X’లో పోస్ట్ చేశారు. ‘తెలంగాణ చైతన్య రాజధాని, కాళోజీ నుంచి పీవీ వరకు మహనీయులను తీర్చిదిద్దిన నేల. స్వరాష్ట్ర సిద్ధాంతకర్త జయశంకర్ సార్‌కు జన్మనిచ్చిన గడ్డ. హక్కుల కోసం పోరాడిన సమ్మక్క, సారలమ్మలు నడయాడిన ప్రాంతం. దోపిడీకి వ్యతిరేకంగా పిడికిలి బిగించిన చాకలి ఐలమ్మ యుద్ధ క్షేత్రం వరంగల్. వీరి స్ఫూర్తితో మన భవిత కోసం వరంగల్ దశ,దిశ మార్చేందుకు వస్తున్నా’ అని పేర్కొన్నారు.
వాట్సాప్ గ్రూపుల ద్వారా ఆన్‌లైన్ స్టాక్ ట్రేడింగ్ స్కామ్‌లకు పాల్పడ్డ చైనా పౌరుడు ఫాంగ్ చెంజిన్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. రూ.43.5 లక్షల మోసం కేసులో దర్యాప్తు ఆరంభించిన పోలీసులు అతడి స్కామ్‌ల విలువ రూ.100 కోట్లు దాటేసినట్టు కనుగొన్నారు. ముఖ్యంగా AP, UPల్లో సైబర్ క్రైమ్స్, మనీలాండరింగ్‌కు పాల్పడినట్టు గుర్తించారు. CCPలో అతడిపై నమోదైన 17 కేసులు ఫిన్‌కేర్ బ్యాంక్ A/Cకు లింకైనట్టు తెలిపారు.
మెరుగైన అవకాశాలు, సౌకర్యాల కోసం ఏటా చాలా మంది భారతీయులు పౌరసత్వాన్ని వదులుకొని ఇతర దేశాలకు పయనమవుతున్నారు. అయితే, వారు వెళ్లిపోవడానికి కొన్ని ముఖ్య కారణాలున్నాయి. అవేంటంటే.. స్వచ్ఛమైన గాలి & నీరు, నాణ్యమైన ప్రభుత్వ విద్య, మెరుగైన మౌలిక సదుపాయాలు, హైక్లాస్ ప్రజా రవాణా అని నిపుణులు చెబుతున్నారు. 2023లో 2.16 లక్షల మంది భారతీయులు పౌరసత్వాన్ని వదులుకోవడం గమనార్హం.
TG: మాజీ ప్రధాని ఇందిరా గాంధీపై నెగటివ్ సినిమాలు తీసే వారికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కౌంటర్ ఇచ్చారు. దేశ సమగ్రతపై అవగాహన లేని వారు, గతం గురించి తెలియని వారు ఇందిరా గాంధీ చరిత్రను వక్రీకరిస్తారని అన్నారు. గతం గురించి తెలిసిన వారు ఇందిరా గాంధీకి చేతులెత్తి నమస్కరిస్తారని తెలిపారు. దేశ సమగ్రత కోసం తన ప్రాణాలను తృణప్రాయంగా అర్పించారని భట్టి కొనియాడారు.
Sorry, no posts matched your criteria.