News June 1, 2024

కేజ్రీవాల్‌‌కు నో రిలీఫ్.. సరెండర్ కావాల్సిందే!

image

లిక్కర్ పాలసీ కేసులో సీఎం కేజ్రీవాల్‌‌‌కు తక్షణ ఉపశమనం లభించలేదు. వైద్యపరమైన కారణాలతో మధ్యంతర బెయిల్ కోసం ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. జూన్ 5న తీర్పును వెలువరిస్తామని న్యాయస్థానం తెలిపింది. దీంతో ఆయన జూన్ 2న తిహార్ జైలులో తప్పక సరెండర్ కావాల్సిన పరిస్థితి ఏర్పడింది.

News June 1, 2024

కారంపూడి సీఐ నారాయణ స్వామిపై వేటు

image

AP: మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఫిర్యాదుతో పల్నాడు జిల్లా కారంపూడి సీఐ నారాయణ స్వామిపై ఈసీ వేటు వేసింది. ఎన్నికల విధులకు ఆయనను దూరంగా ఉంచాలని ఆదేశించింది. పోలింగ్ రోజున కారంపూడిలో శాంతిభద్రతలను కాపాడటంలో ఆయన విఫలమయ్యారని ఆరోపణలు రావడంతో వేటు పడింది. తదుపరి విచారణ ఆధారంగా సీఐపై చర్యలు ఉండనున్నాయి.

News June 1, 2024

పాక్ టీమ్‌ను సర్వనాశనం చేశారు: రమీజ్ రజా

image

టీ20 WCకు ముందు ఇంగ్లండ్ చేతిలో పాక్ 2-0తో సిరీస్ కోల్పోవడంతో టీమ్ మేనేజ్‌మెంట్‌పై PCB మాజీ ఛైర్మన్ రమీజ్ రజా మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రయోగాలు ఆపి, నాణ్యమైన టీమ్‌తో బరిలోకి దిగాలని సూచించారు. భారీ స్ట్రైక్ రేట్ ఫోబియా నుంచి బయటపడాలని, అలాంటి ప్లేయర్లు జట్టులో లేరనే విషయాన్ని గ్రహించాలని హితవు పలికారు. టీమ్‌ను సర్వనాశనం చేశారని రమీజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

News June 1, 2024

లెక్కింపు ప్రక్రియలో 10 వేల మంది సిబ్బంది: వికాస్ రాజ్

image

TG: ఈ నెల 4న ఓట్ల లెక్కింపు సమయంలో కౌంటింగ్ కేంద్రాల వద్ద నాలుగంచెల భద్రత ఉంటుందని CEO వికాస్ రాజ్ మీడియా సమావేశంలో వెల్లడించారు. కౌంటింగ్ హాల్లో ఎలక్ట్రానిక్ పరికరాలు అనుమతి లేదని పునరుద్ఘాటించారు. లెక్కింపు ప్రక్రియలో దాదాపు 10 వేల మంది సిబ్బంది పాల్గొంటారని వెల్లడించారు. ETPBS(ఆర్మీ, పారా మిలిటరీ) ఓట్లు ఇంకా వస్తున్నాయని, జూన్ 4 ఉదయం 8 గంటల వరకు వచ్చిన వాటిని పరిగణనలోకి తీసుకుంటామన్నారు.

News June 1, 2024

అందుకే CASIO వాచ్ ధరిస్తా: అల్లు అర్జున్

image

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఎక్కువగా ‘CASIO’ వాచ్‌లు ధరించడానికి గల కారణాన్ని వెల్లడించారు. తెలంగాణలో జరిగిన లోక్‌సభ ఎన్నికల పోలింగ్ సమయంలో ఆయన CASIO వాచ్ ధరించగా.. దీనిపై ఓ నెటిజన్ ప్రశ్నించారు. దీనికి ఆయన స్పందిస్తూ.. ‘ఈ వాచ్ సమయం మాత్రమే చూపించదు. మనం ఎక్కడి నుంచి వచ్చామో గుర్తుచేస్తుంది’ అని రిప్లై ఇచ్చారు.

