News June 2, 2024

రేపు పాలిసెట్ ఫలితాలు

image

TG: రాష్ట్రంలో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన పాలిసెట్ పరీక్ష ఫలితాలు రేపు మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ తెలిపింది. మే 24న ఈ పరీక్ష జరిగింది. పాలిసెట్‌కు 92,808 మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోగా, 82,809 మంది పరీక్షకు హాజరయ్యారు. ఫలితాలు https://sbtet.telangana.gov.in వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు.

News June 2, 2024

ఎఫ్ఐహెచ్ ప్రో లీగ్‌లో భారత జట్టు ఓటమి

image

ప్రతిష్ఠాత్మక ఎఫ్ఐహెచ్ ప్రో లీగ్‌లో భారత పురుషుల హాకీ జట్టు ఓటమి చవి చూసింది. లండన్ వేదికగా జరుగుతున్న టోర్నీలో ఆతిథ్య బ్రిటన్ జట్టు పైచేయి సాధించింది. 3-1 తేడాతో ఇండియాపై విజయం సాధించింది. బ్రిటన్ జట్టు విజయంలో నికోలస్, కల్నన్ విల్‌లు కీలక పాత్ర పోషించారు. టీమిండియాలో స్టార్ ప్లేయర్లంతా విఫలమవగా అభిషేక్ ఏకైక గోల్ చేశారు. ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ 2019 నుంచి ఈ లీగ్ నిర్వహిస్తోంది.

News June 2, 2024

మోదీ నుంచి ఆశిస్తున్నది ఇవే: హర్ష గోయెంకా

image

★ ఒకే దేశం ఒకే ఎన్నిక
★ యూనిఫాం సివిల్ కోడ్
★ వ్యవసాయ సంస్కరణలు
★ ఆర్థిక వ్యవస్థ వృద్ధికి నిరంతర ప్రయత్నాలు
★ డిజిటలైజేషన్‌ను మరింత పెంచడం
★ ఆరోగ్య సంరక్షణ & విద్యపై ప్రత్యేక దృష్టి
★ ఉద్యోగ కల్పనకు ప్రాధాన్యం
★ కార్మిక సంస్కరణలు
★ విద్యుత్ & వాతావరణ రంగంలో ఎక్కువ పెట్టుబడులు

News June 2, 2024

ఫేక్ సర్వేతో టీడీపీ నవ్వులపాలు: YCP

image

APలో ఎన్ని అసెంబ్లీ సీట్లు ఉన్నాయో కూడా తెలియని యాక్సిస్ మై ఇండియా సంస్థ కూటమి గెలుపుపై జోస్యం చెప్పిందని YCP విమర్శించింది. ‘రాజస్థాన్, WB, CH ఎన్నికల్లో ఈ సంస్థ ఇచ్చిన అంచనాలు పూర్తిగా తప్పాయి. బుర్రలేని TDP, ఎల్లో మీడియా ఆ సర్వేపై ఆహా అంటూ కీర్తనలు. ఫేక్ సర్వేలను ఆశ్రయించి పరువు పోగొట్టుకున్న కూటమి’ అని ఎద్దేవా చేసింది. APలో 177 స్థానాలంటూ ఇండియా టుడే ఛానల్‌లో చూపినట్లు ఓ ఫొటోను YCP పంచుకుంది.

News June 2, 2024

సినీనటుడి బ్యాగులో బుల్లెట్ల కలకలం!

image

కోలీవుడ్ నటుడు, మాజీ ఎమ్మెల్యే కరుణాస్ చిక్కుల్లో పడ్డారు. తన బ్యాగులో 40 బుల్లెట్లను తీసుకెళ్తూ చెన్నై ఎయిర్‌పోర్ట్ అధికారులకు దొరికిపోయారు. అధికారులు బుల్లెట్లను స్వాధీనం చేసుకుని ఆయన ప్రయాణాన్ని రద్దు చేశారు. ఇండిగో విమానంలో చెన్నై నుంచి తిరుచ్చి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. దీనిపై అధికారులు విచారణ చేపట్టారు. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News June 2, 2024

