India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మీడియాకు అందని విధంగా CMలను ఎంపిక చేయడం BJP స్పెషాలిటీ. రీసెంటు ట్రెండ్ ఇదే చెప్తోంది. ఉత్తరాఖండ్‌లో పుష్కర్ సింగ్ ధామి, రాజస్థాన్‌లో భజన్‌లాల్, ఒడిశాలో మోహన్ చరణ్, మధ్యప్రదేశ్‌లో మోహన్ యాదవ్, హరియాణాలో నాయబ్ సైనీని ఇలాగే ఎంపిక చేశారు. ఆయా రాష్ట్రాల్లో గెలిచినప్పుడు వసుంధర రాజె, మనోహర్‌లాల్, శివరాజ్ సింగ్ పేర్లపై మీడియాలో చర్చ జరగ్గా మంత్రులు, MLA పదవుల్లో లేనివారినీ ఎంపికచేసి BJP షాకిచ్చింది.
AP: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి నేడు వాయుగుండంగా మారనుంది. మరో 2 రోజుల్లో వాయవ్య దిశగా కదులుతూ తమిళనాడు-శ్రీలంక తీరాల వైపు వెళ్లే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో ఎల్లుండి నుంచి కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. రేపటి నుంచి సముద్రం అలజడిగా ఉంటుందని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించింది.
శబరిమల ఆలయాన్ని తెరిచిన 9 రోజుల్లోనే 6.12లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు. దీంతో ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డుకు రూ.41.64కోట్ల ఆదాయం సమకూరింది. గతేడాది ఇదే సీజన్లో ఆదాయం రూ.13.37కోట్లుగా ఉంది. భక్తులకు ఇబ్బందుల్లేకుండా సన్నిధానం, పంపా, నీలక్కల్ కొండ ప్రాంతాల్లో నిరంతర విద్యుత్ సరఫరా కోసం అధికారులు చర్యలు తీసుకున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా తెలుగు రాష్ట్రాల నుంచి ప్రత్యేక రైళ్లు నడుస్తున్నాయి.
అల్లు అర్జున్-రష్మిక జంటగా నటించిన పుష్ప-2 మూవీ విడుదలకు ముందే సంచలనాలు సృష్టిస్తోంది. డిసెంబర్ 4న అమెరికా ప్రీమియర్స్ కోసం అత్యంత వేగంగా 50,000 టికెట్లు అమ్ముడుపోయిన సినిమాగా రికార్డు సాధించింది. ‘పుష్ప కేవలం చరిత్ర సృష్టించట్లేదు. ప్రతి చోటా తన రూల్‌ను ముద్రిస్తున్నాడు’ అని మేకర్స్ రాసుకొచ్చారు. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిసెంబర్ 5న విడుదల కానుంది.
TG: పోటీ పరీక్షలు రాసే అభ్యర్థులకు ఉపయోగపడే అంశాలపై ‘జనరల్ స్టడీస్ ఫర్ ఆల్’ పేరుతో టీ-సాట్ ప్రసారాలు అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షల పాఠ్యాంశాలపై ఇవాళ్టి నుంచి 5 నెలల పాటు 600 ఎపిసోడ్లు ప్రసారం చేయనున్నట్లు టీ-సాట్ సీఈవో వేణుగోపాల్ తెలిపారు. టీ-సాట్ నిపుణ ఛానల్లో మ.12-1 గంటల వరకు, మ.3-4 గంటల వరకు, విద్య ఛానల్లో రా.8-10 గంటల వరకు టెలికాస్ట్ ఉంటుందని పేర్కొన్నారు.
TG: జీహెచ్ఎంసీ పరిధిలో హౌసింగ్ సొసైటీలకు భూకేటాయింపులు రద్దు చేస్తూ సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. ప్రజా ప్రతినిధులు, అధికారులు, జర్నలిస్టుల సొసైటీలకు గతంలో ప్రభుత్వాలు భూకేటాయింపులు చేశాయి. వీటిని సవాల్ చేస్తూ సుప్రీంలో పిటిషన్ దాఖలు కాగా, సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం తుది తీర్పు వెలువరించింది. ప్రభుత్వానికి సొసైటీలు చెల్లించిన డబ్బులు వెనక్కి ఇవ్వాలని ఆదేశించింది.
వచ్చే IPL సీజన్లో DCని కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్ లీడ్ చేస్తారని కోఓనర్ పార్థ్ జిందాల్ వెల్లడించారు. ‘మాకు యంగ్ బ్యాటింగ్ లైనప్ ఉంది. టాప్ ఆర్డర్లో నిలకడ కోసం KLను తీసుకున్నాం. అతను ప్రతి సీజన్లో 400+ పరుగులు చేశారు. మా హోమ్ గ్రౌండ్(కోట్లా) అతనికి సరిగ్గా సరిపోతుంది. యంగ్ టీమ్‌ను KL, అక్షర్ గైడ్ చేస్తారు’ అని చెప్పారు. స్టార్క్, మెక్‌గుర్క్, బ్రూక్, అశుతోష్, రిజ్వీని వేలంలో DC దక్కించుకుంది.
బిహార్‌లో 4 స్థానాలకు జరిగిన బైఎలక్షన్లో ఘోర ఓటమి తర్వాత జన సురాజ్ లీడర్ ప్రశాంత్ కిశోర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. USలోని బిహారీలతో వర్చువల్‌గా మాట్లాడుతూ ‘బిహార్ ఒక విఫల రాష్ట్రం. అది చెత్తలో కూరుకుపోయింది. సుడాన్లో 20ఏళ్లుగా సివిల్ వార్ జరుగుతోంది. అక్కడ ప్రజలు పిల్లల చదువుల గురించి పట్టించుకోరు. అలాంటి పరిస్థితే ఇక్కడా ఉంది. రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రయత్నాలు తీవ్రతరం చేయాలి’ అని చెప్పారు.
ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో AJSU పార్టీ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే నిర్మల్ మహతో ఇంతలోనే రాజీనామాకు సిద్ధమయ్యారు. పార్టీ చీఫ్ సుదేశ్ మహతోను అసెంబ్లీకి పంపేందుకు తాను త్యాగం చేస్తానని ప్రకటించారు. ఇప్పటికే రాజీనామా లేఖను ఆయనకు పంపినట్లు తెలిపారు. బీజేపీ మిత్రపక్షమైన AJSU 10 స్థానాల్లో పోటీ చేసి ఒక్క సీటుకు పరిమితమైంది. కేవలం 231 సీట్ల స్వల్ప మెజార్టీతోనే నిర్మల్ మహతో గట్టెక్కడం గమనార్హం.
ఎన్నికల్లో ఓటమికి బాధ్యత వహిస్తూ మహారాష్ట్ర పీసీసీ చీఫ్ నానా పటోలే రాజీనామా చేశారు. లేఖను హైకమాండ్‌కు పంపిన ఆయన ఈ సాయంత్రం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కలవనున్నారు. తాజా ఎన్నికల ఫలితాల్లో MVA కూటమి ఘోర పరాజయం చెందింది. కాంగ్రెస్ పార్టీ కేవలం 16 స్థానాల్లోనే గెలిచిన విషయం తెలిసిందే.
Sorry, no posts matched your criteria.