India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: తెలుగు ప్రజలకు సీఎం చంద్రబాబు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. సంక్షేమం, అభివృద్ధితో జీవితాల్లో వెలుగులు తెచ్చి, తెలుగు జాతిని నంబర్-1 చేసేందుకు స్వర్ణాంధ్ర 2047 విజన్‌ను ఆవిష్కరించామన్నారు. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు P4(పబ్లిక్-ప్రైవేట్-పీపుల్-పార్ట్‌నర్‌షిప్) విధానం తీసుకొచ్చామని పేర్కొన్నారు. ఇందులో అందరూ భాగస్వాములవ్వాలని, ఆరోగ్య, ఆదాయ, ఆనంద ఏపీ కోసం సంకల్పం తీసుకుందామని పిలుపునిచ్చారు.
భారత్‌లో ఇప్పటివరకూ నమోదైన <<15087157>>HMPV <<>> కేసుల సంఖ్య 17కు చేరింది. గుజరాత్‌లో 5, మహారాష్ట్ర 3, కర్ణాటక 2, తమిళనాడు 2, కోల్‌కతా 3, అస్సాం 1, పుదుచ్చేరిలో 1 చొప్పున కేసులు నమోదయ్యాయి. రేపటి నుంచి యూపీలో మహా కుంభమేళా జరగనున్న నేపథ్యంలో ఈ కేసులు పెరుగుతాయని పలువురు ఆందోళన చెందుతున్నారు. అయితే ఇది కొత్త వైరస్ కాదని, 2001లో తొలిసారి దీనిని గుర్తించినట్లు ఇప్పటికే కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే.
AP: కోడి పందేల శిబిరాలను డ్రోన్లతో పర్యవేక్షించనున్నట్లు విజయవాడ సీపీ రాజశేఖర్ తెలిపారు. శిబిరాల వద్ద బహిరంగ మద్యం విక్రయాలను అడ్డుకుంటామన్నారు. కోళ్లకు కత్తి కట్టి పందేలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గుండాట, పేకాట, క్యాసినోలు జరగనివ్వమని చెప్పారు. సంక్రాంతి అంటే కోడి పందేలు, జూదం, గుండాట, క్యాసినో కాదని అన్నారు. సంప్రదాయ ఆటలు ఆడుతూ పండుగ జరుపుకోవాలని ప్రజలకు సూచించారు.
డీలిమిటేషన్ ప్రాసెస్ మొదలయ్యే సరికి మహిళా నాయకత్వాన్ని పెంచుకొనేందుకు BJP కసరత్తు ఆరంభించింది. బూత్ లెవల్ నుంచి నేషనల్ వరకు పార్టీ పగ్గాలను సముచిత స్థాయిలో వారికే అప్పగించనుందని తెలిసింది. నడ్డా స్థానంలో BJPకి కొత్త ప్రెసిడెంట్ వచ్చేలోపు states, dists, mandals, village స్థాయుల్లో 30% వరకు స్త్రీలకే బాధ్యతలు అప్పగించనుంది. MPని మోడల్ స్టేట్‌గా ఎంచుకుంది. 2026 నుంచి విమెన్ రిజర్వేషన్లు అమలవుతాయి.
తన భార్యకూ తనను చూస్తూ ఉండిపోవడమంటే చాలా ఇష్టమని సీరమ్ ఇన్‌స్టిట్యూట్ అధినేత అదార్ పూనావాలా అన్నారు. వారానికి 90 గంటల పని అంశంపై స్పందించారు. క్వాంటిటీ కన్నా క్వాలిటీ వర్క్‌కే ప్రాధాన్యం ఇవ్వాలన్న ఆనంద్ మహీంద్రాతో ఏకీభవించారు. ‘అవును మహీంద్రా. నా భార్య నటాషా కూడా నేనెంతో అద్భుతంగా ఉన్నానని అనుకుంటుంది. ఆదివారాలు నన్నలా చూస్తూ ఉండిపోవడం ఆమెకెంతో ఇష్టం. #worklifebalance’ అని ట్వీట్ చేశారు.
