News May 31, 2024

ముగియనున్న పోలింగ్.. అందరి దృష్టి ఎగ్జిట్ పోల్స్‌పైనే!

image

సార్వత్రిక ఎన్నికలు-2024లో భాగంగా చివరిదైన 7వ దశ పోలింగ్ రేపు జరగనుంది. 8 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోని 57 లోక్‌సభ స్థానాల్లో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. అందరి దృష్టి పోలింగ్ ముగియగానే వెలువడే ఎగ్జిట్ పోల్స్‌పై నెలకొంది. జూన్ 4న ఫలితాలు వెలువడనుండగా ముందే ఎగ్జిట్ పోల్స్ ద్వారా ఓ అంచనాకు వచ్చేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

News May 31, 2024

చార్మినార్ వెళ్లిన BRS నేతలపై కేసు

image

TG: ముందస్తు అనుమతి లేకుండా చార్మినార్ వద్దకు వెళ్లిన బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, పద్మారావు, మాగంటి గోపీనాథ్, రాజయ్యపై కేసు నమోదైంది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని చార్మినార్ పోలీసులు నలుగురు నేతలపై కేసు పెట్టారు. కాగా రాష్ట్ర చిహ్నం నుంచి చార్మినార్‌ను తొలగించాలన్న ప్రభుత్వ నిరసిస్తూ వీరంతా నిన్న అక్కడ నిరసన చేపట్టారు.

News May 31, 2024

భారత ఎన్నికలను ప్రభావితం చేసేందుకు ఇజ్రాయెల్ సంస్థ యత్నం!

image

భారత్‌లో సార్వత్రిక ఎన్నికలు చివరి దశకు చేరిన వేళ సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఎన్నికలను ప్రభావితం చేసేందుకు ఓ ఇజ్రాయెల్‌ కంపెనీ తీవ్రంగా ప్రయత్నించిందని అమెరికాకు చెందిన OpenAI వెల్లడించింది. ఆ కంపెనీ BJPకి వ్యతిరేకంగా, కాంగ్రెస్‌కి మద్దతుగా కామెంట్స్ పెట్టించిందని తెలిపింది. అయితే దీన్ని గుర్తించిన 24గంటల్లోనే ఆ కంపెనీ కార్యకలాపాలను తాము అడ్డుకున్నామని పేర్కొంది.

News May 31, 2024

గూగుల్ సేవలకు అంతరాయం

image

ప్రముఖ సెర్చ్ ఇంజిన్‌ ‘గూగుల్’ సేవలకు అంతరాయం ఏర్పడింది. గూగుల్ న్యూస్, డిస్కవర్‌ సర్వీసులు పలువురికి ఆగిపోయాయి. పలు దేశాల్లో యూజర్లు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. గూగుల్‌ సెర్చ్‌లో ఇబ్బందులు వస్తుండటంపై పలువురు ట్విటర్‌లో స్క్రీన్‌ షాట్స్‌ను షేర్‌ చేస్తున్నారు. దీనిపై స్పందించిన గూగుల్.. ‘కొన్ని ఫీచర్‌ల సేవల్లో అంతరాయం నెలకొంది. సమస్యను గుర్తించాం. సరిచేసేందుకు ప్రయత్నిస్తున్నాం’ అని తెలిపింది.

News May 31, 2024

గొర్రెల పంపిణీ స్కీంలో ₹700 కోట్ల స్కామ్: ACB

image

TG: గొర్రెల పంపిణీ పథకంలో రూ.700 కోట్ల స్కామ్ జరిగిందని ACB దర్యాప్తులో గుర్తించింది. ఇప్పటికే ఈ కేసులో 10 మంది అధికారులను అరెస్ట్ చేసిన ACB.. ఇవాళ <<13350744>>ఇద్దరు<<>> కీలక అధికారులను అరెస్ట్ చేసింది. స్కామ్‌లో ఉన్నతాధికారుల పాత్రపై పూర్తిస్థాయి విచారణ చేయనుంది. లబ్ధిదారులకు బదులు ప్రైవేట్ వ్యక్తుల(బ్రోకర్లు, అధికారుల) ఖాతాల్లోకి నగదు బదిలీ అయినట్లు ACB తేల్చింది. లబ్ధిదారుల ఫిర్యాదుతో ఈ వ్యవహారం బయటపడింది.

