News November 19, 2024

రైల్వే స్టేషన్లో రద్దీని తలపించిన విమానాశ్రయాలు!

image

పండగల వేళ రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు ఎలా కిటకిటలాడతాయో ఓసారి గుర్తు చేసుకోండి! NOV 17న దేశవ్యాప్తంగా విమానాశ్రయాల పరిస్థితి ఇదేనంటే ఆశ్చర్యమేమీ లేదు. ఆరోజు ఏకంగా 5.05లక్షల మంది ప్రయాణించారు. దీంతో ఎయిర్‌పోర్టు లాంజుల్లో చోటు సరిపోక చాలామంది కిందే కూర్చున్నారు. ఇక టికెట్ కౌంటర్లు, ₹400 ఖరీదైన దోసెల క్యూలైన్ ఆగిందే లేదని కొందరు సెటైర్లు వేస్తున్నారు. ఫెస్టివ్, వెడ్డింగ్ సీజన్ కావడమే దీనికి కారణం.

News November 19, 2024

రాష్ట్రపతి దృష్టికి లగచర్ల ఘటన

image

TG: వికారాబాద్ జిల్లా లగచర్ల వ్యవహారం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము వద్దకు చేరింది. ఆమె అపాయింట్‌మెంట్ కోసం లగచర్ల ఫార్మా బాధిత కుటుంబాలు ఢిల్లీలో వెయిట్ చేస్తున్నాయి. ఇప్పటికే ఇక్కడి భూసేకరణకు సంబంధించిన అంశాలను బీఆర్ఎస్ నేతలు రాష్ట్రపతి కార్యాలయం దృష్టికి తీసుకెళ్లారు. అక్రమ అరెస్టులపై ఎస్సీ, ఎస్టీ, మహిళా, జాతీయ మానవహక్కుల కమిషన్‌లను కలిసి బాధితులు ఫిర్యాదు చేశారు.

News November 19, 2024

OTTలోకి వచ్చేసిన థ్రిల్లర్ మూవీ

image

మలయాళ థ్రిల్లర్ మూవీ ‘కిష్కింధ కాండం’ ఓటీటీలోకి వచ్చేసింది. అర్ధరాత్రి నుంచి డిస్నీ+హాట్‌స్టార్‌లో తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీలో అసిఫ్ అలీ, అపర్ణ బాలమురళి, విజయ రాఘవన్ ప్రధాన పాత్రల్లో నటించారు. కేవలం రూ.7 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా దాదాపు రూ.70 కోట్లు వసూలు చేసింది. ఈ ఏడాది మలయాళంలో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్-10 చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.

News November 19, 2024

వరంగల్ దశ,దిశ మార్చేందుకు వస్తున్నా: రేవంత్

image

వరంగల్ బయల్దేరిన CM రేవంత్ ‘X’లో పోస్ట్ చేశారు. ‘తెలంగాణ చైతన్య రాజధాని, కాళోజీ నుంచి పీవీ వరకు మహనీయులను తీర్చిదిద్దిన నేల. స్వరాష్ట్ర సిద్ధాంతకర్త జయశంకర్ సార్‌కు జన్మనిచ్చిన గడ్డ. హక్కుల కోసం పోరాడిన సమ్మక్క, సారలమ్మలు నడయాడిన ప్రాంతం. దోపిడీకి వ్యతిరేకంగా పిడికిలి బిగించిన చాకలి ఐలమ్మ యుద్ధ క్షేత్రం వరంగల్. వీరి స్ఫూర్తితో మన భవిత కోసం వరంగల్ దశ,దిశ మార్చేందుకు వస్తున్నా’ అని పేర్కొన్నారు.

News November 19, 2024

రూ.100 కోట్ల సైబర్ ఫ్రాడ్‌స్టర్ అరెస్ట్: APతో లింక్

image

వాట్సాప్ గ్రూపుల ద్వారా ఆన్‌లైన్ స్టాక్ ట్రేడింగ్ స్కామ్‌లకు పాల్పడ్డ చైనా పౌరుడు ఫాంగ్ చెంజిన్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. రూ.43.5 లక్షల మోసం కేసులో దర్యాప్తు ఆరంభించిన పోలీసులు అతడి స్కామ్‌ల విలువ రూ.100 కోట్లు దాటేసినట్టు కనుగొన్నారు. ముఖ్యంగా AP, UPల్లో సైబర్ క్రైమ్స్, మనీలాండరింగ్‌కు పాల్పడినట్టు గుర్తించారు. CCPలో అతడిపై నమోదైన 17 కేసులు ఫిన్‌కేర్ బ్యాంక్ A/Cకు లింకైనట్టు తెలిపారు.

