News June 1, 2024

మధ్యాహ్నానికే పిఠాపురం ఫలితం?

image

AP: మరో 3 రోజుల్లో ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఈ క్రమంలో ఎవరు గెలుస్తారు? ఎవరు ఓడతారనే దానిపై చర్చ జరుగుతోంది. జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గం ఫలితం మధ్యాహ్నానికే తెలిసిపోతుందని సమాచారం. అలాగే జగన్ బరిలో ఉన్న పులివెందుల, చంద్రబాబు పోటీలో ఉన్న కుప్పం ఫలితాలు సాయంత్రానికి తెలవనున్నాయి. కొవ్వూరు, నరసాపురం మొట్టమొదట.. రంపచోడవరం, చంద్రగిరి ఫలితాలు చివరగా వెలువడనున్నాయి.

News June 1, 2024

నన్ను హార్దిక్ పాండ్యతో పోల్చవద్దు: నితీశ్

image

తనను టీమ్ఇండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యతో పోల్చవద్దని SRH ప్లేయర్ నితీశ్ కుమార్ రెడ్డి అన్నారు. ‘నా బ్యాటింగ్, స్ట్రైక్ రేట్‌పై సంతృప్తిగా ఉన్నా. కానీ బౌలింగ్‌లోనే ఇంకా మెరుగుపడాలి. మరో 3,4 కి.మీ వేగం పెంచుకోవాలి. కచ్చితంగా ఇండియా బౌలర్‌కు ఉండే లక్షణాలన్నీ సాధిస్తా’ అని ఆయన పేర్కొన్నారు. కాగా IPLలో సత్తా చాటిన ఈ యంగ్ ఆల్‌రౌండర్‌ని పలువురు మాజీ క్రికెటర్లు పాండ్యతో కంపేర్ చేసిన విషయం తెలిసిందే.

News June 1, 2024

మూలధన వ్యయ అంచనాల్లో 99% ఖర్చు

image

FY24లో మూలధన వ్యయం (ఆస్తుల కల్పన) అంచనాల్లో కేంద్రం 99% ఖర్చు చేసింది. గత సం.లో ₹9.49 లక్షల కోట్లు అంచనా కాగా ₹9.48L Cr ఖర్చు పెట్టినట్లు ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. ఈ మొత్తం FY23 ఖర్చు ₹7.36 లక్షల కోట్ల కంటే 28.8% అధికం. జులై, ఆగస్టులో రుతుపవనాలతో నిర్మాణ పనులకు ఇబ్బంది కలిగినా SEP తర్వాత పుంజుకుందని నివేదిక పేర్కొంది. ఎన్నికలకు ముందు మార్చి నెలలోనే ₹1.49 లక్షల కోట్లు వెచ్చించింది.

News June 1, 2024

2019ఎన్నికలు: ఎగ్జిట్ పోల్స్ VS ఫలితాలు

image

మరికొన్ని గంటల్లో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడనున్నాయి. దీంతో ఏ పార్టీకి ఎన్ని సీట్లొస్తాయి? ఏ పార్టీ దేశ, రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పుతుందో తెలుసుకునేందుకు ప్రజలు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. 2019 ఎగ్జిట్ పోల్స్ INDIA TODAY- AXIS MY INDIA సర్వే NDAకి 339-365, UPAకి 77-108 సీట్లు.. CVoter సర్వే NDAకి 287, UPAకి 128 సీట్లు వస్తాయని అంచనా వేశాయి. ఫలితాల్లో NDAకి 353, UPAకి 91 సీట్లొచ్చాయి.

News June 1, 2024

బాసర IIITలో ప్రవేశాలు.. APPLY చేసుకోండి

image

TG: నిర్మల్ జిల్లా బాసర ఐఐఐటీలో ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్‌లో ప్రవేశాలకు నేటి నుంచి ఈనెల 22 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. జులై 3న సీట్లను కేటాయింపు, అదే నెల 8 నుంచి 10వ తేదీ వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుంది. విద్యార్థులు ఈ ఏడాది తొలి ప్రయత్నంలో టెన్త్ పాసై ఉండాలి. వయసు 18 ఏళ్లు (ఎస్సీ, ఎస్టీలకు 21) మించకూడదు. మొత్తం 1500 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
వెబ్‌సైట్: https://www.rgukt.ac.in/

