News January 11, 2025

ఎవరి మద్దతు కోరడం లేదు: DK శివకుమార్

image

క‌ర్ణాట‌క CM మార్పు ఊహాగానాల‌పై Dy.CM DK శివ‌కుమార్ స్పందించారు. సీఎంగా తన పేరు ప్రస్తావించాలని తాను ఎవ‌రిపైనా ఒత్తిడి చేయ‌డం లేద‌న్నారు. అలాగే తాను ఎవ‌రి మ‌ద్ద‌తూ కోరుకోవ‌డం లేద‌ని, MLAలు త‌న‌కు మ‌ద్ద‌తుగా ప్ర‌క‌ట‌న‌లు చేయాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు. ‘నేను క‌ర్మ‌నే న‌మ్ముకున్నా. ఫ‌లితాన్ని దేవుడికే వ‌దిలేస్తా. ఈ విష‌యంలో కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాల‌కు అనుగుణంగా పనిచేస్తా’ అని డికె పేర్కొన్నారు.

News January 11, 2025

సంక్రాంతికి AP లోడింగ్!

image

సంక్రాంతికి AP సిద్ధమవుతోంది. అక్కలు, బావలు, మామలు, అల్లుళ్ల రాకతో తెలుగు లోగిళ్లు పండుగ శోభను సంతరించుకుంటున్నాయి. కొత్త బట్టలు, పిండి వంటలు, రంగవల్లులు, కుర్రాళ్ల సరదాలు, స్నేహితుల గెట్ టుగెదర్లు, కొత్త సినిమాలు.. ఇలా సంబరాల సరదా జోరందుకుంది. వీటితో పాటు కోడి పందేలు, ఎద్దుల పోటీలు, జాతరలకై బరులు రెడీ అవుతున్నాయి. ఇప్పటికే చాలామంది స్వస్థలాలకు చేరుకోగా మిగిలినవారు రేపు, ఎల్లుండి చేరుకోనున్నారు.

News January 11, 2025

GMSను ఆకర్షణీయంగా మార్చండి: కేంద్రానికి వినతి

image

దిగుమతులు తగ్గించేందుకు ఇళ్లలో నిరుపయోగ బంగారాన్ని సాయంగా వాడుకోవాలని గోల్డ్ ట్రేడ్ బాడీస్ కేంద్రాన్ని కోరుతున్నాయి. ఇందుకోసం కొత్త బడ్జెట్లో గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చాలని అంటున్నాయి. గోల్డ్ డిపాజిట్లకు ఫ్లెక్సిబుల్ టెన్యూర్స్, ఎక్కువ వడ్డీరేట్లు ఇవ్వాలని, 500gr వరకు వారసత్వ బంగారం డిపాజిటుకు అవకాశమివ్వాలని, ట్యాక్స్ ఎంక్వైరీలు లేకుండా చూడాలని సూచించాయి.

News January 11, 2025

కారు రేసు నుంచి తప్పుకొన్న అజిత్

image

దుబాయ్‌లో జరిగే కార్ రేసులో పాల్గొనడం లేదని నటుడు అజిత్ ప్రకటించారు. ఇటీవల జరిగిన ప్రాక్టీస్ రేసులో ఆయన కారు ప్రమాదానికి గురైంది. అదృష్టవశాత్తూ ఆయన స్వల్పగాయాలతో బయటపడ్డారు. ఈ నేపథ్యంలో కారు రేసు నుంచి తాను వైదొలగుతున్నట్లు తెలిపారు. తన టీమ్ పోటీలో కొనసాగుతుందని స్పష్టతనిచ్చారు.

News January 11, 2025

మెజారిటీ దాడులు రాజకీయ ప్రేరేపితమే: బంగ్లా పోలీసులు

image

బంగ్లాదేశ్‌లో మైనారిటీల‌పై పెరిగిన దాడులు మ‌త‌ప‌ర‌మైన‌వి కాదని, అవి రాజ‌కీయ ప్రేరేపిత దాడుల‌ని పోలీసుల నివేదిక స్ప‌ష్టం చేస్తోంది. షేక్ హ‌సీనా దేశం విడిచాక 1,769 దాడులు జ‌రిగాయి. అందులో 1,234 పొలిటిక‌ల్లీ మోటివేటెడ్ కాగా, మ‌రో 20 మాత్ర‌మే మ‌త ప్రేరేపిత దాడుల‌ని పోలీసులు చెబుతున్నారు. అందులో 161 ఘ‌ట‌న‌లు అవాస్త‌వ‌మ‌ని తేల్చారు. దాడుల‌పై 62 కేసులు న‌మోదు చేసిన పోలీసులు 35 మందిని అరెస్టు చేశారు.

