News June 1, 2024

లిగ్నోశాట్ ప్రయోగం ఇలా..

image

కెన్నెడీ స్పేస్ సెంటర్(US) నుంచి SpaceX రాకెట్ ద్వారా చెక్కతో తయారు చేసిన <<13352790>>లిగ్నోశాట్‌ను<<>> ప్రయోగిస్తారు. ఇది ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌(ISS)కు వెళ్తుంది. అక్కడ సైంటిస్టులు విపరీతమైన ఉష్ణోగ్రతల్లో హెచ్చుతగ్గుల మధ్య దీని పనితీరును పరీక్షించి డేటాను భూమికి పంపుతారు. ఇది విజయవంతమైతే పర్యావరణ అనుకూల ఉపగ్రహాల తయారీకి మార్గం సుగమం అవుతుంది. ఈ ప్రాజెక్టు అంతరిక్ష వ్యర్థాలపై పోరాటంలో గొప్ప ముందడుగు.

News June 1, 2024

ఓయోకు తొలిసారి లాభం.. ఏకంగా రూ.100 కోట్లు!

image

ఓయో కంపెనీ తొలిసారి రూ.100 కోట్ల నికర వార్షిక లాభాన్ని ఆర్జించిందని ఆ సంస్థ సీఈవో రితేశ్ అగర్వాల్ వెల్లడించారు. 2023-24లో రూ.100 కోట్ల లాభం వచ్చిందని, ఓయో లాభాన్ని నమోదు చేసిన తొలి ఆర్థిక సంవత్సరం ఇదేనని చెప్పారు. ప్రస్తుతం కంపెనీ వద్ద రూ.1,000 కోట్ల నగదు నిల్వలు ఉన్నాయన్నారు. కాగా, 2023-24 ఆదాయ గణాంకాలను వెల్లడించనప్పటికీ.. ఓయో ఆదాయం రూ.5,800 కోట్లు ఉంటుందని ఎకనామిక్ టైమ్స్ ఇదివరకు నివేదించింది.

News June 1, 2024

BREAKING: కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర తగ్గింపు

image

చమురు సంస్థలు ఇవాళ్టి నుంచి కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను రూ.72 మేర తగ్గించాయి. దీంతో హైదరాబాద్‌లో 19 కేజీల సిలిండర్ ధర రూ.1,903కు చేరింది. డొమెస్టిక్ సిలిండర్ రేట్లలో ఎలాంటి మార్పు లేదు. 14.2 కేజీల సిలిండర్ ధర రూ.855 వద్ద కొనసాగుతోంది.

News June 1, 2024

నేడు ముగియనున్న మోదీ 45 గంటల ధ్యానం

image

కన్యాకుమారిలోని రాక్ మెమోరియల్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ధ్యానం కొనసాగిస్తున్నారు. గురువారం సాయంత్రం నుంచి కొనసాగుతున్న ఆయన 45 గంటల దీక్ష ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు ముగుస్తుందని బీజేపీ వర్గాలు తెలిపాయి. దీక్ష ముగిసిన అనంతరం ఆయన ఢిల్లీకి బయల్దేరనున్నారు.

News June 1, 2024

చెక్కతో శాటిలైట్.. అక్టోబర్‌లో ప్రయోగం

image

ప్రపంచంలోనే తొలిసారి చెక్కతో తయారుచేసిన లిగ్నోశాట్ అనే ఉపగ్రహాన్ని జపాన్ సైంటిస్టులు అక్టోబర్‌లో అంతరిక్షంలో ప్రవేశపెట్టనున్నారు. ఇది భూవాతావరణంలోకి ప్రవేశించగానే పూర్తిగా కాలిపోతుంది. అంతరిక్ష వ్యర్థాలను తగ్గించాలనేది ఈ ప్రాజెక్టు లక్ష్యం. మాగ్నోలియా అనే కలపతో అన్నివైపులా 10CM పొడవుతో దీన్ని రూపొందించారు. క్యోటో వర్సిటీ, సుమిటోవా ఫారెస్ట్రీ భాగస్వామ్యంతో 2020 నుంచి దీన్ని అభివృద్ధి చేస్తున్నారు.

