News January 14, 2025

రైతులకు గుడ్ న్యూస్.. కూరగాయల సాగుకు సబ్సిడీ!

image

TG: కూరగాయలు సాగు చేసే రైతులు శాశ్వత పందిళ్లు, మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసుకునేందుకు సాయపడాలని ప్రభుత్వం నిర్ణయించింది. శాశ్వత పందిళ్లకు ఎకరానికి ₹3లక్షలు ఖర్చు కానుండగా, అందులో 50% సబ్సిడీ ఇవ్వనుంది. ఈ స్కీమ్‌ను తొలుత NZB(D) బోధన్‌లో ప్రయోగాత్మకంగా అమలు చేయనుంది. తీగ జాతి కూరగాయల సాగుకు ప్రాధాన్యం ఉంటుంది. ఈ స్కీమ్ అమలుకు వ్యవసాయ మార్కెట్ కమిటీ నిధులను వినియోగించనున్నట్లు సమాచారం.

News January 14, 2025

టిక్‌టాక్‌ను మస్క్‌కు అమ్మనున్న చైనా?

image

అమెరికాలో టిక్‌టాక్‌ను బ్యాన్ చేస్తే ఏం చేయాలన్న దానిపై బైట్‌డాన్స్ మల్లగుల్లాలు పడుతోంది. ఆ దేశం వరకు వ్యాపారాన్ని ట్విటర్ అధినేత ఎలాన్ మస్క్‌కు అమ్మడాన్ని ఒక ఆప్షన్‌గా ఎంచుకున్నట్టు తెలిసింది. విషయం అంత వరకు రాకుండా డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్‌తో చర్చించేందుకు సిద్ధమవుతోందని సమాచారం. వారెలాంటి రూల్స్ పెట్టినా పాటించేందుకు సై అంటోంది. టిక్‌టాక్ బ్యాన్‌కు ట్రంప్ అనుకూలంగా ఉండటం గమనార్హం.

News January 14, 2025

భార్యలతో స్టేయింగ్ టైమ్ కుదించిన BCCI?

image

టీమ్ఇండియా వరుస వైఫల్యాల నుంచి BCCI మేలుకుంటోంది. క్రికెటర్లపై కఠిన ఆంక్షల అమలుకు సిద్ధమవుతోందని సమాచారం. జట్టులో VVIP కల్చర్‌ను తగ్గించేందుకు ఇకపై అందరూ టీమ్‌బస్సులోనే ప్రయాణించాలని ఆదేశించింది. భార్యాపిల్లలతో స్టేయింగ్‌ను చిన్న టోర్నీలప్పుడు 7, పెద్ద టోర్నీలప్పుడు 14 రోజులకు కుదించినట్టు తెలిసింది. ఆటగాళ్ల బ్యాగేజ్ 150KG కన్నా ఎక్కువ ఉండకూడదు. గౌతీ మేనేజర్ VIP BOXలో ఉండకూడదు. మీ కామెంట్.

News January 14, 2025

వెంకటేశ్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ రివ్యూ

image

కిడ్నాపైన హై ప్రొఫైల్ వ్యాపారిని రక్షించేందుకు సస్పెండైన పోలీస్ ఏం చేశాడనేదే ‘సంక్రాంతికి వస్తున్నాం’ స్టోరీ. హీరో వెంకటేశ్, ఐశ్వర్య రాజేశ్, మీనాక్షిల మధ్య సాగే సన్నివేశాలు నవ్వులు పూయిస్తాయి. వెంకీ కుమారుడు బుల్లిరాజు పాత్ర, సాంగ్స్, కామెడీ సినిమాకు హైలైట్. డైరెక్టర్ అనిల్ రావిపూడి స్టోరీ కంటే కామెడీపైనే ఎక్కువ ఫోకస్ పెట్టారు. ఫస్టాఫ్‌తో పోలిస్తే సెకండాఫ్ స్లోగా సాగుతుంది.
RATING: 2.75/5

News January 14, 2025

రోడ్డు ప్రమాదం.. మంత్రికి తప్పిన ముప్పు

image

కర్ణాటక మంత్రి హెబ్బాల్కర్ లక్ష్మి త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డారు. బెళగావి జిల్లాలో ఆమె ప్రయాణిస్తున్న ఇన్నోవా కారు చెట్టును బలంగా ఢీకొట్టింది. కుక్క రోడ్డును దాటుతుండగా దాన్ని తప్పించేందుకు టర్న్ చేయడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో కారు ముందరి భాగం పూర్తిగా ధ్వంసమైంది. ఎయిర్ బ్యాగులు తెరుచుకోవడంతో ప్రాణాపాయం తప్పింది. మంత్రి ముఖం, నడుముకు స్వల్ప గాయాలయ్యాయి.

