News September 30, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News September 30, 2024

సెప్టెంబర్ 30: చరిత్రలో ఈరోజు

image

1951: సినీ దర్శకుడు రేలంగి నరసింహారావు జననం
1961: భారత మాజీ క్రికెటర్ చంద్రకాంత్ పండిత్ జననం
1971: ఏపీ సీఎంగా పి.వి.నరసింహారావు ప్రమాణం
1980: మాజీ టెన్నిస్ క్రీడాకారిణి మార్టినా హింగిస్ జననం
1993: మహారాష్ట్ర లాతూర్ భూకంపంలో 10,000 మంది మరణం
☞ అంతర్జాతీయ అనువాద దినోత్సవం

News September 30, 2024

సంగారెడ్డిలో హైడ్రా అత్యుత్సాహం ప్రదర్శించొద్దు: జగ్గారెడ్డి

image

TG: సంగారెడ్డి నియోజకవర్గంలో హైడ్రా అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించొద్దని మాజీ ఎమ్మెల్యే, TPCC వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. కూల్చివేతల పేరుతో నియోజకవర్గ ప్రజల్లో అనవసర భయాందోళనలు సృష్టించొద్దని అధికారులకు సూచించారు. ‘హైడ్రా ఔటర్ రింగ్ రోడ్డు లోపలి వరకే పరిమితమని CM చెప్పారు. ORR బయట ఏవైనా సమస్యలుంటే ముందుగా నా దృష్టికి తీసుకురండి’ అని అధికారులను ఉద్దేశించి ప్రెస్‌మీట్‌లో మాట్లాడారు.

News September 30, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News September 30, 2024

శుభ ముహూర్తం

image

తేది: సెప్టెంబర్ 30, సోమవారం
త్రయోదశి: రా.7.06గంటలకు
మఖ: ఉ.6.18 గంటలకు
వర్జ్యం: మ.3.17- సా.5.05 గంటల వరకు
దుర్ముహూర్తం: మ.12.21 నుంచి మ.1.09 గంటల వరకు
తిరిగి మ.2.44 నుంచి మ.3.32 గంటల వరకు
రాహుకాలం: ఉ.7.30 నుంచి ఉ.9.00 వరకు

News September 30, 2024

TODAY HEADLINES

image

✒ స్వ‌చ్ఛ భార‌త్ గాంధీకి సముచిత నివాళి: మోదీ
✒ మోదీని దించేవరకు నేను చావను: ఖర్గే
✒ నేపాల్‌ వరదల్లో 148 మంది మృతి..
✒ APకి 30 ESI ఆస్పత్రులు: పెమ్మసాని
✒ విశాఖలో షాపింగ్‌ మాల్, మల్టీప్లెక్స్: లులు ఛైర్మన్
✒ దీపావళికి ఫ్రీ సిలిండర్లు.. సన్నాహాలు ప్రారంభం
✒ త్వరలో 3వేల TGSRTC ఉద్యోగాల భర్తీ: పొన్నం
✒ రేవంత్‌ది రాతి గుండె: హరీశ్ రావు
✒ రాజకీయాలు కాదు.. నటనే నా తొలి ఆప్షన్: ఎన్టీఆర్

News September 30, 2024

అదానీ గ్రూప్‌నకు థాంక్స్: ప్రజ్ఞానంద

image

తన గెలుపు వెనుక అదానీ గ్రూప్ ఇచ్చిన మద్దతు చాలా ఉందని చెస్ ఛాంపియన్ ప్రజ్ఞానంద తాజాగా ఓ ఇంటర్వ్యూలో అన్నారు. ‘నేను నిరంతరం సాధన చేయాల్సి ఉంటుంది. అదానీ గ్రూప్ అండగా నిలవడంతో అది సాధ్యమైంది. ఈ ఏడాది మొదట్లో నేను గౌతమ్ అదానీని కలిశాను. భారత్‌కోసం లక్ష్యం చేరాలని ఆయన సూచించారు. ఆయన ఇస్తున్న సపోర్ట్‌కు కృతజ్ఞుడిని’ అని తెలిపారు.

News September 30, 2024

ఖర్గేకు ప్రధాని మోదీ పరామర్శ

image

కశ్మీర్‌లో ఎన్నికల ర్యాలీ సమయంలో స్వల్ప అనారోగ్యంపాలైన AICC అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను PM మోదీ ఫోన్‌లో పరామర్శించారు. ఖర్గే పరిస్థితిని ఆయన అడిగి తెలుసుకున్నారని పీఎంఓ వర్గాలు వెల్లడించాయి. కాగా.. మోదీని దించేవరకూ తాను చావనని కశ్మీర్ సభలో ఖర్గే వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ‘నాకు 83 ఏళ్లు. కానీ అంత సులువుగా చావను. మీ కోసం ఈ ప్రభుత్వంతో పోరాడతాను’ అంటూ ఖర్గే ఆ ప్రసంగంలో నిప్పులు చెరిగారు.

News September 30, 2024

త్వరగా నిద్ర పట్టాలంటే..

image

మారిన ఆహారపు అలవాట్లతో నిద్రలేమి సమస్య పెరుగుతోంది. దీంతో చాలా మంది అనారోగ్యాల పాలవుతున్నారు.
*పడుకునే ముందు కంప్యూటర్, ఫోన్లు ఎక్కువగా వాడొద్దు. దీంతో కళ్లు దెబ్బతినే ప్రమాదమూ ఉంది.
*బ్రీతింగ్ వ్యాయామం చేయాలి. ఉదయం గంటసేపు వర్కౌట్స్ చేయాలి.
*లైటింగ్, సౌండ్ లేకుండా చూసుకోవాలి.
*రాత్రి భోజనంలో ఆకుకూరలు, కివీ పండ్లు, డెయిరీ పదార్థాలు ఉండేలా చూసుకోండి.

News September 30, 2024

బజ్జీలు ఉద్దెరకు ఇవ్వలేదని సలసల కాగుతున్న నూనెను..

image

TG: మిరపకాయ బజ్జీలు ఉద్దెరకు ఇవ్వలేదని కాగుతున్న నూనెను యజమానిపై పోసిన ఘటన గద్వాల జిల్లా కేటిదొడ్డి మం. గువ్వలదిన్నెలో జరిగింది. నిన్న రాత్రి వినోద్ అనే వ్యక్తి ఓ హోటల్‌కు వెళ్లి బజ్జీలు ఇవ్వాలని, డబ్బులు మళ్లీ ఇస్తానని అడిగాడు. యజమాని బుజ్జన్న గౌడ్ ఇవ్వనని చెప్పడంతో వినోద్ కోపంతో పొయ్యిపై కాగుతున్న నూనెను అతడిపై పోశాడు. పక్కనే ఉన్న మరో వ్యక్తిపై కూడా పడటంతో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు.