News June 1, 2024

ఫోన్ ట్యాపింగ్ కేసు CBIకి అప్పగించాలి: బండి సంజయ్

image

TG: ఫోన్ ట్యాపింగ్ కేసును CBIకి అప్పగించాలని CM రేవంత్‌ రెడ్డికి BJP నేత బండి సంజయ్ లేఖ రాశారు. ‘కాళేశ్వరం మాదిరే ఫోన్ ట్యాపింగ్ కేసునూ అటకెక్కించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఢిల్లీ స్థాయిలో ఒత్తిళ్లు రావడంతోనే ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ ఆగిపోయింది. ఫోన్ ట్యాపింగ్ సూత్రధారులు KCR, KTR MLA పదవికి అనర్హులు. రాష్ట్రంలోకి CBI అనుమతి నిషేధిస్తూ BRS ప్రభుత్వం ఇచ్చిన GOను రద్దు చేయాలి’ అని ఆయన కోరారు.

News June 1, 2024

మూడేళ్లు క్రికెట్ ఆడేంత ఫిట్‌గా ఉన్నా.. కానీ: DK

image

తన జీవితంలో సమస్యలేమీ లేవని, మరో మూడేళ్లు క్రికెట్ ఆడేంత ఫిజికల్ ఫిట్‌నెస్ ఉందని దినేశ్ కార్తీక్ తెలిపారు. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వల్ల మరింత ఈజీగా ఉంటుందన్నారు. ‘గాయం కారణంగా నేను ఎప్పుడూ మ్యాచ్‌ను మిస్సవలేదు. కానీ ఇది మానసిక స్థితికి సంబంధించింది. టోర్నమెంట్‌కు సిద్ధంగా ఉండగలనా? ఎక్కువ మ్యాచ్‌లు ఆడకపోయినా సర్దుకోగలనా? అనేదే సమస్య. అందుకే రిటైర్మెంట్ ప్రకటించా’ అని పేర్కొన్నారు.

News June 1, 2024

మళ్లీ పెళ్లి ముహూర్తాలు.. తేదీలు ఇవే!

image

మూఢం, శూన్యమాసం కారణంగా కొద్ది రోజులుగా వివాహాలు జరగట్లేదు. జూన్, జులైలో పెళ్లి ముహూర్తాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు. జూన్ 29, జులై 11, 12, 13, 14, 15 తేదీల్లో మంచి రోజులు ఉన్నాయన్నారు. ఆ తర్వాత చతుర్మాసం కారణంగా ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు శుభ ముహూర్తాలు లేవని, మళ్లీ నవంబర్, డిసెంబర్ నెలల్లో ఉన్నాయని పురోహితులు వివరించారు.

News June 1, 2024

ఆ సినిమాలో ఛాన్స్ వస్తే తప్పకుండా నటిస్తా: సత్యరాజ్

image

మహేశ్, రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కే సినిమాలో పాత్ర కోసం తనను ఎవరూ సంప్రదించలేదని సత్యరాజ్(కట్టప్ప) అన్నారు. SSMB 29లో నటిస్తున్నారనే ప్రచారంపై ఆయన ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. ఒకవేళ అందులో ఛాన్స్ వస్తే తప్పకుండా నటిస్తానని చెప్పారు. ‘బాహుబలి’ సినిమాలో నటించడంతో ప్రపంచానికి పరిచయమయ్యానని తెలిపారు. కాగా త్వరలోనే మహేశ్, రాజమౌళి సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని టాక్.

News June 1, 2024

BREAKING: సోనియా గాంధీ తెలంగాణ పర్యటన రద్దు

image

కాంగ్రెస్ అగ్ర నేత సోనియా గాంధీ తెలంగాణ పర్యటన రద్దయింది. అనారోగ్య కారణాలతో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలకు హాజరు కాలేకపోతున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

News June 1, 2024

పిన్నెల్లి ముందస్తు బెయిల్ రద్దు చేయాలని SCలో పిటిషన్

image

AP: మాచర్ల MLA పిన్నెల్లి నుంచి తనకు ప్రాణహాని ఉందని టీడీపీ పోలింగ్ ఏజెంట్ నంబూరి శేషగిరిరావు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. పిన్నెల్లికి హైకోర్టు ఇచ్చిన అరెస్టు మినహాయింపు ఆదేశాలను రద్దు చేయాలని కోరారు. ఈవీఎం ధ్వంసం ఘటనలో ఎమ్మెల్యే తనపై దాడి చేశారని, కౌంటింగ్ రోజున కూడా హింసకు పాల్పడే ప్రమాదం ఉందని కోర్టుకు తెలిపారు. హైకోర్టు అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా ముందస్తు బెయిల్ ఇచ్చిందన్నారు.

