News October 31, 2025

రైల్వే స్టేషన్లలో ప్యాసింజర్ హోల్డింగ్ ఏరియాలు

image

TGలోని SECBAD, కాచిగూడ, APలోని విజయవాడ, TPT, రాజమండ్రి, GNTతో పాటు దేశంలో 76 స్టేషన్లలో ప్యాసింజర్ హోల్డింగ్ ఏరియాలు ఏర్పాటు చేయాలని రైల్వేశాఖ నిర్ణయించింది. మహా కుంభమేళా వేళ ఢిల్లీ స్టేషన్‌లో తొక్కిసలాట అనంతరం రద్దీని నియంత్రించేందుకు అక్కడ ‘యాత్రి సువిధ కేంద్ర’ను అభివృద్ధి చేశారు. ఇందులో టికెట్ కౌంటర్‌తో పాటు ప్రయాణికులు వేచి ఉండేలా వసతులు కల్పించారు. ఇదే మోడల్‌ను దేశవ్యాప్తంగా అమలు చేస్తారు.

News October 31, 2025

‘బాహుబలి ది ఎపిక్’ మూవీ రివ్యూ

image

‘బాహుబలి ది ఎపిక్’లో 1, 2 పార్టులను కలిపి ఎడిట్ చేసినా స్క్రీన్ ప్లే మారలేదు. బాహుబలి తిరిగి మాహిష్మతికి వచ్చే సీన్‌ గూస్‌బంప్స్ తెప్పిస్తుంది. సాంగ్స్, యుద్ధం సీన్లను ట్రిమ్ చేశారు. 90 నిమిషాల సీన్లు కట్ అయినా మూవీపై ప్రభావం పడలేదు. విజువల్ ఎఫెక్ట్స్ ఆకట్టుకుంటాయి. కీలక సన్నివేశాలతో కథను నడిపేందుకు రాజమౌళి వాయిస్ ఓవర్ ఇచ్చారు. తమన్నా లవ్ ట్రాక్, సుబ్బరాజు కామెడీ సీన్స్ లేకపోవడం కాస్త మైనస్.

News October 31, 2025

INDvsAUS రెండో టీ20కి వర్షం ముప్పు

image

భారత్, ఆస్ట్రేలియా మధ్య ఇవాళ రెండో T20 జరగనుంది. అయితే మెల్‌బోర్న్‌లో మ్యాచ్ జరిగే టైమ్‌కి 93% వర్షం పడే అవకాశాలున్నాయని AccuWeather పేర్కొంది. వర్షం ఆగితే మైదానాన్ని ఆరబెట్టే టెక్నాలజీ అక్కడ ఉంది. కానీ వర్షం నుంచి బ్రేక్ లభించే అవకాశాలు తక్కువేనని తెలిపింది. ఈ మైదానంలో T20ల్లో ఇరు జట్లు 4సార్లు తలపడగా చెరో 2మ్యాచులు గెలిచాయి. కాన్‌బెర్రాలో జరగాల్సిన తొలి T20 వర్షం కారణంగా రద్దైన విషయం తెలిసిందే.

News October 31, 2025

బీట్‌రూట్‌తో బ్యూటీ

image

బీట్‌రూట్‌ను డైట్‌లో భాగం చేసుకుంటే ఆరోగ్యానికి ఎన్నో లాభాలున్నాయన్న విషయం తెలిసిందే. అయితే దీంతో అందాన్ని కూడా పెంచుకోవచ్చంటున్నారు నిపుణులు. * బీట్‌రూట్ రసం, పెరుగు కలిపి ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల తర్వాత కడిగేయాలి. దీంతో మచ్చలు తగ్గుతాయి. * బీట్‌రూట్ రసం, ఓట్స్ కలిపి స్క్రబ్ చేస్తే రక్తప్రసరణ పెరిగి చర్మం మెరుస్తుంది. బీట్‌రూట్ జ్యూస్ తాగడం వల్ల కూడా చర్మం ఆరోగ్యం బావుంటుందని చెబుతున్నారు.

