News June 3, 2024

ఏపీలో నాలుగు రోజులు వర్షాలు

image

AP: ఉపరితల ఆవర్తనం, రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో 4 రోజులు వర్షాలు పడతాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఇవాళ శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, అల్లూరి, ఏలూరు, కృష్ణా, NTR, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, YSR, శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని అంచనా వేస్తోంది. మిగతా చోట్ల తేలికపాటి జల్లులు కురుస్తాయని వెల్లడించింది.

News June 3, 2024

శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటలు

image

AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సర్వదర్శనం కోసం వచ్చిన భక్తులతో ఆదివారం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లు, నారాయణగిరి షెడ్లు నిండిపోయాయి. వీరికి శ్రీవారి దర్శనం అయ్యేందుకు 20 గంటలు పట్టినట్లు టీటీడీ వెల్లడించింది. రూ.300 టికెట్ భక్తులకు 3 గంటల సమయం పడుతోందని తెలిపింది. కాగా శనివారం శ్రీవారిని 78,686 మంది భక్తులు దర్శించుకోగా.. హుండీ ఆదాయం రూ.3.54కోట్లు లభించింది.

News June 3, 2024

బెంగాల్‌లో మరోసారి చెలరేగిన హింస.. బీజేపీ కార్యకర్త హత్య

image

శనివారం ఆఖరి దశ పోలింగ్‌ను ముగించుకున్న బెంగాల్‌లో మరోసారి హింస చెలరేగింది. కృష్ణానగర్‌లోని కాళీగంజ్‌లో దుండగులు హఫీజుల్ షేక్ అనే బీజేపీ కార్యకర్తను కాల్చి చంపారు. ఆపై మొండెం నుంచి వేరు చేసిన తలతో పరారయ్యారు. మరోవైపు సందేశ్‌ఖలిలో హింసకు పాల్పడిన వారిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నించగా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. నిందితులను అరెస్ట్ చేసేందుకు వచ్చిన పోలీసులను మహిళలు అడ్డగించారు.

News June 3, 2024

అమూల్ పాల ధరలు పెంపు

image

నేటి నుంచి పాల ధరలు పెంచుతూ అమూల్ ప్రకటన విడుదల చేసింది. గేదే పాలు 500 మి.లీ ప్యాకెట్‌పై రూ.2, లీటర్ పాల ప్యాకెట్‌పై రూ.3 పెంచింది. గోల్డ్, తాజా రకం పాలపై లీటర్‌కు రూ.2, హాఫ్ లీటర్‌కు రూ.1 చొప్పున పెంచినట్లు పేర్కొంది. ఆవు పాలు హాఫ్ లీటర్ ప్యాక్‌, లీటర్ ప్యాక్‌పై రూపాయి చొప్పున పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఉత్పత్తి ఖర్చు పెరగడంతోనే ధరలు పెంచినట్లు పేర్కొంది.

News June 3, 2024

నేడు పాలిసెట్ ఫలితాలు విడుదల

image

TG: డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం గతనెల 24న నిర్వహించిన పాలిసెట్ పరీక్ష ఫలితాలు నేడు వెల్లడికానున్నాయి. మధ్యాహ్నం 12 గంటలకు విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం ఫలితాలను రిలీజ్ చేస్తారు. ఈ పరీక్షకు 92,808 మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోగా 82,809 మంది పరీక్షకు హాజరయ్యారు. పరీక్షకు సంబంధించిన ఫలితాలను <>https://sbtet.telangana.gov.in<<>> సైట్‌లో చూసుకోవచ్చు.

News June 3, 2024

నేడు మళ్లీ 23వేల మార్క్‌కు చేరనున్న నిఫ్టీ?

image

ఎగ్జిట్ పోల్స్ అధికార పార్టీకి సానుకూలంగా రావడంతో నేడు స్టాక్ మార్కెట్లు లాభాల్లో దూసుకెళ్లొచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. నిఫ్టీ ఈ ఒక్కరోజే 500 పాయింట్లకుపైగా పెరిగి మళ్లీ 23వేల మార్క్ చేరుతుందని అంచనా వేశారు. రేపు ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్న నేపథ్యంలో నేటి ట్రేడింగ్‌పై ఇన్వెస్టర్లలో ఆసక్తి నెలకొంది. కాగా గతనెల 24న ఆల్ టైమ్ హై నమోదు చేసిన నిఫ్టీ ఆ తర్వాత ఒడుదొడుకులను ఎదుర్కొని డీలా పడింది.

News June 3, 2024

రాహుల్ కోసం 2029, 2034 ఎన్నికలు ఉన్నాయి: హర్దీప్ సింగ్

image

ఈసారి అధికారం తమదే అని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ధీమా వ్యక్తం చేయడాన్ని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురీ తోసిపుచ్చారు. ప్రస్తుతం ఆయన భ్రమలో ఉన్నారని, మరికొన్ని గంటల్లో వాస్తవాలు తెలుసుకుంటారని పేర్కొన్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వయసు చిన్నదేనని.. ఆయన ఎదురుచూడటానికి 2029, 2034 ఎన్నికలు ఉన్నాయని ఎద్దేవా చేశారు. ఈసారి బీజేపీ 340కిపైగా సీట్లు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

News June 3, 2024

రోడ్డు ప్రమాదంలో 13 మంది మృతి.. రాష్ట్రపతి దిగ్భ్రాంతి

image

మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్ జిల్లా పిప్‌లోడీ ప్రాంతంలో ట్రాక్టర్ తిరగబడి 13 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. రాజస్థాన్‌కు చెందిన వీరు ఆదివారం రాత్రి ఓ వివాహ వేడుకకు వెళ్తుండగా ఈ విషాదం జరిగింది. కాగా ఈ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపిన ముర్ము, క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు.

News June 3, 2024

జైలుకు వెళ్లేందుకు నాకు ఓకే.. కానీ: డొనాల్డ్ ట్రంప్

image

హష్ మనీ కేసులో తాను జైలుకు వెళ్లేందుకు సిద్ధమని US మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. కానీ ప్రజలు నుంచి దీనిపై పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించి ఇందుకు బదులు తీర్చుకుంటానని తెలిపారు. గతంలో ఓ అడల్ట్ స్టార్‌కు చేసిన చెల్లింపులను 2016 ఎన్నికలప్పుడు సమర్పించిన వివరాల్లో ట్రంప్ కప్పిపుచ్చినట్లు కోర్టు విచారణలో తేలింది.

News June 3, 2024

ఇళయరాజా పుట్టినరోజు ఈరోజే కానీ..!

image

మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా పుట్టినరోజు ఈరోజే (జూన్ 3) అయినా ఆయన ఒక రోజు ముందే సెలబ్రేట్ చేసుకుంటారు. దీని వెనుక ఓ ఆసక్తికర స్టోరీ ఉంది. ఇళయరాజాకు తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి అంటే ఎంతో అభిమానం. కరుణానిధి పుట్టినరోజు కూడా జూన్ 3నే కావడంతో ఆయన మీద గౌరవంతో రాజా తన పుట్టినరోజును ఒక రోజు ముందే జరుపుకోవడం మొదలుపెట్టారట. కాగా కరుణానిధి ఇళయరాజాను గతంలో ‘ఇసయ్‌జ్ఞాని’ అనే బిరుదుతో గౌరవించారు.