News June 3, 2024

కింగ్ కోహ్లీ సిద్ధం

image

టీ20 వరల్డ్ కప్ ఆడేందుకు స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భారత జట్టుతో ఆలస్యంగా చేరిన సంగతి తెలిసిందే. దీంతో బంగ్లాదేశ్‌తో జరిగిన వార్మప్ మ్యాచులోనూ ఆయన ఆడలేదు. ఈ క్రమంలో కొత్త జెర్సీలో కోహ్లీ ఫొటోలకు పోజులిచ్చారు. అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో కింగ్ కోహ్లీ వరల్డ్ కప్ ఆడేందుకు సిద్ధమని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.

News June 3, 2024

మీరు ఏ అసెంబ్లీ సీటు రిజల్ట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు?

image

AP: కుప్పం, పులివెందుల, పిఠాపురం, గన్నవరం, గుడివాడ, మంగళగిరి, గుంటూరు వెస్ట్, సత్తెనపల్లి, నగరి, గాజువాక, మాచర్ల.. ఇలా ఏపీ ఎన్నికల్లో హాట్ సీట్లు ఎన్నో. గత ఐదేళ్లలో జరిగిన రాజకీయ పరిణామాలతో ఈ స్థానాల ఫలితాలపై ప్రజల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మరి మీరు ఏ అసెంబ్లీ సీటు రిజల్ట్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారో కామెంట్ చేయండి.

News June 3, 2024

తెలంగాణలో ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు ఇలా

image

* 17 నియోజకవర్గాల్లో 525 మంది పోటీ
* ఉ.8కి కౌంటింగ్ ప్రారంభం
* 120 హాళ్లలో 1855 టేబుళ్లపై ఓట్ల లెక్కింపు
* 2.18లక్షల పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపునకు 19 హాళ్లలో 276 టేబుళ్లు
* ఓట్ల లెక్కింపునకు సుమారు 10,000 మంది సిబ్బంది నియామకం
* కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత, సీసీ కెమెరాల నిఘా
* రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్, మద్యం షాపులు బంద్

News June 3, 2024

మరోసారి తండ్రయిన శివకార్తికేయన్

image

హీరో శివకార్తికేయన్ మరోసారి తండ్రయ్యారు. తన భార్య ఆర్తి నిన్న మగబిడ్డకు జన్మనిచ్చినట్లు ఆయన ట్వీట్ చేశారు. శివకార్తికేయన్-ఆర్తికి 2010లో వివాహమైంది. వారికి ఇప్పటికే కూతురు(ఆరాధన), కుమారుడు(గుగణ్) ఉన్నారు. ఇక శివకార్తికేయన్ ప్రస్తుతం రాజ్‌కుమార్ పెరియాస్వామి తెరకెక్కిస్తున్న ‘అమరన్’ మూవీలో నటిస్తున్నారు.

News June 3, 2024

T20 WC-2024 విజేతకు రికార్డ్ ప్రైజ్ మనీ

image

T20 WC-2024 విజేతకు $2.45m (₹20.36cr) ప్రైజ్ మనీ ఇవ్వనున్నట్లు ICC ప్రకటించింది. టోర్నీ చరిత్రలో ఇదే అత్యధికం అని పేర్కొంది. రన్నరప్‌కు $1.28m(₹10.64cr), సెమీస్‌లో ఓడిన జట్లకు ₹6.55cr చొప్పున ఇవ్వనుంది. సెకండ్ రౌండ్‌కి అర్హత సాధించని జట్లకు ₹3.18cr, 9-12స్థానాల్లో నిలిచిన వాటికి ₹2.06cr, 13-20 స్థానాల్లో నిలిచిన టీమ్స్‌కు ₹1.87cr దక్కనుంది. అలాగే ఒక్కో విజయానికి ₹25.9lakh బోనస్ లభించనుంది.

News June 3, 2024

జాగ్రత్త.. రేపు ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

image

AP: రేపు పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి, శ్రీ సత్యసాయి, YSR, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, ఏలూరు, కృష్ణా, NTR, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో వర్షాలు పడతాయని పేర్కొంది. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

News June 3, 2024

SBI అరుదైన ఘనత

image

ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అరుదైన ఘనత సాధించింది. ఇవాళ SBI షేర్లు రాణించడంతో బ్యాంక్ మార్కెట్ విలువ రూ.8 లక్షల కోట్లు దాటింది. దీంతో ఈ ఘనత అందుకున్న తొలి ప్రభుత్వ రంగ సంస్థగా నిలిచింది. ఇవాళ SBI షేర్ 9.48 శాతం పెరిగింది. గత ఏడాది ఈ షేర్ విలువ 40శాతం పెరగడం గమనార్హం. ఎన్డీఏకు సానుకూలంగా ఫలితాలు వస్తాయనే ఎగ్జిట్ పోల్స్ అంచనాతో ఇవాళ స్టాక్ మార్కెట్ లాభాల బాటలో దూసుకెళ్లింది.

News June 3, 2024

‘కల్కి’లో సీత?

image

ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న సినిమా ‘కల్కి 2898 AD’. ఈ మూవీలో ఇప్పటికే అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె వంటి స్టార్లు భాగమయ్యారు. ఈ ప్రతిష్ఠాత్మక చిత్రంలో ‘సీతారామం’ ఫేమ్ మృణాల్ ఠాకూర్‌తో పాటు సీనియర్ నటి శోభన నటించనున్నట్లు తెలుస్తోంది. ప్రత్యేక పాత్రల్లో వీరిద్దరూ కనిపిస్తారని ఓ వార్త సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. దీనిపై మూవీ యూనిట్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

News June 3, 2024

YCPకి 123 స్థానాలు వస్తాయి: పరిపూర్ణానంద

image

ఏపీలో జగన్ రెండోసారి సీఎం అవుతారని ఆధ్యాత్మిక గురువు స్వామి పరిపూర్ణానంద అన్నారు. అసెంబ్లీ ఫలితాల్లో వైసీపీకి 123 స్థానాలు వస్తాయని జోస్యం చెప్పారు. గ్రామీణ మహిళలు అధికశాతం YCPకే ఓట్లు వేశారన్నారు. దేశంలో మరోసారి ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని, మూడో సారి మోదీ ప్రధాని అవుతారని అంచనా వేశారు.

News June 3, 2024

ఎక్కడా విద్యుత్ కోతలు లేవు: తెలంగాణ కాంగ్రెస్

image

తెలంగాణలో ఎక్కడా విద్యుత్ కోతలు లేవని కాంగ్రెస్ పార్టీ ట్వీట్ చేసింది. ‘వర్షాకాలం దృష్ట్యా విద్యుత్ తీగలకు ఆనుకుని ఉండే చెట్ల కొమ్మలను తొలగించేందుకు, స్తంభాల మెయింటెనెన్స్ కోసం మాత్రమే విద్యుత్ నిలిపివేస్తున్నాం తప్ప కోతలు ఎక్కడా లేవు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా అనవసరంగా విద్యుత్ నిలిపివేసిన అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. BRS నాయకులు అసత్య ప్రచారం చేస్తున్నారు’ అని విమర్శించింది.