News June 1, 2024

రేపు ఈ రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు

image

అరుణాచల్ ప్రదేశ్(AR)లోని 60, సిక్కింలోని 32 అసెంబ్లీ నియోజకవర్గాల ఫలితాలు రేపు వెల్లడికానున్నాయి. ఈ 2 రాష్ట్రాల్లోని ప్రభుత్వాల పదవీకాలం జూన్ 2తో ముగియనుండటంతో ముందే కౌంటింగ్ నిర్వహిస్తున్నారు. ARలో BJP 60, INC 19 స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి దింపాయి. 10 స్థానాల్లో BJP అభ్యర్థులు ఏకగ్రీవంగా గెలుపొందారు. సిక్కింలో సిక్కిం క్రాంతికారీ మోర్చా, సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ మధ్య పోటీ ఉంది.

News June 1, 2024

92 ఏళ్ల వృద్ధుడి తొలిసారి ఓటు

image

జార్ఖండ్‌లో 92 ఏళ్ల వృద్ధుడు ఖలీల్ అన్సారీ తొలిసారి ఓటు వేశాడు. దృష్టి లోపంతో బాధపడుతున్న ఆయనకు ఇప్పటివరకూ ఓటు హక్కు లేదట. ఏప్రిల్‌లో చేపట్టిన ఓట్ల జాబితా రివిజన్‌లో ఈ విషయాన్ని గుర్తించిన అధికారులు.. ఆయనకు ఓటు హక్కు కల్పించారు. దీంతో రాజ్‌మహల్ పార్లమెంట్ పరిధి మండ్రోలోని బూత్‌లో ఆయన ఓటు వేశారు. కాగా జార్ఖండ్‌లో 14 ఎంపీ స్థానాలుండగా.. ఇవాళ్టి ఏడో దశ ఎన్నికల్లో మూడు స్థానాలకు పోలింగ్ జరుగుతోంది.

News June 1, 2024

పోలింగ్ పర్సంటేజ్@3PM

image

చెదురుమదురు ఘటనలు మినహా దేశంలో తుదిదశ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం 3 గంటల వరకు 49.68 శాతం పోలింగ్ నమోదైనట్లు ఈసీ తెలిపింది. సా.6 గంటల వరకు ఓటింగ్ జరగనుంది. ఇక బెంగాల్‌లోని 24 పరగణాల జిల్లాలోని ఓ పోలింగ్ కేంద్రంలో TMC కార్యకర్తలు ఈవీఎం, వీవీ ప్యాట్‌ను నీటి గుంతలో పడేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. మొత్తం 57 లోక్‌సభ స్థానాలకు ఇవాళ పోలింగ్ జరుగుతోంది.

News June 1, 2024

మార్పు ఇదేనా?: కేటీఆర్

image

TG: అమరవీరుల స్తూపం చుట్టూ ఇనుప కంచెలు వేయడంపై మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. ‘మార్పు వచ్చింది. ఇందిరమ్మ పాలనలోని ఎమర్జెన్సీ రోజులు గుర్తుకొచ్చేలా తెలంగాణ అమరుల స్తూపానికి కూడా ఇనుప కంచెలు తెచ్చింది’ అంటూ ఆయన ట్వీట్ చేశారు. రేపు తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు జరగనున్న సందర్భంగా అమరుల స్తూపం చుట్టూ ఫెన్సింగ్‌ ఏర్పాటు చేశారు.

News June 1, 2024

నిమిషంలో మొబైల్, 10 నిమిషాల్లో ఎలక్ట్రిక్ వెహికల్ ఫుల్ ఛార్జ్!

image

భారత సంతతి పరిశోధకుడు అంకుర్ గుప్తా కేవలం 10 నిమిషాల్లో ఎలక్ట్రిక్ వాహనం, ఒక్క నిమిషంలో మొబైల్‌ని ఫుల్ ఛార్జ్ చేసే సాంకేతికతను కనుగొన్నారు. ఈ పరిశోధన సూపర్ కెపాసిటర్ల వంటి సమర్థవంతమైన నిల్వ పరికరాల అభివృద్ధికి పనిచేస్తుందని గుప్తా ఆశాభావం వ్యక్తం చేశారు. సూపర్ కెపాసిటర్లు బ్యాటరీల కంటే వేగంగా ఛార్జ్ చేస్తాయి. US కొలరాడో బౌల్డర్ యూనివర్సిటీలో గుప్తా అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.

