News September 29, 2024

కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన బ్రూక్

image

ఆస్ట్రేలియాతో 5 వన్డేల సిరీస్‌లో ఇంగ్లండ్ జట్టు కెప్టెన్ హ్యారీ బ్రూక్ అదరగొట్టారు. వరుసగా 39, 4, 110*, 87, 72(మొత్తం 312) పరుగులు చేశారు. ఈ క్రమంలో ద్వైపాక్షిక సిరీస్‌లో ఆసీస్‌పై అత్యధిక పరుగులు(310) చేసిన కెప్టెన్‌గా కోహ్లీ పేరిట ఉన్న రికార్డును బద్దలుకొట్టారు. ఆ జట్టుపై ఓ సిరీస్‌లో ధోనీ 285, మోర్గాన్ 278, బాబర్ 276, డివిలియర్స్ 271, ఆండ్రూ స్ట్రాస్ 267 రన్స్ చేశారు.

News September 29, 2024

రేపు, ఎల్లుండి మూసీ పరీవాహకంలో కేటీఆర్ పర్యటన

image

TG: BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రేపు, ఎల్లుండి హైదరాబాద్ నగరంలోని మూసీ పరీవాహక ప్రాంతాల్లో పర్యటించనున్నారు. 72 గంటల తర్వాత జ్వరం తగ్గిందని.. సోమ, మంగళవారాల్లో రాజేంద్రనగర్, అంబర్‌పేట నియోజకవర్గ పరిధిలో పర్యటిస్తానని తెలిపారు. బుల్డోజర్ బెదిరింపులను సాధ్యమైనంత వరకు అరికట్టాలని, దాని కోసం తాము చేయగలిగినంత వరకు చేస్తామని పేర్కొన్నారు.

News September 29, 2024

వీరోచితం: చనిపోయే ముందు ఉగ్రవాదిని అంతం చేశాడు!

image

తాను చనిపోయే స్థితిలో ఉన్నా కనీసం ఒక్క ఉగ్రవాదినైనా వెంట తీసుకుపోవాలనుకున్నారాయన. తూటా దెబ్బకి ఒళ్లంతా రక్తమోడుతున్నా ఓ ముష్కరుడిని హతమార్చాకే కన్నుమూశారు. కశ్మీర్‌లోని శ్రీనగర్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న బషీర్ అహ్మద్‌దీ వీరగాథ. మండ్లీ ప్రాంతంలో ఉగ్రవాదులకు, పోలీసులకు మధ్య జరిగిన కాల్పుల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. అమరవీరుడైన బషీర్‌కు రాష్ట్ర పోలీసు శాఖ ఘన నివాళులర్పించింది.

News September 29, 2024

‘ఆదిపురుష్‌’పై ట్రోలింగ్ వల్ల ఏడ్చాను: రచయిత

image

ఎన్నో అంచనాల మధ్య రిలీజైన ఆదిపురుష్ సినిమా ఫ్యాన్స్‌ను నిరాశపరిచిన సంగతి తెలిసిందే. ఆ మూవీపై నెట్టింట జరిగిన ట్రోలింగ్ సినిమా టీమ్ అందర్నీ ప్రభావితం చేసిందని గేయ, మాటల రచయిత మనోజ్ ముంతషీర్ తెలిపారు. ‘ట్రోలింగ్‌తో ఏడ్చాను. కోలుకోవడానికి చాలా సమయం పట్టింది. జీవితంలో ఏదీ శాశ్వతం కాదని అర్థమైంది. తిరిగి నిలదొక్కుకునేందుకు ట్రై చేస్తున్నా’ అని పేర్కొన్నారు.

News September 29, 2024

రాత్రి ఆటో ఎక్కిన మహిళా ఏసీపీ.. తర్వాతేమైందంటే..

image

సుకన్య శర్మ ఆగ్రాలో ఏసీపీగా పనిచేస్తున్నారు. మహిళల భద్రత ఎలా ఉందో చూసేందుకు స్వయంగా రాత్రివేళ రంగంలోకి దిగారు. ముందుగా పోలీసు కంట్రోల్ రూమ్‌కి కాల్ చేశారు. వారు సక్రమంగా రెస్పాండ్ అవుతున్నట్లు గుర్తించారు. అనంతరం సామాన్యురాలిలా ఓ ఆటో ఎక్కారు. సదరు డ్రైవర్ ఆమె చెప్పిన చోట క్షేమంగా దించాడు. మహిళల భద్రతా పరిశీలన కోసం ఆమె ఇలా స్వయంగా రంగంలోకి దిగడంపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి.

