News October 31, 2025

సబ్జా గింజలతో కురులకు బలం

image

సబ్జా గింజలు చర్మానికే కాదు జుట్టుకు కూడా మంచి పోషకాలు అందిస్తాయని నిపుణులు అంటున్నారు. ఈ గింజలలోని విటమిన్ కె, బీటా కెరోటిన్, ప్రొటీన్లు.. వెంట్రుకలు, కుదుళ్లు దృఢంగా మారేలా చేస్తాయని, వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల జుట్టు రాలే సమస్య నుంచి బయటపడొచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇవి కొందరికి పడకపోవచ్చు. కాబట్టి వాడే ముందు వ్యక్తిగత నిపుణులు సలహా తీసుకోవాలని సూచిస్తున్నారు.

News October 31, 2025

పశువుల నుంచి మనుషులకు సోకే ప్రమాదకర వ్యాధి

image

బ్రూసిల్లా అబార్టస్‌ బ్యాక్టీరియా వల్ల పశువులకు సోకే ప్రమాదకర వ్యాధి బ్రూసెల్లోసిస్‌. ఈ వ్యాధి వల్ల పశువుల్లో గర్భస్రావం, వంధ్యత్వం, పాల ఉత్పత్తి తగ్గుతుంది. ఈ వ్యాధి సోకిన పశువుల స్రావాలు తాకినా, పాలు మరిగించకుండా తాగినా మనుషులకూ ఇది సోకుతుంది. దీని వల్ల పురుషుల్లో వృషణాల వాపు, వీర్యం విడుదలలో ఇబ్బంది, మహిళల్లో అబార్షన్ అయ్యే ప్రమాదం ఉంది. ✍️ మరింత సమాచారానికి <<-se_10015>>పాడిపంట కేటగిరీ<<>> క్లిక్ చేయండి.

News October 31, 2025

అప్పుడు పక్కన పెడితే.. ఇప్పుడు కప్పుకు చేరువ చేసింది

image

సెమీస్‌లో అద్భుతమైన ఆటతో భారత్‌ను WWC ఫైనల్ చేర్చిన జెమీమా రోడ్రిగ్స్ ప్రయాణం అంత సాఫీగా ఏమీ సాగలేదు. గత WC(2022)లో ఆమెను జట్టులోకే తీసుకోలేదు. ఈసారి ఫామ్‌లో ఉండటంతో తొలిసారి WC ఆడే ఛాన్స్ ఇచ్చారు. కానీ తొలి 4 మ్యాచుల్లో జెమీమా 2సార్లు డకౌట్ కాగా మరో 2సార్లు 30ల్లో ఔట్ అయ్యారు. దీంతో ENG మ్యాచులో తప్పించారు. అయినా కుంగిపోకుండా తర్వాత NZపై 76*, నిన్న సెమీస్‌లో 127* రన్స్ చేసి INDను ఫైనల్ చేర్చారు.

News October 31, 2025

లీగల్‌ కేసుల్లో మహిళలకు ప్రైవసీ

image

భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 228A, లైంగిక వేధింపులకు గురైన ఉమెన్‌ ఐడెంటిటీని బయట పెట్టడాన్ని నిషేధిస్తుంది. ఆమె పేరు, అడ్రస్‌ లేదా ఇతర వివరాలను వెల్లడించకూడదు. ఏ వివరాలు బయట పెట్టాలన్నా ఆమె అనుమతి ఉండాలి. తమ గురించి బయటకు తెలిసి పోతుందనే భయం లేకుండా, ఎక్కవ మంది బాధితులు బయటకు వచ్చి కంప్లైంట్‌ చేయాలనే ఉద్దేశంతో ఈ హక్కు కల్పించారు.