News May 31, 2024

రాజీనామాతో కేసీఆర్ బాటకే జై కొట్టారు: కేటీఆర్

image

TG: రాష్ట్ర సహకార బ్యాంకు పదవులకు రాజీనామా చేసిన రవీందర్‌రావు, మహేందర్‌రెడ్డిలను మాజీ మంత్రి కేటీఆర్‌ అభినందించారు. ‘తెలంగాణ ప్రయోజనాలే ముఖ్యమంటూ, అవసరమైనప్పుడు పదవులను గడ్డిపరకలా వదిలివేయడం నేర్పిన కేసీఆర్ బాటలో.. పదవులకు రాజీనామా చేయడం అభినందనీయం. కాంగ్రెస్ పార్టీలో చేరి పదవులు కాపాడుకోవాలని ప్రలోభాలకు గురిచేసినా బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ బాటకే జై కొట్టారు’ అంటూ ఆయన ట్వీట్ చేశారు.

News May 31, 2024

రేపు చరణ్ చేతుల మీదుగా ‘మనమే’ ట్రైలర్ విడుదల

image

టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ లేటెస్ట్ మూవీ ‘మనమే’. ఇప్పటికే పోస్టర్స్, ఫస్ట్ సాంగ్ రిలీజ్ కాగా.. ట్రైలర్‌పై చిత్ర యూనిట్ అప్‌డేట్ ఇచ్చింది. రేపు ఉదయం 11.07 గంటలకు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ట్రైలర్‌ను రిలీజ్ చేస్తారని ప్రకటించింది. శ్రీరామ్ ఆదిత్య డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్‌గా నటించారు. జూన్ 7న మూవీ రిలీజ్ కానుంది.

News May 31, 2024

ఎగ్జిట్​ పోల్స్​ అంటే ఏంటి? ఎవరిస్తారు?

image

ఎన్నికల పోలింగ్ జరిగేటప్పుడు/పోలింగ్ పూర్తయ్యాక వివిధ ఏజెన్సీలు సర్వేలు చేస్తాయి. ప్రజల అభిప్రాయాలను సేకరించి ఏ పార్టీకి మెజార్టీ వస్తుంది? ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది? ఏ పార్టీ ఓడిపోతుంది? అని అంచనా వేస్తాయి. AXIS MY INDIA, C-ఓటర్, చాణక్య, టైమ్స్ నౌ, ఇండియా టుడే, CNX, ABP తదితర సంస్థలు సర్వేలు నిర్వహించి ప్రాచుర్యం పొందాయి. అయితే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తలకిందులైన సందర్భాలూ ఉన్నాయి.

News May 31, 2024

ALERT.. రేపు ఈ జిల్లాల్లో వర్షాలు

image

AP: రేపు అల్లూరి, కోనసీమ, తూ.గో, ప.గో, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడతాయని పేర్కొంది. అటు ఇవాళ పల్నాడు(D) వినుకొండలో 45.9 డిగ్రీలు, ప్రకాశం(D) పుల్లలచెరువులో 45.4, NTR(D) నందిగామలో 45.3, GNT(D) తుళ్లూరు, ఫిరంగిపురంలో 45 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

News May 31, 2024

బర్డ్‌ఫ్లూ ముప్పు: రాష్ట్రాలను అలర్ట్ చేసిన కేంద్రం

image

పౌల్ట్రీ, పక్షుల అసాధారణ మరణాలు సంభవిస్తే వెంటనే తమకు తెలియజేయాలని రాష్ట్రాలను కేంద్రం ఆదేశించింది. AP(నెల్లూరు), MH(నాగ్‌పూర్), KL(అలప్పుజ, కొట్టాయం), JH(రాంచీ)లలో ఈ ఏడాది <<13347975>>బర్డ్ ఫ్లూ<<>> వ్యాప్తిని గుర్తించామని తెలిపింది. ఇది మనుషులకు సోకే అవకాశం ఉందని.. మందులు, PPE కిట్లు, మాస్కులు అందుబాటులో ఉంచుకోవాలని సూచించింది. ఇన్‌ఫెక్షన్ సోకిన పక్షులను వధించే, పర్యవేక్షించే వారి నమూనాలను టెస్ట్ చేయాలంది.