News June 1, 2024

REWIND: చరిత్ర సృష్టించిన రాజస్థాన్ రాయల్స్

image

17 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజున రాజస్థాన్ రాయల్స్ చరిత్ర సృష్టించింది. మొట్టమొదటి IPL టైటిల్ సాధించి ఆ జట్టు రికార్డులకెక్కింది. 2008 జూన్ 1న ముంబైలో జరిగిన ఫైనల్లో సీఎస్కేపై 3వికెట్ల తేడాతో నెగ్గి రాజస్థాన్ ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది. తొలుత బ్యాటింగ్ చేసిన CSK 163/5 పరుగులకే పరిమితమైంది. 164 పరుగుల టార్గెట్‌ను RR ఇన్నింగ్స్ చివరి బంతికి ఛేదించింది. దీంతో ఆ జట్టు తొలిసారి విజేతగా అవతరించింది.

News June 1, 2024

మధ్యాహ్నానికే పిఠాపురం ఫలితం?

image

AP: మరో 3 రోజుల్లో ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఈ క్రమంలో ఎవరు గెలుస్తారు? ఎవరు ఓడతారనే దానిపై చర్చ జరుగుతోంది. జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గం ఫలితం మధ్యాహ్నానికే తెలిసిపోతుందని సమాచారం. అలాగే జగన్ బరిలో ఉన్న పులివెందుల, చంద్రబాబు పోటీలో ఉన్న కుప్పం ఫలితాలు సాయంత్రానికి తెలవనున్నాయి. కొవ్వూరు, నరసాపురం మొట్టమొదట.. రంపచోడవరం, చంద్రగిరి ఫలితాలు చివరగా వెలువడనున్నాయి.

News June 1, 2024

నన్ను హార్దిక్ పాండ్యతో పోల్చవద్దు: నితీశ్

image

తనను టీమ్ఇండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యతో పోల్చవద్దని SRH ప్లేయర్ నితీశ్ కుమార్ రెడ్డి అన్నారు. ‘నా బ్యాటింగ్, స్ట్రైక్ రేట్‌పై సంతృప్తిగా ఉన్నా. కానీ బౌలింగ్‌లోనే ఇంకా మెరుగుపడాలి. మరో 3,4 కి.మీ వేగం పెంచుకోవాలి. కచ్చితంగా ఇండియా బౌలర్‌కు ఉండే లక్షణాలన్నీ సాధిస్తా’ అని ఆయన పేర్కొన్నారు. కాగా IPLలో సత్తా చాటిన ఈ యంగ్ ఆల్‌రౌండర్‌ని పలువురు మాజీ క్రికెటర్లు పాండ్యతో కంపేర్ చేసిన విషయం తెలిసిందే.

News June 1, 2024

మూలధన వ్యయ అంచనాల్లో 99% ఖర్చు

image

FY24లో మూలధన వ్యయం (ఆస్తుల కల్పన) అంచనాల్లో కేంద్రం 99% ఖర్చు చేసింది. గత సం.లో ₹9.49 లక్షల కోట్లు అంచనా కాగా ₹9.48L Cr ఖర్చు పెట్టినట్లు ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. ఈ మొత్తం FY23 ఖర్చు ₹7.36 లక్షల కోట్ల కంటే 28.8% అధికం. జులై, ఆగస్టులో రుతుపవనాలతో నిర్మాణ పనులకు ఇబ్బంది కలిగినా SEP తర్వాత పుంజుకుందని నివేదిక పేర్కొంది. ఎన్నికలకు ముందు మార్చి నెలలోనే ₹1.49 లక్షల కోట్లు వెచ్చించింది.