News October 31, 2025

ICAR-IARIలో 18 ఉద్యోగాలు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

image

ICAR-IARI(ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్)లో 18 కాంట్రాక్ట్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. వీటిలో యంగ్ ప్రొఫెషనల్(15), సీనియర్ రీసెర్చ్ ఫెలో(3) ఖాళీలు ఉన్నాయి. నవంబర్ 6, 7 తేదీల్లో ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://iari.res.in/

News October 31, 2025

సెక్స్ కుంభకోణం కేసు.. ప్రిన్స్‌పై కింగ్ చర్యలు

image

జెఫ్రీ ఎప్‌స్టైన్‌ సెక్స్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిటన్ ప్రిన్స్ ఆండ్రూపై ఆయన సోదరుడు కింగ్ ఛార్లెస్-3 కఠిన చర్యలు తీసుకున్నారు. ఆండ్రూకున్న బిరుదులు, గౌరవాలు, అధికారాలను తొలగించారు. ఇంటిని ఖాళీ చేయాలని నోటీసులు పంపారు. USను కుదిపేసిన ఎప్‌స్టైన్ సెక్స్ కుంభకోణం బాధితురాలు గ్రిఫీ.. ఆండ్రూ తనపై 3సార్లు అత్యాచారం చేశారని ఇటీవల ఆరోపించారు. దీంతో ఆయనపై కింగ్ ఛార్లెస్-3 చర్యలు చేపట్టారు.

News October 31, 2025

భారీగా పెరిగిన బంగారం ధరలు!

image

బంగారం ధరలు ఇవాళ భారీగా పెరిగి కొనుగోలుదారులకు షాక్ ఇచ్చాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,200 పెరిగి రూ.1,22,680కు చేరింది. అలాగే 22క్యారెట్ల 10గ్రా.ల బంగారం ధర రూ.1,100 ఎగబాకి రూ.1,12,450గా ఉంది. అటు వెండి ధరల్లో ఎలాంటి మార్పులేదు. కేజీ సిల్వర్ రేటు రూ. 1,65,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇదే ధరలున్నాయి.

News October 31, 2025

DRDOలో ఉద్యోగాలు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

image

DRDO అనుబంధ సంస్థ డిఫెన్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ టెక్నాలజీలో 5 రీసెర్చ్ అసోసియేట్, సీనియర్ రీసెర్చ్ ఫెలో, జూనియర్ రీసెర్చ్ ఫెలో, ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. MS, MSc, ME, M.TECH, పీహెచ్‌డీ, బీఈ, బీటెక్, నెట్, గేట్ అర్హతగల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. షార్ట్ లిస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.drdo.gov.in/

News October 31, 2025

ముక్కలైన దేశాన్ని ఒక్కటి చేసిన ‘సర్దార్’

image

1947లో స్వాతంత్ర్యం నాటికి దేశంలో 565 సంస్థానాలున్నాయి. అప్పుడు రంగంలోకి దిగిన సర్దార్ వల్లభాయ్ పటేల్ HYD, కశ్మీర్, జునాగఢ్ మినహా అన్నీ దేశంలో కలిసిపోయేలా చేశారు. ఆ తర్వాత వాటిపైనా దృష్టి పెట్టారు. కశ్మీర్, జునాగఢ్ సంస్థానాధీశులతో పాటు అత్యంత ధనవంతుడిగా పేరుగాంచిన HYD నిజాం మెడలు వంచారు. ఆపరేషన్ పోలో చేపట్టి హైదరాబాద్ ప్రజలకు విముక్తి కల్పించారు. దేశాన్ని ఒక్కటిగా చేశారు. నేడు ‘సర్దార్’ జయంతి.

News October 31, 2025

నెట్‌వర్క్ ఆస్పత్రులకు వన్ టైం సెటిల్మెంట్!

image

AP: ‘NTR వైద్య సేవ’ కింద నెట్‌వర్క్ ఆస్పత్రులకు వన్‌టైం సెటిల్మెంట్ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. నిన్న ASHA ప్రతినిధులతో భేటీ అయిన అధికారులు 20 రోజులుగా చేస్తున్న సమ్మెను విరమించాలని కోరగా, ఇవాళ నిర్ణయం వెల్లడిస్తామని వారు చెప్పారు. ఇప్పటికే ప్రభుత్వం రూ.250CR రిలీజ్ చేసి, విడతల వారీగా చెల్లిస్తామన్నా సమ్మె విరమించలేదు. దీంతో వన్‌టైం సెటిల్మెంటే మార్గమని భావిస్తున్నట్లు సమాచారం.