India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
గతేడాది ముంబైలో హత్యకు గురైన బాబా సిద్దిఖీ కుమారుడు, NCP నేత (అజిత్ పవార్ వర్గం) జీషన్ సిద్దిఖీకి బెదిరింపు మెయిల్ వచ్చింది. ‘నిన్నూ మీ నాన్న లాగే చంపేస్తాం. రూ.10కోట్లు ఇవ్వు. ప్రతి 6 గంటలకు ఓసారి ఇలాంటి మెయిల్ పంపుతూనే ఉంటాం’ అని వార్నింగ్ ఇచ్చారని ముంబై పోలీసులు వెల్లడించారు. కాగా సిద్ధిఖీని గతేడాది అక్టోబర్ 12న కాల్చి చంపారు. దీనికి తామే కారణమని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించింది.
పురుషులు కొన్ని రకాల ఆహారాలను తీసుకుంటే అది వారి సంతాన సాఫల్యతపై ప్రభావం చూపుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్రాసెస్ చేయబడిన మాంసాహారాలను తింటే శుక్రకణాల నాణ్యత తగ్గుతుందని తెలిపారు. రోజూ విపరీతంగా మద్యం సేవిస్తే వీర్యం ఉత్పత్తి తగ్గిపోతుందని పేర్కొన్నారు. అలాగే సాఫ్ట్ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్, కొవ్వు ఎక్కువగా ఉన్న క్రీమ్, చీజ్ వంటి పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు.
ఏఐ వినియోగంతో భారీ స్థాయిలో ఉద్యోగాలు కోల్పోతామని USమాజీ అధ్యక్షుడు ఒబామా, మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్ గేట్స్ అభిప్రాయపడ్డారు. ఏఐతో లభించే మెడికల్ , టీచింగ్ సలహాలు అందరికీ నచ్చుతాయని, కానీ ఉద్యోగాల పరిస్థితేంటని బిల్ గేట్స్ ప్రశ్నించారు. సాప్ట్‌వేర్ డెవలపర్స్ చేసే 70శాతం పనులను ఏఐ చేయగలదని, దీని వాడకం పెరిగితే చాలా ఉద్యోగాలు గల్లంతేనని, 100 ఏళ్లలో చూడని పరిస్థితి రావచ్చని ఒబామా అభిప్రాయపడ్డారు.
వజ్రాల వ్యాపారి, ఆర్థిక నేరగాడు నీరవ్ మోదీ జీవితాన్ని సినిమాగా తీయబోతున్నారని తెలుస్తోంది. విక్రమ్ మల్హోత్రా నిర్మాతగా నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ మూవీగా తెరకెక్కుతుందని ‘పింక్‌విల్లా’ వెల్లడించింది. ‘గుల్లాక్’ సిరీస్ ఫేమ్ డైరెక్టర్ పలాష్ వాస్వానీ దర్శకత్వం వహిస్తారట. వజ్రాల వ్యాపారిగా ఎదగడం, స్కామ్, జైలు వరకు అన్నీ విషయాలు ఈ మూవీలో ఉంటాయని చెబుతున్నారు. 2026లో విడుదలకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
దేశంలో నిరుద్యోగం ఎంతలా పెరిగిపోయిందో ఈ ఒక్క ఘటనను చూస్తే అర్థమవుతుంది. రాజస్థాన్‌లో 53,749 ప్యూన్ పోస్టులకు ఏకంగా 24.76 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. ఒక్క ఉద్యోగానికి 46 మంది పోటీ పడుతున్నారు. దీనికి అప్లై చేసిన వారిలో PhD, MBA, LLB చేసినవాళ్లు, సివిల్ సర్వీసెస్‌కు సిద్ధమవుతున్న వారు కూడా ఉన్నారు. అర్హత కంటే తక్కువ స్థాయి ఉద్యోగమైనా వస్తే చాలనే స్థితిలో నిరుద్యోగులు ఉన్నట్లు తెలుస్తోంది.
సీఎస్కే స్టార్ ప్లేయర్ కాన్వే తండ్రి డెంటాన్ మరణించినట్లు చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం తాజాగా ట్వీట్ చేసింది. ఈ క్లిష్ట సమయంలో అతడి కుటుంబానికి మద్దతుగా ఉంటామని పేర్కొంది. వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపింది. కాన్వే తండ్రి మృతికి సంతాపంగా నిన్నటి మ్యాచులో సీఎస్కే ఆటగాళ్లు నల్ల బ్యాండ్ ధరించారు. కాన్వే ఏప్రిల్ 11న సీఎస్కే తరఫున చివరి మ్యాచ్ ఆడారు.
ఈడెన్ గార్డెన్స్‌లో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్‌లో గుజరాత్ 3 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. గిల్(90), సాయి సుదర్శన్(52) అర్ధ సెంచరీలతో రాణించారు. కోల్‌కతా బౌలర్లలో వైభవ్, రసెల్, హర్షిత్‌కు తలో వికెట్ దక్కింది. KKR విజయలక్ష్యం 199 పరుగులు.
ఏపీలో రేపు శ్రీకాకుళం, విజయనగరం, మన్యంలోని 28 మండలాల్లో తీవ్ర వడగాలులు, 21 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని APSDMA తెలిపింది. ఇవాళ రాష్ట్రంలో అత్యధికంగా తిరుపతి రూరల్‌లో 42.1 డిగ్రీలు, అన్నమయ్య జిల్లా కంబాలకుంట, విజయనగరంలో 41.5 డిగ్రీలు, నెల్లూరు దగదర్తిలో 41.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు పేర్కొంది. ఎల్లుండి కూడా 12 మండలాల్లో తీవ్ర, 20 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.
2047కల్లా భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే వచ్చే పదేళ్లపాటు ఏడాదికి 80 లక్షల ఉద్యోగాల కల్పన జరగాలని చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ అనంత్ నాగేశ్వరన్ తెలిపారు. కొలంబో ఇండియా సమ్మిట్ 2025లో ఆయన ప్రసంగించారు. తయారీ రంగంలో GDPమరింత పెంచేలా ఉత్పాదకత సాధించాలని, దేశంలోని SMEలను మరింతగా ప్రోత్సహించాలని సూచించారు. పర్యావరణానికి ఎటువంటి హాని జరగకుండా అభివృద్ధి ప్రక్రియ ఉండాలన్నారు.
AP: మే 2న మధ్యాహ్నం 3 గంటలకు ప్రధాని మోదీ గన్నవరం ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అవుతారు. హెలికాప్టర్లో రాష్ట్ర సచివాలయం వద్దకు 3.20 గంటలకు చేరుకుంటారు. అక్కడి నుంచి సుమారు 1.2 కి.మీ పొడవున రోడ్డు షో నిర్వహిస్తారు. 3.35 గంటలకు సభావేదిక వద్దకు చేరుకుంటారు. 3.45 గంటలకు కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయి. సా.5 గంటలకు ప్రధాని తిరిగి ఎయిర్‌పోర్టుకు చేరుకుని ఢిల్లీకి బయలుదేరతారు.
Sorry, no posts matched your criteria.