News September 29, 2024

టికెట్ లేకున్నా శ్రీవారిని దర్శించుకోండిలా..!

image

కొంతమందికి అప్పటికప్పుడు తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలనిపిస్తుంది. సాధారణంగా 2, 3 నెలల ముందే దర్శనానికి టికెట్లు బుక్ చేసుకుంటారు. బుక్ చేసుకోనివారి కోసం TTD గత కొన్నేళ్లుగా టైమ్ స్లాటెడ్ సర్వ దర్శనం (SSD) విధానాన్ని అమలు చేస్తోంది. రోజూ ఉదయం 3 గంటలకు తిరుపతిలోని విష్ణు నివాసం, శ్రీనివాసం కాంప్లెక్స్, భూదేవి కాంప్లెక్స్ వద్ద టికెట్లు ఇస్తారు. వీటిని తీసుకొని ఆ టైమ్‌లో దర్శనానికి వెళ్లొచ్చు.

News September 29, 2024

రేపు మ.2 గంటలకు ‘రా మచ్చా మచ్చా’

image

శంకర్ డైరెక్షన్‌లో రామ్ చరణ్- కియారా జంటగా నటిస్తున్న ‘గేమ్ ఛేంజర్’ మూవీలోని సెకండ్ సింగిల్ ‘రా మచ్చా మచ్చా’ రిలీజ్‌పై మరో అప్డేట్‌ను మేకర్స్ వెల్లడించారు. రేపు మధ్యాహ్నం 2 గంటలకు కొంపల్లిలోని సెయింట్ మార్టిన్ ఇంజినీరింగ్ కాలేజీలో ఈ ఈవెంట్ జరుగుతుందని తెలిపారు. నిన్న విడుదలైన ప్రోమోకు అభిమానుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఈ చిత్రానికి తమన్ మ్యూజిక్ అందిస్తున్న విషయం తెలిసిందే.

News September 29, 2024

తిరుమలలో రూ.కోటి ‘ఉదయాస్తమానసేవ’ గురించి తెలుసా?

image

AP: టీటీడీ వెబ్‌సైట్‌లో ఈ టికెట్లు అందుబాటులో ఉంటాయి. రూ.కోటితో కొనుగోలు చేస్తే రాబోయే 25 ఏళ్ల పాటు ఏడాదిలో ఏదైనా ఒక తేదీని ఎంచుకుని శ్రీవారి సేవల్లో పాల్గొనవచ్చు. సుప్రభాత సేవ, తోమాల, అర్చన, ఊంజల్ సేవ, సహస్ర కలశాభిషేకం, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ లాంటి సేవలు ఉంటాయి. ఆదాయపు పన్ను సెక్షన్ 80G కింద పన్ను మినహాయింపూ పొందొచ్చు. ప్రత్యేక కాటేజీ ఉచితంగా ఇస్తారు. పూర్తి వివరాలకు <>సైట్<<>> చూడండి.

News September 29, 2024

GOOD NEWS: రైల్వేలో 14,298 ఉద్యోగాలు

image

నిరుద్యోగులకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. 9,144 టెక్నీషియన్ పోస్టులకు మార్చిలో నోటిఫికేషన్ ఇవ్వగా, తాజాగా వాటిని పెంచింది. 40 కేటగిరీల్లో 14,298 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. OCT 2 నుంచి 16 వరకు అప్లై చేసుకోవచ్చంది. గతంలో దరఖాస్తు చేసుకున్నవారికి ఎడిట్ ఆప్షన్‌ ఇస్తామని, కొత్త పోస్టులకూ అప్లై చేసుకోవచ్చని పేర్కొంది. పూర్తి వివరాలకు ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.
వెబ్‌సైట్: rrbapply.gov.in

News September 29, 2024

రాజ్యసభ రేసులో నాగబాబు?

image

AP: ఇటీవల మోపిదేవి వెంకటరమణ, మస్తాన్‌రావు, కృష్ణయ్య రాజ్యసభ సభ్యత్వాలకు రాజీనామా చేయడంతో ఖాళీ అయిన 3 సీట్లూ NDAకే దక్కనున్నాయి. వీటిలో 2 TDP, ఒకటి JSP పంచుకుంటాయని వార్తలు వస్తున్నాయి. TDP నుంచి అశోక్ గజపతిరాజు, యనమల రామకృష్ణుడు, దేవినేని ఉమ పేర్లు ప్రముఖంగా వినిపిస్తుండగా, జనసేన నుంచి నాగబాబు రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. BJP అధిష్ఠానం తమకూ ఓ సీటు అడగొచ్చని సమాచారం.