News June 1, 2024

ఈరోజు నమాజ్ వేళలు

image

తేది: జూన్ 1, శనివారం
ఫజర్: తెల్లవారుజామున 4:20 గంటలకు
సూర్యోదయం: ఉదయం 5:41 గంటలకు
జొహర్: మధ్యాహ్నం 12:14 గంటలకు
అసర్: సాయంత్రం 4:49 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 6:47 గంటలకు
ఇష: రాత్రి 8.08 గంటలకు
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News June 1, 2024

బెట్టింగ్‌లకు పాల్పడ్డ క్రికెటర్.. 16 నెలల నిషేధం

image

ఇంగ్లండ్ క్రికెటర్ బ్రైడన్ కార్సే‌కు ఆ దేశ క్రికెట్ బోర్డు షాక్ ఇచ్చింది. బెట్టింగ్‌లకు పాల్పడినందుకు 16 నెలల పాటు నిషేధం విధించింది. ఇంగ్లండ్ సెంట్రల్ కాంట్రాక్ట్‌పై సంతకం చేసిన కార్సే 2017-19 మధ్య జరిగిన వివిధ క్రికెట్ మ్యాచ్‌ల్లో 303 బెట్‌లు వేశారు. విచారణలో నేరాన్ని అంగీకరించడంతో క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లలో అతడిపై ఈసీబీ నిషేధం విధించింది. కార్సే ఇంగ్లండ్ తరఫున 14 వన్డేలు, 3 టీ20లు ఆడారు.

News June 1, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News June 1, 2024

జూన్ 1: చరిత్రలో ఈరోజు

image

1926: హాలీవుడ్ నటి మార్లిన్ మన్రో జననం
1964: సినీ దర్శకుడు ఎస్.వి.కృష్ణారెడ్డి జననం
1970: నటుడు మాధవన్ జననం
1975: మాజీ వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారిణి కరణం మల్లేశ్వరి జననం
1985: నటుడు నిఖిల్ సిద్ధార్థ జననం
1996: భారత మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి మరణం
* అంతర్జాతీయ బాలల దినోత్సవం
* ప్రపంచ పాల దినోత్సవం

News June 1, 2024

అర్జున్‌-మలైకా బ్రేకప్‌ వార్తలపై మేనేజర్ క్లారిటీ

image

బీటౌన్ జంట మలైకా అరోరా, అర్జున్ కపూర్ <<13348886>>బ్రేకప్ <<>>వార్తలను ఆమె మేనేజర్ ఖండించారు. అవన్నీ పుకార్లని కొట్టిపారేశారు. వాళ్లు ప్రస్తుతం కలిసే ఉన్నారని తెలిపారు. వారు విడిపోయారని వార్తలు వస్తుండటంతో మీడియా అతడిని ప్రశ్నించగా ఇలా స్పందించారు. మలైకా, అర్జున్ 2018 నుంచి సహజీవనం చేస్తున్నారు. గతంలో అర్బాజ్ ఖాన్‌ను పెళ్లాడిన ఆమె 18ఏళ్ల తర్వాత 2017లో విడాకులు తీసుకున్నారు.

News June 1, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News June 1, 2024

శుభ ముహూర్తం

image

తేది: జూన్ 1, శనివారం
బ.నవమి: ఉదయం 7:24 గంటలకు
దశమి: ఉదయం 5:04 గంటలకు
ఉత్తరాభాద్ర తెల్లవారుజామున 3:16 గంటలకు
దుర్ముహూర్తం: ఉదయం 5:34 నుంచి ఉదయం 7:18 వరకు
వర్జ్యం: మధ్యాహ్నం 1:47 నుంచి మధ్యాహ్నం 3:17 వరకు

News June 1, 2024

HEADLINES TODAY

image

★ కేసీఆర్‌కు తెలంగాణ దశాబ్ది ఉత్సవాల ఆహ్వానం
★ ఫోన్ ట్యాపింగ్ కేసు సీబీఐకి ఇవ్వాలి: ఎంపీ లక్ష్మణ్
★ కౌంటింగ్ ఏజెంట్లపై వ్యాఖ్యలు.. సజ్జలపై కేసు
★ AP: పోస్టల్‌ బ్యాలెట్ల వ్యవహారం.. తీర్పు రిజర్వ్
★ శనివారం సా.6.30 తర్వాతే ఎగ్జిట్ పోల్స్: EC
★ ఎగ్జిట్ పోల్స్ చర్చలకు కాంగ్రెస్ దూరం
★ ప్రధానిగా నా ఛాయిస్ రాహులే: ఖర్గే
★ బర్డ్ ఫ్లూ ముప్పు.. రాష్ట్రాలకు కేంద్రం అలర్ట్
★ ప్రజ్వల్ అరెస్ట్.. 6 రోజుల కస్టడీ

News June 1, 2024

UPలో 9లక్షల విద్యార్థులకు నో ఆధార్!

image

ఉత్తర ప్రదేశ్‌లో 9,01,106మంది ప్రైమరీ స్కూల్ విద్యార్థులకు సంబంధించిన ఆధార్ కార్డులు విద్యాశాఖ వద్ద లేవు. అసలు వాళ్లకు ఆధార్ లేనట్లు సమాచారం. దీని వల్ల యూనిఫామ్స్, బ్యాగులు, షూ, సాక్స్, స్టేషనరీ వంటి వస్తువుల కోసం ప్రభుత్వం ఒక్కో విద్యార్థికి ఇచ్చే రూ.1,200 బదిలీ నిలిచిపోయింది. దీంతో ఆధార్ ధ్రువీకరణను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ జనరల్ అధికారులను ఆదేశించారు.

News June 1, 2024

మాక్ పోల్ అంటే ఏంటో తెలుసా?

image

పోలింగ్ ప్రారంభానికి గంట ముందు ఈ మాక్ పోల్ నిర్వహిస్తారు. EVMలు సరిగ్గా పని చేస్తున్నాయా అని తనిఖీ చేసేందుకు ప్రిసైడింగ్ ఆఫీసర్ పర్యవేక్షణలో ఈ పోల్ జరుగుతుంది. ఇందులో భాగంగా మొత్తం 50ఓట్లు వేస్తారు. ఒకవేళ సాధారణ పోలింగ్ మధ్యలో EVM పాడైతే, దాని స్థానంలో పెట్టే కొత్త EVMలోనూ మాక్ పోల్ నిర్వహిస్తారు. మాక్ పోల్ ముగిశాక కంట్రోల్ యూనిట్‌పై ఉన్న క్లియర్ బటన్ నొక్కి సాధారణ పోలింగ్ ప్రారంభిస్తారు.