News November 19, 2024

పౌరసత్వాన్ని వదులుకొని..!

image

మెరుగైన అవకాశాలు, సౌకర్యాల కోసం ఏటా చాలా మంది భారతీయులు పౌరసత్వాన్ని వదులుకొని ఇతర దేశాలకు పయనమవుతున్నారు. అయితే, వారు వెళ్లిపోవడానికి కొన్ని ముఖ్య కారణాలున్నాయి. అవేంటంటే.. స్వచ్ఛమైన గాలి & నీరు, నాణ్యమైన ప్రభుత్వ విద్య, మెరుగైన మౌలిక సదుపాయాలు, హైక్లాస్ ప్రజా రవాణా అని నిపుణులు చెబుతున్నారు. 2023లో 2.16 లక్షల మంది భారతీయులు పౌరసత్వాన్ని వదులుకోవడం గమనార్హం.

News November 19, 2024

దేశం కోసం ఇందిరా గాంధీ ప్రాణాలర్పించారు: భట్టి

image

TG: మాజీ ప్రధాని ఇందిరా గాంధీపై నెగటివ్ సినిమాలు తీసే వారికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కౌంటర్ ఇచ్చారు. దేశ సమగ్రతపై అవగాహన లేని వారు, గతం గురించి తెలియని వారు ఇందిరా గాంధీ చరిత్రను వక్రీకరిస్తారని అన్నారు. గతం గురించి తెలిసిన వారు ఇందిరా గాంధీకి చేతులెత్తి నమస్కరిస్తారని తెలిపారు. దేశ సమగ్రత కోసం తన ప్రాణాలను తృణప్రాయంగా అర్పించారని భట్టి కొనియాడారు.

News November 19, 2024

గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడమే మా ధ్యేయం: పవన్

image

AP: చెత్త నుంచి సంపద సృష్టి కేంద్రాల నిర్వహణకు నిధులు ఇచ్చామని dy.CM పవన్ కళ్యాణ్ తెలిపారు. ఇందుకోసం 15వ ఫైనాన్స్ నిధులు కేటాయించామని చెప్పారు. శాసనమండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. ‘గ్రామాలను స్వచ్ఛంగా ఉంచడం మా బాధ్యత. ఇందుకోసం చెత్త నుంచి సంపద సృష్టి కేంద్రాలను సమర్థంగా నిర్వహిస్తాం. ప్రతీ మండల కేంద్రంలో ఓ డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తాం’ అని ఆయన పేర్కొన్నారు.

News November 19, 2024

కృత్రిమ వర్షం కురిపించండి.. కేంద్రానికి మంత్రి రిక్వెస్ట్

image

ఢిల్లీలో తీవ్ర కాలుష్యం ఉందని, ఇందుకు కృత్రిమ వర్షమే ఏకైక పరిష్కారం అని ఆ రాష్ట్ర పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ తెలిపారు. ప్రధాని మోదీ జోక్యం చేసుకుని కాలుష్య నియంత్రణకు చర్యలు తీసుకోవాలని కోరారు. కృత్రిమ వర్షంపై గత 3 నెలలుగా కేంద్రానికి లేఖలు రాస్తున్నా పట్టించుకోవడం లేదని వాపోయారు. దీనిపై కేంద్ర పర్యావరణశాఖ అత్యవసర సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

News November 19, 2024

బుల్స్ బ్యాటింగ్: 1000 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్

image

దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. నిఫ్టీ 300, సెన్సెక్స్ 1000 పాయింట్లకు పైగా ఎగిశాయి. దీంతో ఇన్వెస్టర్ల సంపద రూ.6లక్షల కోట్లమేర పెరిగింది. గ్లోబల్ మార్కెట్ల నుంచి పాజిటివ్ సిగ్నల్స్, డాలర్ దూకుడు తగ్గడం, FIIలు తిరిగొస్తుండటమే ఇందుకు కారణాలు. బ్యాంకింగ్, మీడియా, రియాల్టి, కన్జూమర్ డ్యురబుల్స్, O&G షేర్లకు డిమాండ్ పెరిగింది. 200DEMA లెవల్ నుంచి నిఫ్టీ బౌన్స్‌బ్యాక్ అయింది.