News January 11, 2025

వామ్మో.. హైదరాబాద్‌లో 13,028 పాములా!

image

అటవీప్రాంతంలో కనిపించాల్సిన పాములు హైదరాబాద్‌లో భారీగా గుర్తించడం చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ సొసైటీ (FOS) నగరంలో గతేడాది ఏకంగా 13,028 పాములను రక్షించింది. 2015లో 3,389 పాములను గుర్తిస్తే, పదేళ్లలో వీటి సంఖ్య 13,028కి చేరింది. ఇలా పదేళ్లలో 75వేలకు పైగా పాములను పట్టుకుంది. ఇందులో సగం కంటే ఎక్కువ కోబ్రాలే ఉండటం గమనార్హం.

News January 11, 2025

బాధితులకు రేపు పరిహారం: బీఆర్ నాయుడు

image

AP: తిరుపతి తొక్కిసలాట ఘటనలో మృతుల కుటుంబాలు, గాయపడ్డ బాధితులకు రేపటి నుంచి టీటీడీ పరిహారం అందించనుంది. టీటీడీ సభ్యులు జ్యోతుల నెహ్రూ, జంగా కృష్ణమూర్తి, పనబాక లక్ష్మి, జానకీ దేవి, మహేందర్ రెడ్డి, ఎంఎస్ రాజు, భాను ప్రకాశ్ రెడ్డి APలో.. మిగతా వారు తమిళనాడు, కేరళలో పర్యటించి పరిహారం అందిస్తారు. మృతుల కుటుంబాలకు రూ.25లక్షలు, తీవ్రంగా గాయపడ్డ వారికి రూ.5లక్షలు, స్వల్ప గాయాలైన వారికి రూ.2లక్షలు ఇస్తారు.

News January 11, 2025

మా కార్యకర్తల జోలికి వస్తే తగిన గుణపాఠం చెప్తాం: కేటీఆర్

image

యాదాద్రి భువనగిరి జిల్లాలో బీఆర్ఎస్ కార్యాలయంపైన జరిగిన దాడిని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు. అది కాంగ్రెస్ గూండాల దాడి అని ఆరోపించారు. ‘మా పార్టీ కార్యకర్తలు, నాయకుల జోలికి వస్తే తగిన గుణపాఠం చెప్తాం. రాష్ట్రంలో కాంగ్రెస్ గూండారాజ్యం నడుస్తోంది. ఆ పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెబుతారు. దాడికి పాల్పడిన గూండాలను వెంటనే అరెస్ట్ చేయాలి’ అని ట్విటర్లో డిమాండ్ చేశారు.

News January 11, 2025

ప్రముఖ నటుడికి బ్రెయిన్ స్ట్రోక్

image

ప్రముఖ హిందీ నటుడు, కమెడియన్ టీకూ తల్సానియా(70) బ్రెయిన్ స్ట్రోక్‌కు గురైనట్లు భార్య దీప్తి వెల్లడించారు. ప్రస్తుతం ముంబైలోని ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ఆయనకు గుండెపోటు అంటూ వచ్చిన వార్తలను ఖండించారు. 1986లో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన టీకూ దాదాపు 200 చిత్రాలు, 11 సీరియళ్లలో కీలక పాత్రలు పోషించారు. ఆయన కూతురు శిఖ కూడా సత్యప్రేమ్ కీ కథ, వీర్ దీ వెడ్డింగ్ లాంటి చిత్రాల్లో నటించారు.

News January 11, 2025

వైసీపీ హయాంలో పోలవరం ధ్వంసం: రామానాయుడు

image

AP: పోలవరం ప్రాజెక్టును YCP సర్కార్ 20 ఏళ్లు వెనక్కి నెట్టిందని మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. ఏడాదిన్నర కష్టపడి డయాఫ్రం వాల్ నిర్మిస్తే YCP దానిని ధ్వంసం చేసిందని మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వచ్చిన పార్లమెంటరీ కమిటీకి ఆయన స్వాగతం పలికారు. 2014-19 మధ్య పోలవరం ప్రాజెక్టు 72 శాతం పనులు పూర్తి చేశామన్నారు. సీఎం ఇచ్చిన షెడ్యూల్ ప్రకారమే పోలవరాన్ని పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.