News June 1, 2024

T20WC: ఫాస్టెస్ట్ ఫిఫ్టీ వీరులు వీరే!

image

రేపటి నుంచి T20 ప్రపంచ కప్ ప్రారంభం కానుంది. ధనాధన్ ఆటతో ఆటగాళ్లు ప్రేక్షకులను అలరించనున్నారు. T20 WCలో భారత మాజీ ఆటగాడు యువరాజ్ సింగ్ పేరిట ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ రికార్డు ఉంది. 2007 WCలో 12 బంతుల్లోనే యూవీ అర్ధసెంచరీ సాధించారు. ఆ తర్వాత మైబర్గ్ (17 బంతుల్లో), స్టొయినిస్ (17), మ్యాక్స్‌వెల్ (18), కేఎల్ రాహుల్ (18), షోయబ్ మాలిక్ (18) ఉన్నారు. ఈ WCలో ఎవరు ఫాస్టెస్ట్ ఫిఫ్టీ కొడతారో కామెంట్ చేయండి.

News June 1, 2024

CM కేజ్రీవాల్‌కు అనారోగ్యం!

image

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ అనారోగ్యానికి గురయ్యారని ఆయన తరఫు లాయర్ల బృందం కోర్టుకు తెలిపింది. ఆయనకు చికిత్స అవసరమని వివరించింది. లిక్కర్ పాలసీ కేసులో మధ్యంతర బెయిల్‌పై బయటికి వచ్చిన కేజ్రీవాల్ జూన్ 2న తిహార్ జైలులో సరెండర్ కావాల్సి ఉంది. ఇదిలా ఉంటే ఆరోగ్యం విషయంలో కేజ్రీవాల్ తప్పుడు సమాచారం ఇస్తున్నారని ED ఆరోపిస్తోంది.

News June 1, 2024

సుష్మా స్వరాజ్ పాత్ర మర్చిపోలేం: పొన్నం

image

TG: తెలంగాణ ఏర్పాటులో BJP దివంగత నాయకురాలు సుష్మా స్వరాజ్ పాత్ర మర్చిపోలేమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆవిర్భావ వేడుకలు రాజకీయ విమర్శలకు వేదిక కాకూడదని అభిప్రాయపడ్డారు. అన్ని పార్టీలు ఈ వేడుకలు చేసుకోవాలని కోరారు. పరేడ్ గ్రౌండ్స్‌లో వేడుకల ఏర్పాట్లను పరిశీలించిన సందర్భంగా మంత్రి మాట్లాడారు. తెలంగాణ బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందడంలో సుష్మా స్వరాజ్ కీలకపాత్ర పోషించిన విషయం తెలిసిందే.

News June 1, 2024

YELLOW ALERT: ఓ వైపు వర్షాలు.. మరోవైపు వడగాలులు

image

TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తుండగా, మరికొన్ని చోట్ల విపరీతమైన ఎండలు ఉంటున్నాయి. ఈ నెల 6 వరకు వానలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది. రేపు నల్గొండ, సూర్యాపేట, వరంగల్, హన్మకొండ, జనగామ, మహబూబ్‌నగర్, వనపర్తి, నారాయణపేట, గద్వాల్ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయంటూ ఎల్లో అలర్ట్ ఇచ్చింది. ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, భద్రాద్రి, ఖమ్మం జిల్లాల్లో వడగాలులు వీస్తాయని తెలిపింది.

News June 1, 2024

పీవోకే విదేశీ భూభాగమన్న పాక్ న్యాయవాది.. నెట్టింట విమర్శలు

image

POK విదేశీ భూభాగమని పాక్ ప్రభుత్వ న్యాయవాది చేసిన వ్యాఖ్యలు నెట్టింట సంచలనంగా మారాయి. ఇస్లామాబాద్ HCలో ఓ కేసు విచారణ సందర్భంగా POK(ఆజాద్ కాశ్మీర్) పాక్‌లో అంతర్భాగం కాదని పేర్కొన్నారు. దీనిపై కోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ అక్కడ సైన్యాన్ని ఎందుకు మోహరించారని ప్రశ్నించింది. న్యాయవాది వ్యాఖ్యలతో ఇన్నాళ్లూ ఆజాద్ కాశ్మీర్‌గా ఆ దేశం పేర్కొంటూ వస్తున్న పీఓకే భారత్‌లో అంతర్భాగమని అంగీకరించినట్లయింది.