News June 1, 2024

తెలంగాణలో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్: TV9 సర్వే

image

తెలంగాణలో ఈసారి బీఆర్ఎస్ కేవలం ఒకే స్థానానికి పరిమితం కావచ్చని TV9 చెబుతోంది. ఇక కాంగ్రెస్ 8 స్థానాల్లో విజయం సాధించవచ్చని అంచనా వేస్తోంది. ఇదే సమయంలో గత లోక్‌సభ ఎన్నికల్లో 4 సీట్లు పొందిన బీజేపీ ఈసారి 7 చోట్ల గెలుస్తుందని ఎగ్జిట్‌పోల్ రిజల్ట్ వెల్లడించింది. హైదరాబాద్ స్థానంలో అసదుద్దీన్ గెలుస్తారని అంచనా వేస్తోంది.

News June 1, 2024

ఎగ్జిట్ పోల్స్‌‌పై నేతల ఆరా

image

AP: ఎగ్జిట్ పోల్స్‌ ఫలితాలపై ప్రధాన పార్టీల అధినేతలు దృష్టి సారించారు. సోషల్ మీడియా వేదికగా పలు సంస్థలు తమ అంచనా ఫలితాలను వెల్లడిస్తుండటంతో తాడేపల్లిలోని తన నివాసంలో సీఎం జగన్ ఆరా తీస్తున్నారు. హైదరాబాద్ నివాసం‌లో పార్టీ నేతల మధ్య చంద్రబాబు ఈ ఫలితాలను నిశితంగా గమనిస్తున్నారు. కాసేపట్లో అన్ని ప్రధాన సంస్థలు తమ ఎగ్జిట్ పోల్స్‌ను వెల్లడించనున్నాయి.

News June 1, 2024

అవమానించారు.. వేడుకల్లో పాల్గొనం: KCR

image

TG: ప్రభుత్వం నిర్వహిస్తున్న రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో తమ పార్టీ పాల్గొనదని BRS అధినేత కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్‌కు లేఖ రాసిన ఆయన.. ‘తెలంగాణ అస్తిత్వాన్ని అవమానిస్తున్న కాంగ్రెస్ పోకడలను నిరసిస్తున్నాం. ఇకనైనా వైఖరి మార్చుకుని సంక్షేమం కోసం పాటుపడాలి. బీఆర్ఎస్‌ను రాష్ట్ర ప్రభుత్వం అడుగడుగునా అవమానించింది’ అని పేర్కొన్నారు.

News June 1, 2024

ఎగ్జిట్ పోల్స్‌ చర్చల్లో పాల్గొంటాం: పవన్ ఖేరా

image

ఎగ్జిట్ పోల్స్‌పై టీవీల్లో జరగనున్న చర్చా కార్యక్రమంలో పాల్గొనాలని నిర్ణయించినట్లు ఏఐసీసీ అధికార ప్రతినిధి పవన్ ఖేరా తెలిపారు. ‘ఈ విషయమై కూటమి సమావేశంలో చర్చించాం. బీజేపీ ప్రీ ఫిక్స్‌డ్ ఎగ్జిట్ పోల్స్‌ను బహిర్గతం చేయాల్సిన అవసరం ఉందని నేతలు అభిప్రాయపడ్డారు. ఇండియా కూటమి పార్టీలు చర్చల్లో పాల్గొంటాయి’ అని ఆయన ట్వీట్ చేశారు. కాగా TV చర్చల్లో పాల్గొనమంటూ పవన్ ఖేరా నిన్న ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.

News June 1, 2024

సార్వత్రిక సంగ్రామం.. ఎవరు ఎంట్రీ? ఎవరు ఎగ్జిట్?

image

మరికాసేపట్లో ఎగ్జిట్ పోల్స్‌ వెలువడనున్నాయి. సుమారు 2నెలల నుంచి జరిగిన సార్వత్రిక ఎన్నికల సంగ్రామంలో ఎవరు విజేతగా నిలవనున్నారు? ఎవరు ‘ఎగ్జిట్’ కానున్నారు? అనే అంచనాలు రివీల్ కానున్నాయి. దీంతో ఎగ్జిట్ పోల్స్ తమకు అనుకూలంగా వస్తాయా? లేదా? అని పార్టీల శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. కేంద్రం, APలో ఎవరు అధికారం చేపడతారని మీరనుకుంటున్నారు?
** ఎగ్జిట్‌పోల్స్‌ ఎక్స్‌క్లూజివ్‌గా WAY2NEWSలో..