అమిత్ షాపై ఆరోపణలు.. జైరాం రమేశ్‌కు ఈసీ లేఖ

image

ఓట్ల లెక్కింపు నేపథ్యంలో హోం మంత్రి అమిత్ షా 150 మంది కలెక్టర్లకు ఫోన్ చేసి బెదిరింపులకు దిగారన్న కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ వ్యాఖ్యలపై EC స్పందించింది. ఆరోపణలపై తగిన ఆధారాలివ్వాలని ఆదేశించింది. ‘మీరు ఒక జాతీయ పార్టీలో బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్నారు. ఇలాంటి ఆరోపణలు ప్రజల్లో సందేహాలను రేకెత్తిస్తాయి. వాటిపై విచారణ జరిపేందుకు ఆధారాలు సమర్పిస్తే చర్యలు తీసుకుంటాం’ అని ఈసీ ఆయనకు రాసిన లేఖలో పేర్కొంది.

News June 2, 2024

రేపు ఈసీ ప్రెస్ మీట్

image

జూన్ 4న లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్‌ నేపథ్యంలో రేపు మీడియా సమావేశం నిర్వహించనున్నట్లు భారత ఎన్నికల కమిషన్(ECI) ఓ ప్రకటనలో తెలియజేసింది. ఏప్రిల్ 19న విడతల వారీగా మొదలైన పోలింగ్ నిన్నటితో ముగిసింది. కాగా పోలింగ్ ప్రక్రియ ముగిశాక ECI మీడియా సమావేశం ఇదే మొదటిసారని తెలుస్తోంది.

News June 2, 2024

‘పగటి కలలు మాని.. క్షేత్ర స్థాయిలో పని చేసుకోండి’

image

కాంగ్రెస్ నేతలు పగటి కలలు కనడం మానుకోవాలని BJP సీనియర్ నేత రవిశంకర్ ప్రసాద్ హితవు పలికారు. ఇండియా కూటమి 295 స్థానాల్లో గెలుస్తుందన్న రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. పేదల అభ్యునతి కోసం పాటు పడే మోదీని విమర్శించడం మాని క్షేత్ర స్థాయిలో పని చేసుకోవాలని సూచించారు. అప్పుడైనా ప్రతిపక్షాలు ప్రజల విశ్వాసాన్ని గెలుచుకునే అవకాశముందని చెప్పారు. NDA 400కు పైగా సీట్లు సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

News June 2, 2024

APPLY NOW.. 459 ప్రభుత్వ ఉద్యోగాలు

image

కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్‌(CDSE)కు దరఖాస్తుల స్వీకరణ ఎల్లుండితో ముగియనుంది. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్‌లో మొత్తం 459 ఖాళీలున్నాయి. CDSEలో ఎంపికైన వారికి శిక్షణ ఇచ్చి, ఉద్యోగంలోకి తీసుకుంటారు. అవివాహిత పురుషులు, మహిళలు జూన్ 4 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. విభాగాలను బట్టి డిగ్రీ, ఇంజినీరింగ్ పూర్తి చేసిన వారు దరఖాస్తుకు అర్హులు. వెబ్‌సైట్: upsc.gov.in

News June 2, 2024

భారత్‌తో మ్యాచ్ అంటే మాకూ టెన్షనే: బాబర్

image

భారత్‌తో మ్యాచ్ అంటే తమకూ కాస్త టెన్షనే అని పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ అన్నారు. ‘భారత్-పాక్ జట్ల మధ్య మ్యాచ్ ఎప్పుడు జరిగినా చర్చ భారీ స్థాయిలో ఉంటుంది. ఆటగాళ్లుగా మాకెంతో ఉత్సాహం ఉంటుంది. అదే సమయంలో తీవ్ర ఒత్తిడి ఉంటుంది. అయితే కూల్‌గా ఆడితే విజయం వరిస్తుందని నమ్ముతా. అందుకు తగ్గట్లుగా సాధన చేస్తాం’ అని చెప్పుకొచ్చారు. కాగా T20 WCలో భాగంగా ఇరు జట్ల మధ్య జూన్ 9న హైఓల్టేజ్ మ్యాచ్ జరగనుంది.