News June 1, 2024

చేప ప్రసాదం పంపిణీకి 2 లక్షల కొరమీనులు

image

TG: మృగశిర కార్తె సందర్భంగా HYD నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో బత్తిన ఫ్యామిలీ ఈ నెల 8న చేప ప్రసాదం పంపిణీ చేయనుంది. ఈ కార్యక్రమానికి ఏపీ నుంచి 2 లక్షల కొర‌మీనులు తెప్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు. మృగశిర కార్తె రోజున చేప ప్రసాదం తీసుకుంటే ఉబ్బసం వ్యాధి తగ్గుతుందని ప్రజలు విశ్వసిస్తారు. 170 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ప్రసాద పంపిణీకి తెలుగు రాష్ట్రాలతో పక్క రాష్ట్రాల వారు వస్తుంటారు.

News June 1, 2024

అమెరికాలో క్రికెట్ ఆడతామని ఊహించలేదు: కోహ్లీ

image

USAలో క్రికెట్ ఆడతామని తామెప్పుడూ ఊహించలేదని టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ అన్నారు. ఇది క్రికెట్‌లో ఒక శుభపరిణామంగా అభివర్ణించారు. ‘క్రీడలు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందుతున్నాయనడానికి ఇది ఒక నిదర్శనం. అమెరికా మార్పును స్వీకరించి వరల్డ్ కప్ ఈవెంట్ నిర్వహిస్తోంది. ఇది ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఆ దేశానికి బలమైన జట్టు కూడా సిద్ధం కావడం సంతోషకరం’ అని కింగ్ పేర్కొన్నారు.

News June 1, 2024

56 డిగ్రీల ఉష్ణోగ్రత.. నిజమేనా?

image

భారత వాతావరణ శాఖ (IMD) ఆటోమేటిక్ వెదర్ స్టేషన్ల పనితీరుపై అనుమానాలు తలెత్తుతున్నాయి. మే 30న మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో 56 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని IMD కేంద్రంలో రికార్డు అయింది. అదే నగరంలోని మరోచోట 54 డిగ్రీల టెంపరేచర్ రికార్డు అయింది. అయితే అది నిజం కాదని తాజాగా IMD స్పష్టం చేసింది. సెన్సార్ సరిగా పని చేయట్లేదని, దాన్ని బాగు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపింది.

News June 1, 2024

T20WC నుంచి శాశ్వతంగా స్టాప్ క్లాక్ రూల్

image

ఇప్పటికే పలు మ్యాచ్‌లలో ప్రయోగాత్మకంగా అమలు చేసిన స్టాప్ క్లాక్ రూల్‌ T20WC నుంచి పూర్తిస్థాయిలో అమల్లోకి రానుంది. ఇకపై ఫీల్డింగ్ టీమ్‌కు ఓవర్ల మధ్య 60 సెకన్ల కౌంట్‌డౌన్ ఉంటుంది. ఆలోపు మరో బౌలర్ ఓవర్ ప్రారంభించాలి. లేదంటే అంపైర్ 2సార్లు వార్నింగ్ ఇచ్చి, ఆ తర్వాత 5 రన్స్ ఫెనాల్టీ విధిస్తారు. ఈ రూల్ వల్ల మ్యాచ్ సమయం వృథా కాకుండా ఉంటుంది. ప్రయోగాత్మక దశలో వన్డేల్లో 20 నిమిషాల టైమ్ ఆదా అయ్యింది.

News June 1, 2024

GREAT.. ఆక్సిజన్ సిలిండర్‌తో వచ్చి ఓటేశారు

image

హిమచల్ ప్రదేశ్‌లోని హమీర్‌పూర్ లోక్‌సభ స్థానంలో విమలా శర్మ ఆక్సిజన్ సిలిండర్‌తో వచ్చి ఓటేశారు. తీవ్ర అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఆమె కుటుంబీకుల సాయంతో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఏ స్థితిలో ఉన్నా కర్తవ్యాన్ని మరువని విమలను EC ప్రశంసించింది. గంట నిలబడాలని, మరో పని ఉందనే సాకులతో ఓటేయని వారున్న రోజుల్లో ఈమె అందరికీ స్ఫూర్తిదాయకం. ఈ MP స్థానంలో కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ పోటీలో ఉన్నారు.