News June 1, 2024

ఇవాళ బీఆర్ఎస్ నేతల క్యాండిల్ ర్యాలీ

image

TG: రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకలను మూడు రోజుల పాటు నిర్వహించేందుకు BRS సిద్ధమైంది. దీనిలో భాగంగా ఇవాళ HYD గన్‌పార్క్‌లోని తెలంగాణ అమరవీరుల స్తూపం నుంచి సచివాలయం ముందున్న అమరజ్యోతి వరకు BRS నేతలు, కార్యకర్తలు క్యాండిల్ ర్యాలీ నిర్వహించనున్నారు. రేపు తెలంగాణ భవన్‌లో జరిగే కార్యక్రమానికి KCR అధ్యక్షత వహిస్తారు. బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రంలో సాధించిన ప్రగతి ఇతర అంశాలపై ఆయన ప్రసంగించనున్నట్లు సమాచారం.

News June 1, 2024

కొత్త ప్రభుత్వంలో బియ్యం, చక్కెర ఎగుమతులపై సడలింపులు దక్కేనా?

image

కొత్త ప్రభుత్వంలో అగ్రికల్చర్ ట్రేడ్ పాలసీలపై మార్పులు ఉండాలని గ్లోబల్ మార్కెట్లు కోరుకుంటున్నాయి. చక్కెర, పలు రకాల బియ్యం ఎగుమతులపై మోదీ ప్రభుత్వం ఏడాదిగా ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. దేశీయ అవసరాలకు అందుబాటులో ఉంచడం, వినియోగదారుల ఖర్చుల తగ్గించడం కోసం ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే గోధుమల దిగుమతిపై పన్ను సడలింపులనూ నిలిపివేసింది. కొత్త ప్రభుత్వం వీటిపై దృష్టిపెట్టాలని మార్కెట్లు ఆశిస్తున్నాయి.

News June 1, 2024

పుణే ప్రమాదం: మైనర్ తల్లి అరెస్ట్

image

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పుణే కారు ప్రమాద ఘటనలో మైనర్ బాలుడి <<13342922>>తల్లి<<>>ని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇవాళ నిందితుడి స్టేట్‌మెంట్‌ను రికార్డు చేయనున్నట్లు పేర్కొన్నారు. కాగా ఇప్పటికే ఈ ఘటనలో మైనర్ తండ్రి, తాతతో పాటు ఇద్దరు ఫోరెన్సిక్ వైద్యులను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

News June 1, 2024

దేశమంతా ద్వేషానికి వ్యతిరేకంగా ఓటేసిందని నమ్ముతున్నా: ప్రకాశ్ రాజ్

image

ప్రధాని నరేంద్ర మోదీని ఓడిపోయిన చక్రవర్తిగా అభివర్ణించారు సీనియర్ నటుడు ప్రకాశ్ రాజ్. మోదీ ధ్యానం చేస్తోన్న ఫొటోలను Xలో పంచుకుంటూ.. ‘ఈరోజు ఎన్నికల చివరి దశ. నేను ద్వేషానికి వ్యతిరేకంగా అవిశ్రాంతంగా పోరాడాను. నా దేశం కూడా ద్వేషానికి వ్యతిరేకంగా ఓటు వేసిందని నేను నమ్ముతున్నా. 4వ తేదీన కలుద్దాం. వారాంతాన్ని బాగా గడపండి’ అని పోస్ట్ చేశారు.

News June 1, 2024

శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు

image

AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. అన్ని కంపార్ట్‌మెంట్లు నిండి శిలాతోరణం వరకు వేచి ఉన్నారు. నిన్న 67,873 మంది శ్రీవారిని దర్శించుకోగా, హుండీకి రూ.3.93 కోట్ల ఆదాయం సమకూరింది.

News June 1, 2024

ఎన్నికల ఏజెంట్లకు ఆల్కహాల్ టెస్ట్?

image

AP: ఈ నెల 4న ఎన్నికల కౌంటింగ్‌కు వెళ్లే రాజకీయ పార్టీల ఏజెంట్లకు ఆల్కహాల్ టెస్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది. కౌంటింగ్ హాల్‌లోకి వెళ్లే ముందుగా వారికి బ్రీత్ అనలైజర్‌తో టెస్ట్ చేయనున్నట్లు సమాచారం. ఆ టెస్ట్‌లో మద్యం తాగినట్లు తేలితే కౌంటింగ్‌ కేంద్రంలోకి అనుమతించకుండా వెనక్కి తిరిగి పంపుతారని తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వార్తలు పోలీసుల వాట్సాప్ గ్రూపుల్లో వైరల్‌గా మారాయి.