News October 31, 2025

బ్రూసెల్లోసిస్‌ వ్యాధి ఎలా వ్యాపిస్తుంది?

image

బ్రూసెల్లోసిస్‌ సోకిన పశువుల్లో గర్భస్రావమైనప్పుడు పిండం, గర్భకోశ స్రావాల ద్వారా సూక్ష్మజీవులు బయటకు వచ్చి పశువులు మేసే మేతను, నీటిని ఆశించి కలుషితం చేస్తాయి. ఈ మేతను, నీటిని ఇతర పశువులు తీసుకుంటే వాటికి వ్యాధి సోకుతుంది. ఈ వ్యాధి సోకిన పశువులు ఆరోగ్యకరమైన ఆవులు, గేదెలను దాటినప్పుడు వీర్యం ద్వారా వ్యాపిస్తుంది. గొర్రెలు, మేకలు, పందులు, ఆవులు, గేదెలు, కుక్కలు, మనుషులకు ఈ వ్యాధి సోకుతుంది.

News October 31, 2025

నేడు పిడుగులతో కూడిన వర్షాలు: APSDMA

image

AP: పలు జిల్లాల్లో ఇవాళ వర్షాలు పడే ఛాన్స్ ఉందని APSDMA అంచనా వేసింది. కోనసీమ, తూ.గో., ప.గో., ఏలూరు, కృష్ణా జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. అటు ప్రకాశం బ్యారేజీ వద్ద 2వ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుండగా, కృష్ణా నదీ పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

News October 31, 2025

2,569 ఇంజినీర్ పోస్టులు.. నేటి నుంచి దరఖాస్తుల ఆహ్వానం

image

RRBలో 2,569 జూనియర్ ఇంజినీర్ పోస్టులకు నేటి నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. SCR పరిధిలో 103 పోస్టులు ఉన్నాయి. డిప్లొమా, బీటెక్, BE అర్హతగల అభ్యర్థులు NOV 30 వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 18 నుంచి 33ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. రాత పరీక్ష(CBT-1, CBT-2), సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. *మరిన్ని ఉద్యోగాల కోసం <<-se_10012>>జాబ్స్ <<>>కేటగిరీకి వెళ్లండి.

News October 31, 2025

ఇతిహాసాలు క్విజ్ – 52

image

1. జనకుని భార్య పేరు ఏంటి?
2. మహాభారతంలో రాధేయుడు ఎవరు?
3. దత్తాత్రేయుడికి ఎంత మంది గురువులు ఉన్నారు?
4. దేవతలకు వైద్యుడు ఎవరు?
5. సముద్ర మథనంలో లక్ష్మీదేవికి ముందు పుట్టిన ఆమె అక్క పేరు ఏంటి?
☞ సరైన సమాధానాలను సాయంత్రం 6 గంటలకు పబ్లిష్ చేస్తాం.
<<-se>>#Ithihasaluquiz<<>>

News October 31, 2025

APPLY NOW: CERSAIలో 11 ఉద్యోగాలు

image

సెంట్రల్ రిజిస్ట్రీ ఆఫ్ సెక్యూరిటైజేషన్ అసెట్ రీకన్‌స్ట్రక్షన్ అండ్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్ ఆఫ్ ఇండియా(CERSAI)లో 11 మేనేజర్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. పోస్టును బట్టి BCA, MCA, B.Tech, MBA, PGDM, M.Tech, CA, CMA, CS ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. AGM పోస్టుకు గరిష్ఠ వయసు 45 ఏళ్లు కాగా, చీఫ్ మేనేజర్ పోస్టుకు 40ఏళ్లు, మేనేజర్ పోస్టుకు 35ఏళ్లు.

News October 31, 2025

Pro Kabaddi: నేడే ఫైనల్ పోరు

image

ప్రో కబడ్డీ లీగ్ సీజన్-12 ఫైనల్ పోరులో ఇవాళ దబాంగ్ ఢిల్లీ K.C. జట్టు పుణేరి పల్టాన్‌తో తలపడనుంది. ఢిల్లీలో రా.8 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. లీగ్ దశలో అగ్రస్థానంలో నిలిచిన ఈ 2 జట్ల మధ్య తుది సమరం జరగనుండటంతో మ్యాచ్ హోరాహోరీగా సాగే అవకాశం ఉంది. 2021-22 సీజన్‌లో ఢిల్లీ టైటిల్‌ సాధించగా 2023-24లో పుణేరి కప్పు కొట్టింది. దీంతో ఈ 2 టీమ్‌ల్లో ఎవరు నెగ్గినా రెండోసారి టైటిల్‌ను ముద్దాడనున్నాయి.