News January 14, 2025

Stock Markets: లాభాల్లో పరుగులు..

image

స్టాక్‌మార్కెట్లు మోస్తరు లాభాల్లో కొనసాగుతున్నాయి. ఇప్పటికే సూచీలు ఎక్కువ పతనమవ్వడంతో ఇన్వెస్టర్లు ఆకర్షణీమైన షేర్లను కొనుగోలు చేస్తున్నారు. నిఫ్టీ 23,201 (+116), సెన్సెక్స్ 76,717 (+387) వద్ద ట్రేడవుతున్నాయి. FMC, IT షేర్లపై సెల్లింగ్ ప్రెజర్ ఉంది. బ్యాంకు, ఆటో, ఫైనాన్స్, మీడియా, మెటల్, PSU బ్యాంకు, O&G షేర్లకు డిమాండ్ ఉంది. ADANIENT, NTPC, INDUSIND, TATAMOTORS, ADANIPORTS టాప్ గెయినర్స్.

News January 14, 2025

సంక్రాంతి.. ఆత్మీయులతో ఆనందంగా..

image

సంక్రాంతి పండగ పుణ్యాన అయినవాళ్లందరూ ఒక్కచోట చేరారు. రోజూ పనిలో బిజీగా ఉండే ఫ్యామిలీ మెంబర్స్ సంబరాలు చేసుకునేందుకు సిద్ధమయ్యారు. ఏడాదికోసారి వచ్చే ఈ విలువైన సమయంలోనైనా కంప్యూటర్, ఫోన్, టీవీ అంటూ గడిపేయకండి. మీ పిల్లలను ఊళ్లో తిప్పండి. పెద్దవాళ్లను పరిచయం చేయండి. పంటపొలాలు చూపించండి. సంప్రదాయ ఆటలు ఆడండి. ఆత్మీయులతో మనసారా మాట్లాడుతూ ఆనందంగా గడపండి.

News January 14, 2025

ఎమ్మెల్యే కౌశిక్‌కు బెయిల్ మంజూరు

image

TG: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి బెయిల్ మంజూరైంది. ఆయన రిమాండ్ రిపోర్టును జడ్జి కొట్టేశారు. కరీంనగర్ కలెక్టరేట్‌లో గందరగోళం సృష్టించారని, ఎమ్మెల్యే సంజయ్‌ను దుర్భాషలాడారని 3 కేసులు నమోదు కాగా నిన్న పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. ఇవాళ ఉదయం వైద్య పరీక్షలు చేసి, కోర్టు ముందు హాజరుపరచగా జడ్జి బెయిల్ ఇచ్చారు. రూ.10 వేల చొప్పున 3 పూచీకత్తులు ఇవ్వాలని ఆదేశించారు.

News January 14, 2025

ఒకే ఫ్లెక్సీలో చంద్రబాబు, కేసీఆర్, బాలయ్య

image

సంక్రాంతి వేళ ఏపీ సీఎం చంద్రబాబు, BRS అధినేత కేసీఆర్, బాలకృష్ణలతో కూడిన ఫ్లెక్సీ వైరల్ అవుతోంది. చంద్రబాబు కింద బాస్ ఈజ్ బ్యాక్, బాలయ్య కింద డాకు మహారాజ్, కేసీఆర్ కింద బాస్ ఈజ్ కమింగ్ సూన్ అని రాశారు. ఆ ఫ్లెక్సీలో లోకేశ్, కేటీఆర్, జూనియర్ ఎన్టీఆర్, మోక్షజ్ఞ కూడా ఉన్నారు. ఖమ్మం జిల్లాలోని ముగ్గు వెంకటాపురంలో ఈ బ్యానర్ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఎవరు దీన్ని పెట్టారో క్లారిటీ రావాల్సి ఉంది.

News January 14, 2025

ప్రభాస్ ‘రాజాసాబ్’ నుంచి కొత్త పోస్టర్

image

సంక్రాంతి కానుకగా ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘రాజాసాబ్’ నుంచి మేకర్స్ కొత్త పోస్టర్ విడుదల చేశారు. ఇందులో ప్రభాస్ స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. మారుతి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీకి తమన్ సంగీతం అందిస్తుండగా, టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. తాజా పోస్టర్‌లో మూవీ టీమ్ రిలీజ్ డేట్‌ను వెల్లడించలేదు. ‘మనం ఎప్పుడు వస్తే అప్పుడే అసలైన పండుగ.. త్వరలో చితక్కొట్టేద్దాం’ అని పేర్కొంది.