News June 1, 2024

ముగిసిన చివరి దశ పోలింగ్

image

సార్వత్రిక ఎన్నికలు-2024లో భాగంగా చివరిదైన 7వ దశ పోలింగ్ ముగిసింది. సా.5 గంటల వరకు 58.34% పోలింగ్ నమోదైంది. 8 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోని ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. బిహార్, చండీగఢ్, హిమాచల్‌ప్రదేశ్, పంజాబ్, ఝార్ఖండ్, ఒడిశా, ఉత్తర ప్రదేశ్‌తో పాటు బెంగాల్ రాష్ట్రాల్లో పోలింగ్ జరిగింది. దీంతో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌కు శుభం కార్డు పడింది. జూన్ 4న ఫలితాలు రానున్నాయి.

News June 1, 2024

ఎండ.. వర్షం.. మంచు

image

దేశంలో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఢిల్లీ, హరియాణా, తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతుండగా.. భారీ వర్షాలు ఈశాన్య రాష్ట్రాలను అతలాకుతలం చేస్తున్నాయి. మరోవైపు హిమాచల్‌ప్రదేశ్‌లో విపరీతమైన మంచు కురుస్తోంది. ఉష్ణోగ్రతలు సున్నా డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయాయి. దేశంలో ఈ భిన్న వాతావరణంపై నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మన సంస్కృతిలా ప్రకృతిలో వైవిధ్యం ఇదేనంటూ కామెంట్ చేస్తున్నారు.

News June 1, 2024

17 రౌండ్లలో కంటోన్మెంట్ ఉపఎన్నిక కౌంటింగ్

image

TG: సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు 17 రౌండ్లలో ఉంటుందని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్ రాస్ తెలిపారు. ప్రతి రౌండ్‌కు 30 నిమిషాల సమయం పడుతుందన్నారు. ఇక జిల్లా పరిధిలోని లోక్‌సభ స్థానాల ఓట్ల లెక్కింపు కోసం 13 ప్రాంతాల్లో 16 హాల్స్ సిద్ధం చేసినట్లు చెప్పారు. ప్రతి కౌంటింగ్ హాల్‌లో సగటున 14 టేబుళ్లు, జూబ్లీహిల్స్‌లో అత్యధికంగా 20 టేబుళ్లు ఏర్పాటు చేశామన్నారు.

News June 1, 2024

జర్మనీపై భారత జట్టు సంచలన విజయం

image

లండన్‌లో జరుగుతున్న FIH పురుషుల హాకీ ప్రో లీగ్ 2023-24లో భారత హాకీ జట్టు జర్మనీని ఓడించింది. ఈ మ్యాచ్‌లో ఇండియన్ టీమ్ సాలిడ్ డిఫెన్స్‌తో అదరగొట్టడంతో యూరప్ లెగ్ ఎన్‌కౌంటర్‌లో 3-0 తేడాతో గెలిచింది. హర్మన్‌ప్రీత్, సుఖ్జీత్, గుర్జంత్ విజయంలో కీలకపాత్ర పోషించారు. పారిస్ ఒలింపిక్స్-2024 ముంగిట భారత ఆటగాళ్లలో ఈ విజయం ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది.

News June 1, 2024

చేతుల్లేకున్నా.. బాధ్యతగా ఓటేశాడు

image

ఎన్నికల వేళ ఓటేసేందుకు చాలామంది బద్దకిస్తుంటారు. ఆఫీసులకు సెలవులిచ్చినా పోలింగ్ కేంద్రానికి వెళ్లేందుకు ఆసక్తి చూపరు. అయితే హిమాచల్ ప్రదేశ్‌లోని భరారీ ఓహార్ పోలింగ్ బూత్‌లో వినోద్ కుమార్ అనే వ్య‌క్తి త‌న‌కు రెండు చేతులు లేక‌పోయినా బాధ్య‌త‌గా ఓటు వేసి ఆదర్శంగా నిలిచారు. వైకల్యాన్ని లెక్క చేయకుండా ఓటు వేయడానికి ముందుకు వచ్చిన వినోద్‌ను నెటిజన్లు అభినందిస్తున్నారు.