News June 1, 2024

కాంగ్రెస్ 9-12 సీట్లు గెలవబోతుంది: మంత్రి కోమటిరెడ్డి

image

TG: రాష్ట్రంలో కాంగ్రెస్ 9-12 లోక్‌సభ సీట్లు గెలవబోతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. వచ్చే పదేళ్లు కాంగ్రెస్ పార్టీయే అధికారంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ నెల 4 తర్వాత BRS పార్టీయే ఉండదని మీడియా సమావేశంలో తెలిపారు. సోనియాపై విమర్శలు చేసిన KCRకు ప్రజలు బుద్ధి చెప్పారన్నారు. రాష్ట్ర చిహ్నంపై BRS నేతలు అనవసరమైన వివాదం చేస్తున్నారని దుయ్యబట్టారు.

News June 1, 2024

ఎత్తైన పోలింగ్ బూత్‌లో ఓటేశారు

image

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పోలింగ్ బూత్‌లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ పోలింగ్ కేంద్రం హిమాచల్‌ప్రదేశ్‌లోని తాషిగ్యాంగ్‌లో ఉంది. సముద్ర మట్టానికి 15,256 అడుగుల ఎత్తులో ఉన్న ఈ పోలింగ్ కేంద్రంలో మొత్తం 62 మంది ఓటర్లు ఉన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం దీన్ని మోడల్ పోలింగ్ స్టేషన్‌గా ప్రకటించింది. 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో ఈ పోలింగ్ కేంద్రంలో 100 శాతం పోలింగ్ నమోదైంది.

News June 1, 2024

సీఎస్‌ను ఎన్నికల డ్యూటీ నుంచి తప్పించాలి: వర్ల రామయ్య

image

AP: భూ కుంభకోణాలకు పాల్పడ్డ CS జవహర్ రెడ్డిని ఎన్నికల విధుల నుంచి తప్పించాలని TDP నేత వర్ల రామయ్య డిమాండ్ చేశారు. ఈ విషయంలో EC స్పందించాలని ఆయన కోరారు. ‘CSను ఎన్నికల డ్యూటీ నుంచి తప్పించాలి. విశాఖలో అసైన్డ్ భూములను దోచుకున్న ఆయనపై సీబీఐ కేసు నమోదు చేయాలి. మీరు కబ్జాలు చేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా? పేదల భూములు తక్కువ ధరకు కొట్టేయడమే పనిగా పెట్టుకున్నారా?’ అని ఆయన మండిపడ్డారు.

News June 1, 2024

గ్రూప్-1 హాల్ టికెట్లు విడుదల

image

తెలంగాణ గ్రూప్-1 ప్రిలిమ్స్ హాల్ టికెట్లు విడుదలయ్యాయి. అభ్యర్థులు <>www.tspsc.gov.in<<>> వెబ్‌సైట్‌లో తమ ID, పుట్టిన తేదీ వివరాలు, క్యాప్చాను ఎంటర్ చేసి హాల్ టిక్కెట్లను పొందవచ్చు. ఈనెల 9న ఉ.10:30 నుంచి మ.ఒంటి గంట వరకు ప్రిలిమ్స్ పరీక్ష జరగనుంది. మెయిన్ పరీక్షలు అక్టోబర్ 21 నుంచి నిర్వహించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. 563 పోస్టుల భర్తీకి ఈ పరీక్షలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

News June 1, 2024

రోహిత్ శర్మ.. మరో 3 సిక్సర్లు బాదితే..

image

భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్‌లో అరుదైన రికార్డుకు చేరువయ్యారు. మరో 3 సిక్సర్లు బాదితే 600 మార్క్ దాటిన తొలి ప్లేయర్‌గా నిలవనున్నారు. ఇప్పటివరకు అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లు కలిపి రోహిత్ శర్మ 472 మ్యాచుల్లో 597 సిక్సర్లు బాదారు. ఆ తర్వాతి స్థానంలో గేల్(593), అఫ్రీది(476), మెక్‌కల్లమ్(398) ఉన్నారు. ప్రస్తుతం యాక్టివ్ ప్లేయర్లలో ఏ ఆటగాడు ఆయన దరిదాపుల్లో కూడా లేరు.

