News June 1, 2024

CVoter: బెంగాల్‌లో TMCకి BJP షాక్!

image

పశ్చిమ బెంగాల్‌ పార్లమెంట్ ఎన్నికల్లో ఈసారి అధికార TMCకి BJP షాక్ ఇచ్చే అవకాశం ఉందని ABP CVoter ఎగ్జిట్ పోల్ అభిప్రాయపడింది. ఆ రాష్ట్రంలో బీజేపీకి 23-27 సీట్లు వస్తాయని అంచనా వేసింది. సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీకి 13-17 సీట్లు, కాంగ్రెస్ పార్టీకి 1-3 సీట్లు దక్కే ఛాన్స్ ఉందని పేర్కొంది.

News June 1, 2024

370కి పైగా సీట్లు గెలుస్తాం: నడ్డా

image

దేశంలో ఎన్నికలు సమర్థంగా నిర్వహించినందుకు ఎలక్షన్ కమిషన్‌కు బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా ధన్యవాదాలు తెలిపారు. ఇక తాము 370కి పైగా సీట్లు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఎన్డీఏ కూటమి 400కు పైగా స్థానాల్లో గెలుస్తుందన్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలో పార్టీ తరఫున ప్రచారంలో పాల్గొన్న ప్రతి కార్యకర్తకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు నడ్డా పేర్కొన్నారు.

News June 1, 2024

వైసీపీకి షాక్ ఇచ్చిన హైకోర్టు

image

APలో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుపై <<13351074>>వైసీపీ <<>>దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. పోస్టల్ బ్యాలెట్ ఓటుపై సీలు లేకున్నా కౌంటింగ్‌కు అర్హత ఉంటుందని ఈసీ ఇచ్చిన వివరణతో ఏకీభవించిన కోర్టు వైసీపీ పిటిషన్‌ను తోసిపుచ్చింది.

News June 1, 2024

దేశ రాజధానిలో బీజేపీ విక్టరీ: ఇండియా టుడే

image

ఢిల్లీలో అధికార ఆమ్ ఆద్మీ పార్టీకి షాక్ తగలనున్నట్లు ఇండియా టుడే సర్వే అంచనాలను విడుదల వేసింది. రాజధానిలోని మొత్తం ఏడు లోక్‌సభ సీట్లకు గాను బీజేపీ 6 నుంచి 7 సీట్లలో విజయకేతనం ఎగురవేస్తుందని అంచనా వేసింది. ఇండియా కూటమి(ఆప్, కాంగ్రెస్) 0-1 చతికిలపడుతుందని వెల్లడించింది.

News June 1, 2024

ఎగ్జిట్ పోల్స్.. మోదీ హ్యాట్రిక్

image

కేంద్రంలో మూడోసారి అధికారం చేపట్టి నరేంద్ర మోదీ హ్యాట్రిక్ కొట్టబోతున్నారని ఎగ్జిట్ పోల్స్‌లో పలు సర్వే సంస్థలు అంచనా వేశాయి. NDAకు 365 సీట్లు వస్తాయని NDTV పేర్కొంది. INDIA కూటమి 142 స్థానాలకే పరిమితం కానుందని చెప్పింది. ఇతరులు 36 సీట్లు గెలుచుకుంటారని వెల్లడించింది. జన్ కీ బాత్- 362-392(NDA), రిపబ్లిక్ భారత్ మ్యాట్రిజ్- 353-368, న్యూస్ నేషన్ 342-378 సీట్లు సాధిస్తాయని పేర్కొన్నాయి.

News June 1, 2024

TDPకి 22 ఎంపీ సీట్లు: టుడేస్ చాణక్య

image

ఏపీలోని 25 లోక్‌సభ స్థానాల్లో కూటమికి 22 ఎంపీ స్థానాలు వస్తాయని టుడేస్ చాణక్య సర్వే వెల్లడించింది. వైసీపీకి 3 స్థానాలు రావొచ్చని అంచనా వేసింది. టీడీపీకి 3 ఎంపీ స్థానాలు తగ్గితే.. ఆయా చోట్ల వైసీపీ గెలవొచ్చని అభిప్రాయపడింది. అటు తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 12 సీట్లు, కాంగ్రెస్ 5 స్థానాల్లో విజయం సాధిస్తాయని ఈ సంస్థ తన సర్వే ఫలితాన్ని వెల్లడించింది.

News June 1, 2024

D-DYNAMICS: ఎన్డీయేదే అధికారం!

image

దేశంలో మరోసారి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి అధికారం చేపడుతుందని ఇండియా న్యూస్ D-DYNAMICS ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. ఎన్డీయే కూటమికి 371, ఇండియా కూటమికి 125, ఇతరులకు 47 సీట్లు వస్తాయని అంచనా వేసింది.

News June 1, 2024

ఎగ్జిట్ పోల్స్‌కు మించి ఫలితాలు: సజ్జల

image

AP: ఎగ్జిట్ పోల్స్ ప్రకారం తమకే అధికారం వస్తుందని వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ‘జూన్ 4న దీనికి మించి ఫలితాలు వస్తాయి. మహిళలు వైసీపీకి అండగా నిలిచారు. చాలా సైలెంట్‌గా వైసీపీకి ప్రజలు ఓట్లు వేశారు. అన్ని పార్టీలు ఏకమైనా వాళ్లు గెలవడం లేదు. ఎందుకు అధికారంలోకి రాలేకపోతున్నారో వాళ్లు ఆలోచించుకోవాలి’ అని హితవు పలికారు.

News June 1, 2024

ఏపీలో కూటమికి అత్యధిక సీట్లు: ఇండియా టీవీ CNX

image

ఏపీలో కూటమి 20 నుంచి 23 లోక్‌సభ సీట్లు సాధిస్తుందని ఇండియా టీవీ సీఎన్ఎక్స్ సర్వే అంచనా వేసింది. టీడీపీ 13 నుంచి 15, వైసీపీ 3-5, బీజేపీ 4-6, జనసేన 2 సీట్లు సాధిస్తాయని వెల్లడించింది. కాంగ్రెస్ ఒక్క సీటులోనూ నెగ్గదని పేర్కొంది.

News June 1, 2024

కమలం పార్టీదే అధికారం: Dainik Bhaskar

image

దేశంలో మరోసారి కమలం పార్టీనే అధికారం చేపడుతుందని Dainik Bhaskar సర్వే తేల్చింది. ఈ ఎన్నికల్లో ఎన్డీఏకు 281-350, ఇండియా కూటమికి 145-201, ఇతరులకు 33-49 సీట్లు వస్తాయని అంచనా వేసింది. పలు రాష్ట్రాల్లో ఎన్డీఏ, ఇండియా కూటమి మధ్య టఫ్ ఫైట్ సాగినట్లు తెలిపింది.