News June 1, 2024

చివరి దశ పోలింగ్.. అత్యల్పం, అత్యధికం ఎక్కడంటే?

image

సార్వత్రిక ఎన్నికలు-2024లో భాగంగా చివరి దశ పోలింగ్ ముగిసింది. ఇందులో బెంగాల్‌ 69.89% పోలింగ్‌తో అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాత ఝార్ఖండ్(67.95%), హిమాచల్ ప్రదేశ్(66.56%), చండీగఢ్(62.80%), ఒడిశా(62.46%), పంజాబ్(55.20%), యూపీ(54%) పోలింగ్ నమోదైంది. బిహార్‌లో(48.86%) అత్యల్పంగా ఓటేశారు.

News June 1, 2024

ఎగ్జిట్ పోల్స్.. బీఆర్ఎస్‌కు 0 సీట్లు

image

తెలంగాణలో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్.. లోక్‌సభ ఎన్నికల్లోనూ ప్రభావం చూపలేదని ఎగ్జిట్ పోల్స్‌లో పలు సంస్థలు అంచనా వేశాయి. ఆ పార్టీ ఒక్క ఎంపీ సీటు కూడా దక్కించుకునే అవకాశం లేదని ABP-C VOTER, ఆరా మస్తాన్ సంస్థలు వెల్లడించాయి. 0-1 స్థానం గెలిచే ఛాన్స్ ఉందని ఇండియా టీవీ-CNX, పీపుల్స్ పల్స్, జన్ కీ బాత్ అభిప్రాయపడ్డాయి.

News June 1, 2024

బీజేపీ ఖాతాలోకే బిహార్: India Today

image

బిహార్‌లో బీజేపీ ప్రభంజనం సృష్టిస్తుందని India Today Axis My India తెలిపింది. 40 సీట్లకు గానూ ఎన్డీఏ: 29-33, ఇండియా: 07-10 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని అంచనా వేసింది. ఆయా పార్టీలకు సొంతంగా బీజేపీ: 13-15, జేడీయూ: 9-11, ఆర్జేడీ: 6-7, కాంగ్రెస్: 1-2, చిరాగ్ పార్టీకి 5 సీట్లు వచ్చే ఛాన్స్ ఉందని తెలిపింది.

News June 1, 2024

బెంగాల్‌లో BJP, TMC మధ్య టఫ్ ఫైట్

image

పశ్చిమబెంగాల్‌లో బీజేపీ, టీఎంసీ మధ్య హోరాహోరీ పోరు సాగినట్లు NDTV Jan Ki Baat తెలిపింది. ఈ ఎన్నికల్లో బీజేపీ: 21-26, టీఎంసీ: 18-16, కాంగ్రెస్: 0-2, సీపీఎం: 0-1 గెలిచే అవకాశం ఉందని ఆ సర్వే సంస్థ అంచనా వేసింది.

News June 1, 2024

కేంద్రంలో బీజేపీదే అధికారం: జన్ కీ బాత్

image

కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి విజయదుందుభి మోగిస్తుందని జన్ కీ బాత్ సర్వే ప్రకటించింది. ఎన్డీఏ-377, ఇండియా కూటమి-151, ఇతరులు-15 సీట్లు సాధిస్తాయని అంచనా వేసింది. ఇటు మ్యాట్రిజ్ సంస్థ.. ఎన్డీఏ-353-368, ఇండియా కూటమి- 118-133, ఇతరులు- 43-48 సాధిస్తాయని వెల్లడించింది.

News June 1, 2024

TIMES NOW: హరియాణాలో BJP 7, INDIA 3

image

హరియాణాలో బీజేపీ 7 పార్లమెంటు స్థానాల్లో విజయం సాధిస్తుందని టైమ్స్ నౌ సర్వే అంచనా వేసింది. ఇండియా కూటమి 3 సీట్లకు మాత్రమే పరిమితమవుతుందని పేర్కొంది. INLD(ఇండియన్ నేషనల్ లోక్‌దళ్), JJP(జన్‌నాయక్ జనతా పార్టీ)లకు ఒక్క సీటు కూడా వచ్చే అవకాశం లేదంది.

News June 1, 2024

వైసీపీలో ఈ మంత్రులకు ఓటమి: ఆరా మస్తాన్

image

AP అసెంబ్లీ ఎన్నికల్లో మంత్రులు రోజా(నగరి), అప్పలరాజు(పలాస), గుడివాడ అమర్నాథ్(గాజువాక), నాగేశ్వరరావు(తణుకు), చెల్లుబోయిన వేణు(రాజమండ్రి.R), ఆదిమూలపు సురేశ్(కొండేపి) ఉషశ్రీ (పెనుకొండ), విడదల రజనీ(గుంటూరు పశ్చిమ), సత్యనారాయణ(తాడేపల్లిగూడెం) ఓడిపోతారని ఆరా మస్తాన్ అంచనా వేశారు. ధర్మాన ప్రసాద్(శ్రీకాకుళం), జోగి రమేశ్(పెనుమలూరు), అంబటి రాంబాబు(సత్తెనపల్లి) గట్టి పోటీ ఎదుర్కొన్నారని ప్రకటించారు.

News June 1, 2024

రిపబ్లిక్ టీవీ-మ్యాట్రిజ్ ఎగ్జిట్ పోల్: NDAకు 360 సీట్లు!

image

కేంద్రంలో మరోసారి NDA కూటమి అధికారం చేపడుతుందని రిపబ్లిక్ టీవీ-మ్యాట్రిజ్ ఎగ్జిట్ పోల్ వెల్లడించింది. ఆ కూటమికి 353-368 సీట్లతో స్పష్టమైన మెజారిటీ వచ్చే అవకాశం ఉందని తెలిపింది. ఇండియా కూటమి 118-133 సీట్లకే పరిమితమవుతుందని తెలిపింది.

News June 1, 2024

YCPకి 14 సీట్లే వస్తాయి: KK సర్వే

image

గత ఎన్నికల్లో YCP గెలుపుపై అత్యంత ఖచ్చిత అంచనాలు వెల్లడించిన KK సర్వే సంచలన ఎగ్జిట్ పోల్ ప్రకటించింది. ఏపీలో జగన్ పార్టీ కేవలం 14 స్థానాలకే పరిమితం కావచ్చని అంచనా వేసింది. ఇదే సమయంలో TDP-133, జనసేన- 21, BJP-7 చోట్ల విజయం సాధించవచ్చని తెలిపింది. మొత్తంగా కూటమి అధికారంలోకి వస్తుందన్న KK సర్వే జనసేన పోటీ చేసిన అన్నిచోట్ల గెలుస్తుందని ప్రకటించడం గమనార్హం.

News June 1, 2024

తెలంగాణలో బీజేపీ జోరు: జన్ కీ బాత్

image

తెలంగాణలో అధికార కాంగ్రెస్ కంటే బీజేపీకి అధిక లోక్‌సభ సీట్లు దక్కొచ్చని జన్ కీ బాత్, ఇండియా టీవీ CNX సర్వేలు వెల్లడించాయి. ఇండియా టీవీ CNX: కాంగ్రెస్: 6-8, బీజేపీ: 8-10, బీఆర్ఎస్: 0-1, జన్ కీ బాత్.. కాంగ్రెస్: 4-7, బీజేపీ: 9-12, బీఆర్ఎస్: 0-1 సీట్లు సాధిస్తాయని అంచనా వేశాయి. కాగా తెలంగాణలో 17 లోక్‌సభ సీట్లున్నాయి.