News June 1, 2024

కొత్త మెడికల్ కాలేజీలకు 380 పోస్టులు మంజూరు

image

AP: రాష్ట్రంలోని కొత్త మెడికల్ కాలేజీలకు 21 విభాగాల్లో 380 పోస్టులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో 17 కొత్త కాలేజీలు ఏర్పాటు చేస్తుండగా, 2023-24 విద్యా సంవత్సరంలో మచిలీపట్నం, నంద్యాల, ఏలూరు, రాజమండ్రి, విజయనగరం కళాశాలలను ప్రారంభించారు. 2024-25 అకడమిక్ ఇయర్‌లో పాడేరు, పులివెందుల, మదనపల్లె, మార్కాపురం, ఆదోని కాలేజీలు ప్రారంభం కానున్నాయి.

News June 1, 2024

వచ్చే 5 రోజులు వర్షాలు.. నేడు ఈ జిల్లాల్లో!

image

TG: వచ్చే 5 రోజులు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది. నేడు NLG, WRGL, HNK, జనగామ, SDPT, BNR, వనపర్తి, RR, HYD, MDCL, VKB, MHBR, NGKL, NRPT, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వర్షాలు పడతాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రేపు VKB, PDPL, RR, వనపర్తి, NRPT, గద్వాల్, SRCL, NGKL, SNRD, MDK, కామారెడ్డి, KRMR జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.

News June 1, 2024

నేడు పెద్ద హనుమాన్ జయంతి.. కొండగట్టుకు పోటెత్తిన భక్తులు

image

TG: నేడు పెద్ద హనుమాన్ జయంతి కావడంతో కొండగట్టు క్షేత్రానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. ఆలయ పరిసరాలు భక్తులతో నిండిపోయాయి. గత 2 రోజుల నుంచి ఉత్సవాలు జరుగుతుండగా, దీక్ష విరమణ చేయడం కోసం మాలదారులు ఆలయానికి పోటెత్తారు. భక్తుల రద్దీ నేపథ్యంలో 650 మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు. కోనేరులో నీటిని ఎప్పటికప్పుడు మార్చుతున్నామని, కొండపైకి 4 RTC బస్సులను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.

News June 1, 2024

GDP వృద్ధి ట్రైలర్ మాత్రమే: మోదీ

image

FY24 చివరి త్రైమాసికంలో <<13350881>>GDP<<>> వృద్ధి 7.8% నమోదవడం దేశ ఆర్థిక వ్యవస్థ పురోగతికి నిదర్శనమని PM మోదీ ట్వీట్ చేశారు. ఇది మరింత వేగవంతం కానుందన్నారు. ‘ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఎకానమీగా భారత్ కొనసాగుతోంది. FY24లో 8.2 వృద్ధి రేటు నమోదవడమే దీనికి ఉదాహరణ. కష్టపడి పనిచేస్తున్న ప్రజలకు ధన్యవాదాలు. నేను ఇప్పటికే చెప్పినట్లు రాబోయే మంచి రోజులకు ఇది ట్రైలర్ మాత్రమే’ అని పేర్కొన్నారు.

News June 1, 2024

నాసిరకం విత్తనాలు.. ఈ సూచనలు పాటించండి

image

నకిలీ విత్తనాలు రైతన్నల పొట్టకొడుతున్నాయి. నాణ్యమైన విత్తనాలకు కొన్ని సూచనలు:
*దళారుల వద్ద కొనొద్దు. వ్యవసాయశాఖ లైసెన్స్ ఉన్న దుకాణాల్లోనే కొనాలి.
*విత్తన తయారీ, గడువు తేదీ, సంస్థ పేరు, లేబుల్, ధర, అమ్మినవారి సంతకం చూసుకోవాలి.
*కచ్చితంగా రసీదు తీసుకోవాలి. బిల్లు లేనిదే విత్తనాలు కొనుగోలు చేయవద్దు.
*పంట పూర్తయ్యే వరకు ప్యాకెట్లు, బిల్లులు ఉంచుకోవాలి.