News June 1, 2024

నిఖిల్ బర్త్ డే: ‘స్వయంభూ’ నుంచి స్పెషల్ పోస్టర్

image

టాలీవుడ్ స్టార్ హీరో నిఖిల్ బర్త్ డే సందర్భంగా ఆయన నటిస్తోన్న ‘స్వయంభూ’ సినిమా నుంచి స్పెషల్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. కత్తిసాము చేస్తోన్న నిఖిల్ లుక్ ఆకట్టుకుంటోంది. ఈ సినిమాను భరత్ కృష్ణమాచారి తెరకెక్కిస్తుండగా.. రవిబస్రూర్ మ్యూజిక్ అందిస్తున్నారు. సంయుక్త మేనన్, నభా నటేశ్ నటిస్తున్నారు. స్వయంభూ కోసం నిఖిల్ చాలా కష్టపడ్డారని, దీనికి ప్రతిఫలం లభిస్తుందని మేకర్స్ పేర్కొన్నారు.

News June 1, 2024

సునీతా విలియమ్స్‌ అంతరిక్ష యాత్ర నేడే

image

భారత సంతతికి చెందిన అమెరికన్‌ వ్యోమగామి సునీతా విలియమ్స్‌ మూడో సారి అంతరిక్ష యాత్రకు సిద్ధమయ్యారు. ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి బోయింగ్ స్టార్ లైనర్ రాకెట్‌లో మరో వ్యోమగామి విల్‌మోర్‌తో కలిసి ఆమె ఇవాళ రా.10 గంటలకు అంతరిక్షంలోకి బయలుదేరనున్నారు. వీరు వారం రోజుల పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో గడుపుతారు. ఈ యాత్ర మే 7నే జరగాల్సి ఉండగా సాంకేతిక కారణాలతో చివరి నిమిషంలో వాయిదా పడింది.

News June 1, 2024

AI స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో సామ్‌సంగ్ హవా

image

ఈ ఏడాది తొలి త్రైమాసికంలో గ్లోబల్ AI స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో సామ్‌సంగ్ హవా కొనసాగించింది. టాప్-10 అమ్మకాల్లో గెలాక్సీ S24 సిరీస్‌లోని 3 మోడల్స్ మొదటి 3 స్థానాల్లో నిలిచాయని ఓ రిపోర్టు వెల్లడించింది. S24 అల్ట్రా 30%, S24 16.8%, S24 ప్లస్ 11.5% వాటాను సొంతం చేసుకున్నట్లు పేర్కొంది. ఆ తర్వాతి స్థానాల్లో Xiaomi 14(7.7%), వివో X100(4.9%) ఉండగా, గూగుల్ పిక్సల్ 8ప్రొ 2.2% వాటాతో చివరిలో నిలిచింది.

News June 1, 2024

క్రికెటర్ గిల్‌తో పెళ్లి వార్తలు.. నటి రియాక్షన్ ఇదే

image

భారత క్రికెటర్ గిల్‌తో డిసెంబర్‌లో పెళ్లంటూ జరుగుతున్న ప్రచారాన్ని టీవీ నటి రిధిమా పండిట్ ఖండించారు. తనకు వ్యక్తిగతంగా గిల్ ఎవరో కూడా తెలియదని మీడియాకు చెప్పారు. ఎవరో క్రియేట్ చేసిన స్టోరీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోందని, ఇది హాస్యాస్పదమన్నారు. తాను ప్రస్తుతానికి సింగిల్ అని, ఏమైనా ఉంటే తానే ప్రకటిస్తానని చెప్పుకొచ్చారు. ఈ అమ్మడు బిగ్ బాస్ OTT, ఫియర్ ఫ్యాక్టర్ వంటి రియాల్టీ షోలలో కనిపించారు.

News June 1, 2024

విండీస్ పిచ్‌లపై అదే కీలకం: గవాస్కర్

image

భారత జట్టు తప్పకుండా ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు పేసర్లతో బరిలోకి దిగాలని మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ సూచించారు. T20 వరల్డ్‌కప్‌లో విండీస్ పిచ్‌లపై బౌలింగ్ అత్యంత కీలకమని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. బ్యాకప్ ఫాస్ట్ బౌలర్‌గా పాండ్య ఉంటారని తెలిపారు. భారత జట్టు ఈసారి అద్భుత ప్రదర్శన చేస్తుందని భావిస్తున్నట్లు తెలిపారు. బంగ్లాతో వార్మప్ మ్యాచ్ టీమ్ కూర్పుపై ఓ అవగాహనకు వచ్చేందుకు అవకాశమని పేర్కొన్నారు.