AP: భవన నిర్మాణాలు, లేఔట్‌లకు అనుమతులిచ్చే విధానంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక మార్పులు తీసుకొచ్చింది. గతంలో పట్టణాభివృద్ధి సంస్థ అనుమతులు ఇస్తుండగా, ఆ అధికారాలను మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, నగర, గ్రామ పంచాయతీలకు బదిలీ చేసింది. ప్రజల సౌలభ్యం కోసం నిబంధనలను సవరించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే నగర పంచాయతీల్లో 3 ఎకరాలపైన లేఔట్ ఉంటే డీటీసీపీ అనుమతి తప్పనిసరి అని పేర్కొంది.
అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్‌కు చెందిన ‘బ్లూ ఆరిజిన్’ సంస్థ ప్రారంభమైన 25 ఏళ్ల తర్వాత ఎట్టకేలకు రాకెట్‌ను ప్రయోగించేందుకు సిద్ధమవుతోంది. 320 అడుగుల ఎత్తైన ఆ రాకెట్‌ను న్యూ గ్లెన్‌గా పిలుస్తున్నారు. అది సుమారు 32 అంతస్తుల భవనంతో సమానమని సంస్థ వర్గాలు వివరించాయి. అమెరికాలోని కేప్ కనవెరల్ రోదసి కేంద్రం నుంచి సోమవారం తెల్లవారుజాము ఒంటిగంటకు ఇది నింగిలోకి దూసుకుపోనుందని పేర్కొన్నాయి.
ట్రంప్ గెలుపుతో Free Speechపై సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ డొల్లతనం బయటపడుతోంది. డెమొక్రాట్ల హయాంలో కొవిడ్ కంటెంట్‌ను ఎలా సెన్సార్ చేశారో, LGBTQ+పై అభిప్రాయాలను ఎలా తొక్కిపెట్టారో FB, INSTA యజమాని జుకర్‌బర్గ్ వెల్లడించారు. తమ ఆఫీసుల్లో మగవాళ్ల టాయిలెట్లలో ట్రాన్స్‌జెండర్ల కోసం పెట్టిన టాంపాన్లను ఇప్పుడు తీసేయించారు. FACT CHECKERS పొలిటికల్లీ మోటివేటెడ్ అని, వాళ్లవి అబద్ధాలేనని కుండబద్దలు కొట్టారు.
AP: ఆరు నెలల NDA పాలనలో పంచాయతీ రాజ్ శాఖ అనేక మైలు రాళ్లను దాటిందన్న Dy.CM పవన్‌కు వైసీపీ కౌంటరిచ్చింది. ‘అబద్ధాలను ప్రచారం చేయడంలో పవన్ తన గురువు చంద్రబాబును మించిపోయారు. రోడ్ల గుంతలను పూడ్చడానికి కూటమి చేసిన ఖర్చు రూ.860 కోట్లు మాత్రమే. YCP ప్రభుత్వం రోడ్ల నిర్మాణానికి రూ.43వేల కోట్లు, మరమ్మతులకు రూ.4,648 కోట్లు ఖర్చు చేసింది. ఇప్పటికైనా పవన్ వాస్తవాలు మాట్లాడితే బాగుంటుంది’ అని ట్వీట్ చేసింది.
నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన ‘డాకు మహారాజ్’ సినిమా ఈరోజు థియేటర్లలో రిలీజవగా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. థియేటర్లలో సినిమాను ఎక్స్‌పీరియన్స్ చేసేందుకు అభిమానులు క్యూ కడుతున్నారు. ఇదిలా ఉండగా ఈ చిత్ర ఓటీటీ హక్కులను ‘నెట్‌ఫ్లిక్స్’ దక్కించుకుంది. అయితే, 4 నుంచి 8 వారాల్లో ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందని సినీవర్గాలు పేర్కొన్నాయి.
Sorry, no posts matched your criteria.