News June 1, 2024

ఫార్మసీ కోర్సులకు కొత్త ఫీజులు.. వివరాలివే

image

TG: ఈ ఏడాది ఫార్మసీతో పాటు పలు కోర్సుల ఫీజులు పెరగనున్నాయి. బీ ఫార్మసీకి కనిష్ఠ ఫీజు ₹45,000, గరిష్ఠ ఫీజు ₹1.10 లక్షలు, ఫార్మా(డీ)(₹55,000, ₹1.25 లక్షలు), ఎం ఫార్మసీ (₹1.10లక్షలు, ₹1.25లక్షలు), ఫార్మసీ(డీ)పీబీ కోర్సుకు (₹68,000, ₹1.15లక్షలు), ఎంఆర్క్(₹70వేలు, ₹80వేలు), బీఆర్క్(₹65వేలు, ₹1.20లక్షలు), BFA(₹35,000)గా ఉండనుంది. ఈ ఫీజుల్ని గతేడాదే పెంచారు. కానీ కౌన్సెలింగ్ పూర్తవడంతో అమలు చేయలేదు.

News June 1, 2024

నా డ్రీమ్ రోల్ అదే: కృతిశెట్టి

image

‘బాహుబలి’ సినిమాలో అనుష్క తరహాలో పాత్రలు చేయడం తన డ్రీమ్ రోల్ అని హీరోయిన్ కృతిశెట్టి అన్నారు. యాక్షన్, మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో సినిమాలు చేయాలని ఉందని తెలిపారు. జయాపజయాల గురించి తాను పట్టించుకోనని మీడియా సమావేశంలో చెప్పారు. శర్వానంద్‌కు జోడీగా నటించిన ‘మనమే’ సినిమాలో తన పాత్ర గత చిత్రాలకు భిన్నంగా ఉంటుందన్నారు. కాగా ‘మనమే’ మూవీ ఈ నెల 7న విడుదల కానుంది.

News June 1, 2024

ఇన్‌సైడర్ ట్రేడింగ్ అంటే ఏమిటి?

image

కంపెనీల యాజమాన్యాలు, ఉన్నతస్థాయి ఉద్యోగులకు మాత్రమే అందుబాటులో ఉన్న, పబ్లిక్‌కు వెల్లడించని సమాచారం ఆధారంగా ట్రేడింగ్ చేయడాన్ని ఇన్‌సైడర్ ట్రేడింగ్ అంటారు. కంపెనీ లాభ, నష్టాలు, నూతన పెట్టుబడుల సమాచారం బయట పెట్టకుండా కొందరు షేర్లు కొనుగోలు/విక్రయించి లబ్ధి పొందుతారు. అందుకే దీన్ని SEBI నిషేధించింది. ఎవరైనా <<13353039>>ఇన్‌సైడర్<<>> ట్రేడింగ్ చేస్తే భారీ ఫైన్‌లతోపాటు కొంతకాలం ట్రేడింగ్ చేయకుండా నిషేధిస్తుంది.

News June 1, 2024

రైతుల ఖాతాల్లోకే రుణమాఫీ డబ్బులు?

image

మహారాష్ట్ర తరహాలో రుణమాఫీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఉద్ధవ్ సర్కారు రూ.2 లక్షల లోపు ఉన్న పంటరుణాలను షరతులేవీ విధించకుండా మాఫీ చేసింది. ఒకేసారి రూ.20 వేల కోట్లను రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేసింది. ఆ సొమ్మును లోన్ పేమెంట్ కింద బ్యాంకులు జమ చేసుకున్నాయి. తెలంగాణ వ్యవసాయ, ఆర్థికశాఖ ఉన్నతాధికారులు MHలో ఈ విధానాన్ని అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినట్లు సమాచారం.