India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వేసవి సెలవులు ముగియడంతో తెలుగు రాష్ట్రాల్లోని జూనియర్ కాలేజీలు నేడు రీఓపెన్ కానున్నాయి. TGలో మొత్తం 3,269 కాలేజీలు ఉండగా, నిన్నటి వరకు 2,483 కళాశాలలకు ఇంటర్ బోర్డు అఫిలియేషన్ ఇచ్చింది. వీటిలో 1,443 ప్రైవేటు కాలేజీలు ఉన్నాయి. అయితే మిక్స్డ్ ఆక్యుపెన్సీ భవనాల్లోని ప్రైవేటు కాలేజీలపై బోర్డు ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో ఆయా కాలేజీల్లోని సెకండియర్ విద్యార్థుల భవితవ్యంపై అయోమయం నెలకొంది.
TG: ఇక నుంచి తెలంగాణ రాజకీయాలకూ సమయం కేటాయిస్తానని టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ నేతలతో చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ పోటీ చేస్తుందని, నేతలు సిద్ధం కావాలని సూచించారు. నిన్న HYDలో టీటీడీపీ నాయకులు చంద్రబాబుతో సమావేశం అయ్యారు. త్వరలోనే రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిని నియమిస్తానని, తెలుగు జాతి ఉన్నంత వరకు రెండు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ ఉంటుందని CBN స్పష్టం చేశారు.
దేశంలోకి రుతుపవనాలు ప్రవేశించే సమయం గత 150 ఏళ్లుగా మారుతున్నట్లు ఐఎండీ రికార్డులు చెబుతున్నాయి. గత ఏడాది జూన్ 8న కేరళ తీరాన్ని తాకిన రుతుపవనాలు ఈ సారి అంచనా కంటే ఒకరోజు ముందుగానే(మే 30) కేరళలోకి ప్రవేశించాయి. త్వరలో తెలుగు రాష్ట్రాలకు విస్తరించనున్నాయి. 1918లో మే 11న, అత్యంత ఆలస్యంగా 1972లో జూన్ 18న, 2020లో జూన్ 1, 2021లో జూన్ 3న, 2022లో మే 29న రుతుపవనాలు కేరళలోకి ఎంట్రీ ఇచ్చాయి.
యూకే పర్యటనకు వెళ్లిన ఏపీ సీఎం జగన్ రాష్ట్రానికి తిరిగొచ్చారు. కాసేపటి క్రితం గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. అక్కడి నుంచి తాడేపల్లి నివాసానికి వెళ్తారు. ఎన్నికల పోలింగ్ అనంతరం గత నెల 17న ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి విదేశీ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే.
లోక్‌సభ ఎన్నికల తుది విడత పోలింగ్ నేడు 8 రాష్ట్రాలు, ఒక UTతో కలిపి మొత్తం 57 స్థానాల్లో జరగనుంది. నరేంద్ర మోదీ, అనురాగ్ ఠాకూర్, కంగనా రనౌత్ వంటి ప్రముఖులతో సహా మొత్తం 904 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. పోలింగ్ పూర్తయిన తర్వాత సా.6 గంటల నుంచి ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెలువడనున్నాయి. వాటి కోసం రాజకీయ నేతలతో పాటు ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
కీర్తి సురేశ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘రఘు తాత’ సినిమాను ఆగస్టు 15న థియేటర్లలో విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. సుమన్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై విజయ్ కిర్‌గంధూర్ నిర్మిస్తున్నారు. అల్లుఅర్జున్ ‘పుష్ప-2’ కూడా ఆగస్టు 15నే థియేటర్లలో విడుదల కానున్న సంగతి తెలిసిందే.
TG: గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష హాల్ టికెట్లు నేటి మధ్యాహ్నం 2 గంటల నుంచి TGPSC <
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో MLC కవిత బెయిల్ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసిన విషయం తెలిసిందే. మే 30/31న తీర్పు వెలువరించే ప్రయత్నం చేస్తామని జడ్జి చెప్పినప్పటికీ, తీర్పు వెలువరించలేదు. నేటి నుంచి ఈనెల 29 వరకు కోర్టుకు వేసవి సెలవులు ఉన్నాయి. దీంతో సెలవుల తర్వాతే కవిత బెయిల్‌పై తీర్పు వచ్చే అవకాశముందని లీగల్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. మరోవైపు ఈనెల 3న కవిత కస్టడీ ముగియనుంది.
సీట్ బెల్ట్ వార్నింగ్ సిస్టమ్ పనితీరులో లోపాలు తలెత్తడంతో 1.25లక్షలకు పైగా కార్లను రీకాల్ చేసినట్లు Tesla ప్రకటించింది. 2012-2024 మధ్య తీసుకొచ్చిన S మోడల్, 2015-2024 మధ్య లాంచ్ అయిన X మోడల్, 2017-2023 మధ్య తెచ్చిన Y మోడళ్లను వెనక్కి రప్పిస్తున్నట్లు తెలిపింది. వీటిలో సీటు బెల్ట్ ధరించని డ్రైవర్లకు రిమైండర్ సిగ్నల్స్ టైమ్‌కి అందడం లేదని, భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా లేవని పేర్కొంది.
ప్రతిపక్షాలు ఓటమిని అంగీకరించినట్లు స్పష్టంగా కనిపిస్తోందని అమిత్‌షా అన్నారు. ఎగ్జిట్ పోల్స్ చర్చల్లో పాల్గొనకూడదన్న కాంగ్రెస్ నిర్ణయంపై ‘పారిపోకండి’ అంటూ Xలో పోస్ట్ పెట్టారు. ‘INCకి భారీ ఓటమి తప్పదు. ఆ విషయం ఆ పార్టీకి తెలుసు. ఇక ప్రజలను, మీడియాను ఎలా ఎదుర్కొంటుంది? అందుకే ఎగ్జిట్ పోల్స్ చర్చల్లో పాల్గొనకుండా పారిపోతోంది. అలా చేయకుండా ఓటమినెదుర్కొని ఆత్మపరిశీలన చేసుకోవాలి’ అని పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.