News June 1, 2024

గోల్డ్ స్మగ్లింగ్ కేసులో మరికొంత మంది విమాన సిబ్బంది!

image

మలద్వారంలో 960 గ్రాముల బంగారంతో పట్టుబడ్డ ఎయిరిండియా ఎయిర్‌ హోస్టెస్ కేసులో అధికారులు విచారణ వేగవంతం చేశారు. ఇప్పటికే నిందితురాలు సురభి ఖాతూన్‌తో పాటు సీనియర్ ఉద్యోగి సోహైల్‌ను అరెస్ట్ చేశారు. గోల్డ్ స్మగ్లింగ్ వెనుక మరికొంత మంది సిబ్బంది ఉన్నట్లు విచారణలో తేలడంతో వారినీ అదుపులోకి తీసుకోనున్నారు. కాగా మస్కట్ నుంచి భారత్‌కు వచ్చిన ఫ్లైట్‌లో సురభి మలద్వారంలో 960 గ్రా. బంగారంతో దొరికింది.

News June 1, 2024

ALERT.. కాసేపట్లో వర్షాలు

image

తెలంగాణలోని మహబూబ్‌నగర్, నారాయణపేట, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో కాసేపట్లో వర్షాలు పడతాయని HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, వరంగల్, హన్మకొండ, జనగాం, వనపర్తి, గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ ఇవాళ రాత్రిలోగా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని ప్రకటించింది.

News June 1, 2024

ఈ స్టేడియం నిర్మాణానికి రూ.250 కోట్లు

image

న్యూయార్క్​ నసావు కౌంటీ క్రికెట్ స్టేడియం నిర్మాణం <<13355081>>జెట్<<>> స్పీడ్‌లో పూర్తయిన విషయం తెలిసిందే. ఐసెన్‌హోవర్ పార్క్​లో నిర్మించిన ఈ స్టేడియానికి ఏకంగా రూ.250 కోట్లు ఖర్చు చేశారట. నిర్మాణంలో అత్యాధునిక టెక్నాలజీ వినియోగించడంతోనే భారీగా ఖర్చయినట్లు తెలుస్తోంది. 34 వేల సీటింగ్ కెపాసిటీ ఉన్న ఈ స్టేడియంలో డ్రాప్- ఇన్​ పిచ్​‌లను ఇన్‌స్టాల్ చేశారు. ఈ వేదికగానే జూన్ 9న ఇండియా-పాకిస్థాన్ పోరు జరగనుంది.

News June 1, 2024

కనిపించకుండా పోయిన ప్రజ్వల్ తల్లి

image

లైంగిక వేధింపుల కేసులో నిందితుడు ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ తల్లి <<13349803>>భవానీ రేవణ్ణ<<>> కనిపించకుండా పోయారు. విచారించేందుకు ఇంటికి వెళ్లిన సిట్ అధికారులకు ఆమె కనిపించలేదు. దీంతో వారు అక్కడే 5PM వరకు వేచి ఉండే అవకాశం ఉంది. అరెస్ట్ భయంతోనే ఆమె పరారైనట్లు తెలుస్తోంది. కాగా తనను అరెస్ట్ చేయకుండా ఆదేశాలివ్వాలంటూ స్థానిక కోర్టులో భవానీ దాఖలు చేసిన పిటిషన్‌ తిరస్కరణకు గురైంది. మరోవైపు ప్రజ్వల్ ప్రస్తుతం పోలీస్ కస్టడీలో ఉన్నారు.

News June 1, 2024

ఓటేసిన ప్రముఖులు

image

సార్వత్రిక ఎన్నికల చివరి దశ పోలింగ్ కాసేపట్లో ముగియనుంది. 8 రాష్ట్రాల్లోని 57 లోక్‌సభ, ఒడిశాలోని 42 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా సినీ, రాజకీయ ప్రముఖులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్, కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్, సింగ్, నటి కంగనా రనౌత్ తదితరులు క్యూలైన్‌లో నిలబడి ఓటు వేశారు.